యాహూ అస్తమయం ఇక గోడ మీది రాత!

గూగుల్ కంటే ముందు స్ధాపించబడి ఇంటర్నెట్ సర్చ్ ప్రపంచాన్ని రారాజుగా ఏలిన యాహూ త్వరలో ఒక స్వతంత్ర కంపెనీగా ఉనికి చాలించనున్నది. యాహూ కేంద్ర (కోర్) బిజినెస్ కార్యకలాపాలను అమెరికా టెలీ కమ్యూనికేషన్ దిగ్గజం వెరిజాన్ కంపెనీ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిన దృష్ట్యా ఈ పరిణామం పూర్తి కావడమే ఇక మిగిలింది. ఆపరేటింగ్ బిజినెస్ గా పేర్కొనబడుతున్న యాహూ ఇంక్ కార్యకలాపాలను 4.4 బిలియన్ డాలర్లకు (వోక్స్ పత్రిక 4.8 బిలియన్ డాలర్లుగా పేర్కొంది) కొనుగోలు…

పౌల్ట్రీ తగాదా: ఇండియాపై ఆంక్షలు కోరుతున్న అమెరికా

‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అంటుంటారు పెద్దలు. ఈ సిద్ధాంతాన్ని అమలు చేయటంలో అమెరికాని మించిన వారు ఉండబోరు. “ఇండియా అంతకంతకూ అమెరికాకు నమ్మకమైన భాగస్వామిగా మారుతోంది” అని వివిధ వేదికల పైన చెబుతున్న అమెరికా కోడిగుడ్ల వాణిజ్యం విషయంలో ఇండియాపై పగబట్టి వ్యవహరిస్తోంది. అమెరికా నుండి వచ్చే కోడి గుడ్లు, కోడి మాంసం, పందుల దిగుమతులపై ఇండియా ఎప్పటి నుండో పలు ఆంక్షలు విధించింది. పౌల్ట్రీ దిగుమతుల ద్వారా అమెరికా నుండి బర్డ్ ఫ్లూ ప్రమాదం…

వేదిక్ ఇండియన్లు గోమాంస భక్షకులు -ఆది గాడ్రెజ్

ఆవు పూజ భారతీయ ప్రాచీన సంస్కృతిగా చెప్పడం వాస్తవ విరుద్ధం అని భారత బడా పారిశ్రామిక కుటుంబాల్లో ఒకటయిన గాడ్రెజ్ అధినేత ఆది గాడ్రెజ్ స్పష్టం చేశారు. గో వధ, ఆవు మాంసం లపై నిషేధం వలన భారత ఆర్ధిక వ్యవస్ధకు నష్టం వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “(మోడి ప్రవేశ పెట్టిన) కొన్ని విధానాలు భారత ఆర్ధిక వృద్ధికి నష్టం కలగజేస్తున్నాయి. ఉదాహరణకి కొన్ని రాష్ట్రాల్లో ఆవు మాంసంపై విధించిన నిషేధం.” అని ఆయన…

అగస్టా ఛాపర్: సోనియాను ఇరికించే మాయోపాయం?

4 రాష్ట్రాల ఎన్నికలు జనానికి ముఖ్యంగా పత్రికల పాఠకులకు, చానెళ్ల వీక్షకులకు గడ్డు రోజులు తెచ్చి పెట్టాయి. ఎన్నికల ప్రచారం అంటే ప్రజలు తమ ఎంపిక కోసం తమ ముందు ఏ యే అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవడం. ఇలాంటి అవకాశాలను ప్రజల ముందు ఉంచే పంధా నుండి రాజకీయ పార్టీలు ఎప్పుడో తప్పుకోవడం ఎన్నికల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న అదనపు సమస్య. ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంలో వారి చేతుల్లో ఉన్న ఒక ప్రధాన…

మహారాష్ట్ర: నీళ్ళు – క్రికెటు – డబ్బు!

“ఈ రకంగా మీరు (బి‌సి‌సి‌ఐ) నీళ్లని ఎలా వృధా చేయగలరు? జనం ముఖ్యమా లేక మీ ఐ‌పి‌ఎల్ మ్యాచ్ లు ముఖ్యమా? ఇంత అజాగ్రత్తగా ఎలా ఉండగలరు? నీళ్లని ఈ రకంగా ఎవరు వృధా చేస్తారు? ఇది నేరపూరిత వృధా. మహా రాష్ట్రలో పరిస్ధితి ఎలా ఉన్నదో మీకు తెలుసు. నీళ్ళు సమృద్ధిగా దొరికే మరే ఇతర రాష్ట్రానికైనా మీరు ఐ‌పి‌ఎల్ మ్యాచ్ లను తరలించడం ఆదర్శవంతం అవుతుంది.” జస్టిస్ వి ఎం కనడే, జస్టిస్ ఎం…

ఫ్రీ డేటా కోసం ఫేస్ బుక్ విసిరిన గేలం ‘ఫ్రీ బేసిక్స్’ -కార్టూన్

ఫేస్ బుక్ వ్యవస్ధాపకుడు మార్క్ జూకర్ బర్గ్ పేరు ఈ మధ్య ఇండియాలో తరచుగా వినిపిస్తోంది. భారత దేశంలోని పేదలకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తానంటూ ఆయన ప్రతిపాదించిన ‘ఫ్రీ బేసిక్స్’ ఇందుకు ప్రధాన కారణం. Free Basics పేరుతో ఫేస్ బుక్ కంపెనీ అందుబాటులో ఉంచుతున్న వేదిక ద్వారా పేద ప్రజలు సైతం ఉచితంగా ఇంటర్నెట్ సేవలను, విద్య-వైద్య-ప్రయాణ-ఉపాధి-ఆరోగ్య-వార్తా సేవలను పొందవచ్చని ఫేస్ బుక్ ఊరిస్తోంది. ఫ్రీ బేసిక్స్ గురించి ఇండియాలో ప్రచారం చేయడం కోసం…

అమెరికా వీసా ఫీజు పెంపులో హ్రస్వదృష్టి -ది హిందు

[Short-sighted hike in U.S. visa fee శీర్షికన ఈ రోజు ది హిందులో వెలువడిన సంపాదకీయానికి యధాతధ అనువాదం] ********** అమెరికాలో తాత్కాలిక పని కోసం వచ్చే వృత్తిగత నిపుణులకు వీసా ఫీజు పెంచుతూ బారాక్ ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐ.టి రంగంలోని భారతీయ కంపెనీలను ప్రభావితం చేస్తుంది. ఈ చర్య వల్ల సంవత్సరానికి 400 మిలియన్ డాలర్ల (రమారమి రు. 2640 కోట్లు) నష్టం వస్తుందని (భారత సాఫ్ట్ వేర్) వాణిజ్య సంఘం…

చైనా అభివృద్ధి శిధిలాలు ప్రాణాలు మింగేస్తున్న వేళ… -ఫోటోలు

దేశంలోని సకల సంపదలు కొద్ది మంది వద్దనే కుప్పబడినప్పుడు ఆ సంపదలని వెలికి తీసే బీద ప్రాణాలు కుప్పలుగా సమాధి కావలసిందే. ఆర్ధిక అభివృద్ధిలో అమెరికాను అధిగమించడానికి శరవేగంగా దూసుకుపోతున్న చైనాలో అభివృద్ధి పక్కనే అభివృద్ధి శిధిలాలు కుప్పలై పోగుబడి కొండలై పెరిగిపోయి చివరికి అమాంతం కూలిపోయి శ్రామికుల ప్రాణాల్ని నిలువునా కప్పేస్తున్నాయి. డిసెంబర్ 20 తేదీన అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన షెన్ జెన్ నగరంలో ఓ కొండ ఉన్నట్టుండి కూలిపోయింది.…

పరీక్షలకు 19 కోట్లు, ప్రకటనలకు 445 కోట్లు

క్వాలిటీకి తాము అత్యంత ప్రాముఖ్యత ఇస్తామని నెస్లే గ్లోబల్ సి.ఇ.ఓ చెప్పిన మాట! కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని కంపెనీ వార్షిక నివేదికలు (బ్యాలన్స్ షీట్) వెల్లడిస్తున్నాయి. నెస్లే ఇండియా కంపెనీ ప్రకటనల కోసం ఖర్చు చేసిన మొత్తంలో 5 శాతం కంటే తక్కువే క్వాలిటీ పరీక్షల కోసం ఖర్చు పెడుతోంది. 2014 సంవత్సరంలో నెస్లే ఇండియా కంపెనీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసే ప్రకటనల కోసం 445 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ…

ఎ.పికి చిప్ప, బంగ్లాకు లప్ప!

ఆంధ్ర ప్రదేశ్ కు ఇవ్వడానికి లేని నిధులు బంగ్లాదేశ్ కు అప్పు ఇచ్చేందుకు ఎక్కడి నుండి వస్తాయి. దేశంలో ఒక రాష్ట్ర ప్రగతికి నిధులు లేనప్పుడు ఇతర దేశానికి రుణం ఇవ్వడం ఎలా సాధ్యం? అది కూడా ఒక ముస్లిం దేశానికి? లోటు బడ్జెట్ తో మూలుగుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బు లేదని కేంద్రం చెప్పింది. ఇప్పుడేమో ఏకంగా 2 బిలియన్ డాలర్ల (సుమారు రు. 12 వేల…

కింద పడ్డా పై చేయి మాదే -మ్యాగి

భారత దేశంలో ఎల్లెడలా ఒత్తిడి తీవ్రం కావడంతో స్విట్జర్లాండ్ బహుళజాతి కంపెనీ నెస్లే (Nestle) వెనక్కి తగ్గింది. దేశ వ్యాపితంగా అన్ని దుకాణాల నుండి మ్యాగి నిల్వలను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ అధిపతి ప్రకటించాడు. అయితే కింద పడ్డా పై చేయి తనదే అని చెబుతున్నట్లుగా మ్యాగీలో మోనో సోడియం గ్లుటామెట్ (ఎం.ఎస్.జి) ని కలప లేదని బొంకడం మాత్రం మానలేదు. దేశంలో మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాగి శాంపిళ్లను పరీక్షకు పంపుతూ తమ తమ రాష్ట్ర…

నువ్వు ముస్లింవి.. ఉద్యోగం ఇవ్వం ఫో!

సరస్వతీ శిశు మందిర్ పాఠశాలల్లో ఒక కులం వారికి తప్ప ఉద్యోగం ఇవ్వరు. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాల్లో ఇప్పటికీ ఆ కులం వారికే ఎక్కువ ఉద్యోగాలు దక్కడం ఒక చేదు నిజం. దేశంలో దళితులకు దూరం నుండి నీళ్ళు వొంచి పోసే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దళితులకు ఇల్లు అద్దెకు ఇవ్వని మురికి మనసుల కుటుంబాలు ప్రతి పల్లె, పట్టణంలోనూ ఉన్నాయి. ముంబైలో ముస్లింలకు కూడా ఇళ్ళు అద్దెకు లభించవు. ఇప్పుడు అదే ముంబైలో పేరు మోసిన…

ప్రశ్న: సిల్క్ రోడ్ పేరు విశిష్టతల గురించి…

  ఎన్.రామారావు: ఈ మధ్య సిల్క్ రోడ్ అన్న పేరు తరచుగా వినిపిస్తోంది. ఆ పేరు ఎందుకు వచ్చింది? అంత విశిష్టత ఎందుకు? సమాధానం: ప్రాచీన నాగరికతలు విలసిల్లిన దేశాలలో చైనా, భారత ఉపఖండం, మెసపోటేమియా (ఇరాక్), గ్రీసు, రోమన్ (ఇటలీ)లు ముఖ్యమైనవి. చైనా నుండి ఈ ప్రదేశాలకు భూమార్గంలో అతి పొడవైన వాణిజ్య మార్గం ఉండేది. ఈ మార్గం గుండా జరిగే వాణిజ్యంలో సిల్క్ వాణిజ్యం భాగం ఎక్కువగా ఉండేది. దానిని దృష్టిలో పెట్టుకుని 1877లో…

హిందీ-చీనీ భాయ్ భాయ్, మళ్ళీ! -కార్టూన్

నిజంగా చాలా అద్భుతమైన కార్టూన్. కాసిన్ని గీతల్లో ఎంతో విశాలమైన అర్ధాన్ని పొదిగిన ఇలాంటి కార్టూన్ లను చాలా కొద్ది మంది మాత్రమే గీయగలుగుతారు. ఎందుకంటే ఇలాంటి అర్ధవంతమైన కార్టూన్ లు గీయాలంటే చరిత్ర జ్ఞానం కావాలి. ఒట్టి చరిత్ర జ్ఞానం ఉన్నా చాలదు. ఆ జ్ఞానం సరైన దిశలో చూస్తూ ఉండాలి. సమకాలీన పరిమాణాలపైనా, వర్తమానం లోని వివిధ రాజకీయ, ఆర్ధిక, సామాజిక ఘటనల పైనా తగిన పట్టు కలిగి ఉండాలి. అన్నీ కుదిరాక వాటిని…

జర్మనీ: రోబోట్ల వల్ల 1.8 కోట్ల ఉపాధి హుళక్కి!

పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశం జర్మనీలో రోబోట్ల భయం కొత్తగా వచ్చి చేరుతోంది. ఇప్పటికే పలు రంగాల్లో రోబోట్ల చేత పని చేయించుకుంటున్న జర్మనీ పరిశ్రమలు ప్రజల ఉపాధిని హరించివేస్తున్నాయి. రోబోట్ టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతుండడంతో జర్మనీ ఉద్యోగాలలో 18 మిలియన్ల మేర రోబోట్లు ఆక్రమిస్తాయని ఐ.ఎన్.జి-డిబా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. జర్మనీలో పూర్తి కాలం ప్రాతిపదికన గానీ పార్ట్ టైమ్ ప్రాతిపదికన గానీ మొత్తం 30.9 మిలియన్ల మంది (3.09 కోట్లు) వివిధ రంగాలలో…