గల్ఫ్ లో భారత ప్రయోజనాలకు ‘అబ్రహాం ఎకార్డ్స్’ గండం!
(రెండవ భాగం తర్వాత….) సైప్రస్ సమావేశంలో పాల్గొన్న నాలుగు దేశాలకూ టర్కీతో విభేదాలు ఉన్నాయి. యూఏఈ, ఇజ్రాయెల్ పాల్గొన్న ప్రతి సమావేశంలో ఇరాన్ గురించి తప్పనిసరిగా చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో టర్కీ విస్తరణ వాదంతో దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఇవి టర్కీతో మరింత జాగ్రత్త పడుతున్నాయి. ఇక టర్కీ దూకుడు అమెరికాకు అసలే గిట్టదు. సైనిక కుట్ర ద్వారా ఎర్దోగన్ ను పదవీచ్యుతుడిని చేసేందుకు జులై 2016లో విఫలయత్నం చేసింది. రష్యా గూఢచార సమాచారంతో ఎర్డోగన్…