జయ కారుకు కొర్టే ఇంజన్ -కార్టూన్

ఈ కార్టూన్ ను రెండు విధాలుగా అర్ధం చేసుకోవచ్చు. ఒకటి: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలను మరోసారి చేపట్టిన జయలలితకు ఆమెను జైలు జీవితం నుండి బైటపడడానికి కోర్టులే సహకరించాయన్న అర్ధం ఈ కార్టూన్ లో ద్యోతకం అవుతోంది. రెండు: ఇన్నాళ్లూ ఆమె ముఖ్య మంత్రిగా కారులో ప్రయాణించకపోవడానికి కోర్టు కేసులు ఆటంకంగా, అడ్డంగా ఉన్నాయని లాయర్లు శ్రమించి ఆ ఆటంకాన్ని తొలగించి సిగ్నల్ ఇవ్వడంతో ఆమె తిరిగి ప్రయాణం ప్రారంభించారని మరో అర్ధం. ఈ రెండు…

జయలలిత కేసు: 10 శాతం అక్రమ ఆస్తులు ఉండొచ్చు!

అక్రమ ఆస్తుల కేసులో నిర్దోషిగా జయలలిత బైటకు వచ్చేశారు. ఇప్పుడామె మళ్ళీ ఎన్నికల్లో గెలిచినంత సంబరాలు తమిళనాడులో జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో జయలిత అభిమానులు మునిగిపోతే ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా, చివరికి సి.పి.ఐతో సహా, జయలలిత అభిమానుల ఆనందంలో భాగం పంచుకోవడమే విచిత్రం. ప్రధాని మోడి సైతం ఆమెకు అభినందనలు తెలిపారట! ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పు ఒక వింత సంగతిని బైటికి…

జైలా, బెయిలా? -కార్టూన్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఎ.ఐ.ఎ.డి.ఏం.ఎ అధినేత్రి, ప్రస్తుతం బెంగుళూరులో ఊచలు లెక్కబెడుతున్న రాజకీయ నాయకురాలు జయలలిత కేసు కొద్ది రోజుల్లో సుప్రీం కోర్టు ముందుకు రానుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రుజువు కావడంతో 4 సం.ల జైలు శిక్షను సెషన్ కోర్టు విధించింది. శిక్ష రద్దు చేయాలని కోరుతూ హైకోర్టుకు అప్పీలు చేసిన జయలలిత, అప్పీలుపై విచారణ జరిపే లోపు తనకు బెయిలు ఇవ్వాలని హై కోర్టును కోరారు. సదరు అప్పీలును హై…