అణ్వాయుధాలను అప్రమత్తం చేసిన పుతిన్!
రష్యా అధ్యక్షుడు అసాధారణ చర్యకు పూనుకున్నాడు. అమెరికా, నాటో నేతల ప్రకటనలకు స్పందనగా దేశంలోని అణ్వాయుధాలను ‘హై అలర్ట్’ లో ఉంచాలని రష్యన్ మిలట్రీని, రక్షణ శాఖను ఆదేశించాడు. పుతిన్ ఆదేశాలను ‘బాధ్యతారాహిత్యం’ గా నాటో కూటమి అభివర్ణించింది. నాటో కూటమికి చెందిన ఉన్నతాధికారులు “దూకుడు ప్రకటనలు” (Aggressive Statements) జారీ చేస్తున్నారని పుతిన్ ఆరోపించాడు. తమ దేశం రష్యా గురించి అభ్యంతరకరంగా వ్యాఖ్యానిస్తున్నారని తప్పు పట్టాడు. “నాటో కూటమికి నేతృత్వం వహిస్తున్న దేశాలు మా దేశం…