అచ్చే దిన్: అడ్డదారిలో గ్యాస్ ధర పెంపు

బి.జె.పి నేత నరేంద్ర మోడి హామీ ఇచ్చిన ‘మంచి రోజులు’ ప్రజల ముందుకు ఒక్కొక్కటి వచ్చి వాలుతోంది. 4.5 కోట్ల కుటుంబాలకు ఉపాధి ఇచ్చే చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ లు అనుమతించేది లేదన్నారు. ఆన్-లైన్ రిటైల్ మార్కెటింగ్ గేట్లను బార్లా తెరిచేశారు. ‘శ్రమయేవ జయతే’ అంటూ కార్మికుడిని ‘శ్రమ యోగి’ అని నెత్తిన పెట్టుకున్నామన్నారు. కార్మికుల హక్కులను నేల రాస్తూ కంపెనీలకు చిత్తానుసారం ‘హైర్ అండ్ ఫైర్’ చేసే హక్కును దఖలు పరిచారు. తాజాగా గ్యాస్ సిలిండర్…

బి.జె.పి అచ్ఛే దిన్ కింది వరకూ చేరేనా! -కార్టూన్

“బి.జె.పి వాళ్ళ అచ్ఛే దిన్, బొట్టు బొట్టుగా మన వరకూ కారుతాయా, లేదా?” ********** మోడి/బి.జె.పి ప్రభుత్వం హానీ మూన్ రోజులు గడిచిపోయాయి. వారే పెట్టుకున్న వంద రోజుల గడువు కూడా పూర్తయింది. కానీ వారు అట్టహాసంగా ప్రకటించిన అభివృద్ధి, ఉద్యోగాలు మాత్రం ఇంతవరకూ లేశామాత్రమైనా పత్తా లేవు. పల్లెల్లో కూలీ/రైతు ఇల్లాలికి ‘ట్రికిల్ డౌన్ సిద్ధాంతం‘ తెలుసని కాదు. కానీ బొట్లు బొట్లుగా రాలి పడడం అంటే ఏమిటో వారికి తెలుసు. గొప్పోళ్లకు లభిస్తున్న ‘మంచి…

ప్రయోజనాల సమతూకం -ది హిందు ఎడిట్

(మోడి ఇటీవల ప్రకటించిన కార్మిక వ్యతిరేక కార్మిక సంస్కరణలకు ది హిందు మద్దతుగా వస్తూ ఈ సంపాదకీయం వెలువరించింది. నిస్పక్షపాత ముద్రను కాపాడుకోవడానికి ఈ సంపాదకీయంలో పత్రిక చాలా ప్రయాసపడింది. అనునయ మాటలతో, నచ్చజెప్పే ధోరణితో పాఠకుల చేత చేదు మాత్రను మింగించడానికి కృషి చేసింది. తనిఖీల లోపం వల్ల కార్మికులకు నష్టం కలుగుతుందని నామమాత్రంగా చెబుతూ అంతిమంగా భారత దేశ శ్రామిక ప్రజల హక్కులకు భంగం కలిగించే కార్మిక సంస్కరణలను నిండు మనసుతో పత్రిక ఆహ్వానించడం…

మంచిరోజుల్లో మరో రోజు: కట్లు తెంచుకున్న డీజెల్

  ప్రధాని మోడి హామీ ఒసంగిన మంచి రోజుల్లో మరో శుభ దినం రానే వచ్చెను. డీజెల్ ధరల్ని మార్కెటింగ్ కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తూ డీ-రెగ్యులేషన్ కు మోడి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ను పడదిడుతూ కూడా, అదే కాంగ్రెస్ ఏలికలు నియమించిన రంగరాజన్ కమిటీ ఫార్ములాయే ఆదర్శంగా దేశీయ గ్యాస్ రేట్లను ఎం.ఎం.బి.టి.యు ఒక్కింటికి 4.2 డాలర్ల నుండి 5.61 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారం…