రష్యా-ట్రంప్ కుమ్మక్కు ఆర్టికల్స్ తొలగించిన న్యూస్ వీక్
హిల్లరీ క్లింటన్ ని ఓడించడానికి ట్రంప్ – రష్యా కుమ్మక్కయ్యారని నెలల తరబడి బూటకపు వార్తలు (fake news) గుమ్మరిస్తూ వచ్చిన అమెరికా పత్రికా సంస్ధలు ఒక్కొక్కటీ వరుసగా చెంపలు వేసుకుంటున్నాయి. హిల్లరీ క్లింటన్ కి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ కి అనుకూలంగా అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా హ్యాకింగ్ కు పాల్పడినట్లు రాసిన కధనాలలో పొరబాట్లు చేశామని కొద్ది రోజుల క్రితం అసోసియేటెడ్ ప్రెస్, న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్ధలు ఒప్పుకున్న సంగతి విదితమే.…