వ్యాపం స్కాం: నిష్క్రియ, అబద్ధాలు, హత్యలు! -2
మొదటి భాగం తరువాత…… . సాక్షులు, నిందితుల హత్యలు కుంభకోణంలో అత్యంత దారుణమైన విషయం నిందితులు, సాక్షుల మరణాలు. సాక్షులను మాయం చేస్తే కేసు అనుకున్న విధంగా తిప్పుకోవచ్చన్నది పాత సూత్రమే. కానీ వ్యాపం కుంభకోణంలోని సాక్షులు, నిందితులు ఇరువురూ డజన్ల సంఖ్యలో అనుమానాస్పద రీతిలో మరణించడం -కనీసం సమీప గతంలో- ఎన్నడూ ఎరుగనిది. సంఘటిత నేరస్ధ ముఠాలు పధకం ప్రకారం పని చేస్తే తప్ప ఇలాంటి మరణాలు సాధ్యం కావు. అత్యున్నత స్ధాయిలో ఉన్న సాక్షులు,…