ఆత్మ రక్షణ విధానం వీడి మిలటరీ శక్తిగా మారుతున్న జపాన్!
జపాన్ తన మిలటరీ విధానాన్ని మార్చుకుంటున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి, అణు బాంబు విధ్వంసం దరిమిలా జపాన్, ‘కేవలం ఆత్మరక్షణకే మిలటరీ’ అన్న విధానంతో తనకు తాను పరిమితులు విధించుకుంది. ఇప్పుడు ఆ విధానానికి చరమగీతం పాడుతోంది. తన రక్షణ బడ్జెట్ ను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించింది. అదే జరిగితే జపాన్ మిలటరీ బడ్జెట్ ఇక నుండి ఏటా 100 బిలియన్ డాలర్లకు పైగా పెరగనుంది. జపాన్ అంతటితో ఆగటం లేదు. వివిధ దేశాలతో వరస…