అంటరానితనం సజీవం, పాటించువారు బ్రాహ్మణులు -సర్వే
“అంతరానితనం అమానుషం, చట్ట రీత్యా నేరం” అని భారత ప్రభుత్వం గత 67 యేళ్లుగా ప్రచారం చేస్తోంది. అంతరానితనం నిర్మూలించడానికి అని చెబుతూ చట్టాలు చేసింది. ఇన్నేళ్ల తర్వాత కూడా భారత దేశంలో అంతరానితనం సజీవంగా కొనసాగుతోందని జాతీయ, అంతర్జాతీయ సంస్ధల సర్వేలో వెల్లడి అయింది. జాతీయ అనువర్తిత ఆర్ధిక పరిశోధనా సంస్ధ (National Council for Applied Economic Research -NCAER) వారు నిర్వహించిన భారత మానవాభివృద్ధి సర్వే (Indian Human Development Survey -IHDS)…