లోకాయుక్త హెగ్డె క్షమాపణ చెప్పాలి -రెడ్డి బ్రదర్ డిమాండ్

రెడ్డి బ్రదర్స్ లలో ఒకరైన కర్ణాటక రెవిన్యూ మంత్రి కరుణాకర రెడ్డి తనపైన అక్రమ మైనింగ్ ఆరోపణలు చేసినందుకు లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. తనపైన లోకాయుక్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేనందున క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు  ఓబులాపురం మైనింగ్ కంపెనీ డైకెక్టరుగా తాను 2004 లోనే రిటైర్ అయ్యాననీ, ఆ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రికార్డులు కూడా ఉన్నాయనీ కరుణాకర రెడ్డి తెలిపాడు.…

వెంటనే రాజీనామా చేయండి -యెడ్యూరప్పకు బి.జె.పి ఆదేశం

అక్రమ మైనింగ్‌ను అనుమతించి ముడుపులు అంగీకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ఎట్టకేలకు రాజీనామా చేయనున్నాడు. అధికారం చేపట్టినప్పటినుండి నిరంతరం గండాలతో నెట్టుకుంటూ వచ్చిన బి.ఎస్.యెడ్యూరప్ప ముఖ్యమంత్రిత్వం ముగింపుకు వచ్చింది. సి.ఎం నేరుగా అక్రమ మైనింగ్ కుంభకోణంలో భాగం పంచుకున్నాడని లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె నివేదిక స్పష్టం చేయడంతో బి.జె.పి నాయకత్వం యెడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని గురువారం ఆదేశించింది. లోకాయుక్త నివేదిక దృష్ట్యా కర్ణాటకలో నాయకత్వాన్ని మార్చాలని నిర్ణయించి ఆ మేరకు ఆదేశాలు జారీ…

ఒక సి.ఎం, 8 నేతలు, 500 అధికారులు, రు.1827 కోట్లు.. ఇదీ మైనింగ్ కుంభకోణం!

ఇది కుంభకోణాల యుగం. నిజానికి నల్లదొరల పాలన అంతా కుంభకోణాల మయమే. తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వచ్చారు తప్ప స్వాతంత్ర్యం వలన భారత ప్రజా కోటికి ఒరిగిందేమీ లేదన్నది నిష్టర సత్యంగా నానాటికీ రుజువౌతోంది. ఎవరూ గట్టి ప్రయత్నం చేయకుండానే రాజకీయ నాయకులు తమ మధ్య రగిలే కుమ్ములాటలవలన, రాజకీయ విభేధాల వలన తమ అవినీతి కార్యకలాపాలను బయట పెట్టుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్ధుల అలవిగాని సంపదల గుట్టుమట్టులని బైట పెట్టడం అనేది ఎన్నికల రాజకీయాల్లో…