ఇండియా-ఆస్ట్రేలియా: కుదిరిన అణు ఒప్పందం
ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ఇండియా పర్యటన ఫలితంగా ఇరు దేశాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. దాదాపు రెండు సంవత్సరాలుగా విడతలు విడతలుగా జరిగిన చర్చలు ఫలప్రదమై శుక్రవారం సంతకాలతో ఒప్పందం రూపం సంతరించుకున్నాయి. “పౌర అణు సహకార ఒప్పందం” గా పిలుస్తున్న ఈ ఒప్పందానికి అమెరికా ఆమోదం ఉంది. అమెరికా ‘ఊ’ అనకుండా ఒప్పందం సాధ్యం కాదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్.పి.టి) పై ఇండియా సంతకందారు కానప్పటికీ ఆస్ట్రేలియాతో అణు…