అజ్మల్ కసబ్ ఉరి శిక్ష అమలు

26/11 గా ప్రస్తావించే ముంబై మారణహోమంలో పాల్గొన్న అజ్మల్ కసబ్ ను ఉరి తీశారని పత్రికలు తెలిపాయి. కసబ్ ఉరితీతను మహారాష్ట్ర హోమ్ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ధృవీకరించాడని ‘ది హిందూ’ తెలిపింది. మారణ హోమానికి నాలుగు సంవత్సరాలు నిండడానికి ఐదు రోజులకు ముందు అజ్మల్ కసబ్ ఉరికంబం పై శిక్ష అనుభవించాడు. కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నవంబరు 8 తేదీన తిరస్కరించడంతో కసబ్ ని ఉరి తీయడానికి ఉన్న…

‘అజ్మల్ కసబ్’ ను ఉరి తియ్యాలి -పాకిస్తాన్ హోం మంత్రి

పాకిస్ధాన్ మొదటిసారిగా కసబ్ ను టెర్రరిస్టు అని పేర్కొంది. “కసబ్ ఒక టెర్రరిస్టు. అతను ప్రభుత్వేతర వ్యక్తి. అతనిని ఉరి తీయాలి” అని పాకిస్ధాన్ అంతర్గత (హోం) శాఖా మంత్రి రెహ్మాన్ మాలిక్ అన్నాడు. మాల్దీవుల లో జరుగుతున్న సార్క్ సమావేశాల సందర్భంగా హాజరైన రెహ్మాన్ మాలిక్ అక్కడ భారత విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్ధాన్ నుండి త్వరలో జ్యుడీషియల్ కమిషన్ ఇండియా సందర్శించనున్నదనీ, ఆ సందర్శన ముంబై టెర్రరిస్టు దాడులపైన పాక్ లో…

ముంబై దాడుల నిందితుడు ‘అజ్మల్ కసబ్’ ఉరి శిక్షపై స్టే విధించిన సుప్రీం కోర్టు

26/11 ముంబై దాడుల నిందితులలో సజీవంగా ఉన్న ఏకైక టెర్రరిస్టు ‘అజ్మల్ కసబ్’ కు విధించిన ఉరిశిక్ష పై సుప్రీం కోర్టు సోమవారం స్టే విధించింది. చట్టం ఎటువంటి అరమరికలు లేకుండా తన ప్రక్రియను తాను అనుసరించడానికి వీలుగా అజ్మల్ కసబ్ అప్పీలును తాము పూర్తి స్దాయిలో విచారించదలుచుకున్నామని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. అనేక సంస్ధలు, వ్యక్తులు ప్రాణాలు తీసే ఉరిశిక్షను రద్దు చేయాలనీ, ఉరి శిక్ష వలన నేరస్ధుడు తనను తాను సంస్కరించుకునే…

టెర్రరిస్టు అజ్మల్ కసబ్‌ను 1 1/2 సం.లు భద్రంగా ఉంచడానికి ఐన ఖర్చు రు.11 కోట్లు

ముంబై టెర్రరిస్టు దాడుల్లో పాల్గొని దొరికిపోయిన అజ్మల్ కసబ్ భద్రత కోసం ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు 10.87 కోట్ల రూపాయలని తేలింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐ.టి.బి.పి) విభాగం అజ్మల్ కసబ్ కి సెక్యూరిటీ అందిస్తున్నందుకు ఇప్పటివరకూ ఖర్చయిన రు. 10.87 కోట్లను తమకు తిరిగి చెల్లించాలని బిల్లు పంపడంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం షాక్‌కి గురైంది. ఐటిబిపి డైరెక్టర్ జనరల్ ఆర్.కె.భాటియా ఈ బిల్లును పంపాడు. మార్చి 28, 2009 నుండి సెప్టెంబరు…