రాఫెల్ డీల్: లంచం సాక్ష్యాలున్నా సి‌బి‌ఐ దర్యాప్తు చేయలేదు!

ఫ్రాన్స్ యుద్ధ విమానాల కంపెనీ దాసో ఏవియేషన్ (Dassault Aviation), భారత దేశానికి రాఫేల్ యుద్ధ విమానాలు సరఫరా చేసిన సంగతి తెలిసిందే. యూ‌పి‌ఏ హయాంలోనే 125 విమానాల సరఫరాకు ఒప్పందం కుదిరినా అంతిమ ఒప్పందం సాగుతూ పోయింది. నరేంద్ర మోడి అధికారం చేపట్టిన వెంటనే ఈ ఒప్పందాన్ని పరుగులు పెట్టించాడు. ఒప్పందాన్ని ప్రభుత్వం-ప్రభుత్వం ఒప్పందంగా మార్చి 36 రాఫేల్ జెట్ విమానాలు సరఫరాకు ఒప్పందం పూర్తి చేశాడు. ఈ ఒప్పందంలో లంచం చేతులు మారాయని ఫ్రెంచి…

ఈ తుఫాను గాలులు ఎక్కడివి? -కార్టూన్

“ఈ విప్లవాగ్నులు ఎచటివి అని అడిగితే నగ్జల్బరి వసంత మేఘ గర్జనవైపు వేలు చూపండి” ప్రముఖ విప్లవ కవి చెరబండరాజు రాసిన ఒక కవితలోని పాదాలివి. ఒక కాలంలో కాలేజీలు, యూనివర్శిటీలను ఒక్క ఊపు ఊపి బహుళ ప్రసిద్ధి చెందిన పాదాలివి. భారత ప్రజలు మార్పుని కోరుకుంటున్నారు అన్న నిజానికి సంకేతంగా 1960ల చివర్లో పశ్చిమ బెంగాల్ లో నగ్జల్బరి గ్రామంలో పుట్టిన రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రస్తావిస్తూ చెరబండరాజు ఈ మాటలు రాశాడు. నగ్జల్బరిలో వసంత…