ఐలాన్ కుర్ది: సిరియా యుద్ధ శిధిలం ఈ బాలుడు -ఫోటోలు
అమెరికా, ఐరోపాలు స్వప్రయోజనాల కోసం సిరియాపై బలవంతంగా రుద్దిన అంతర్యుద్ధం ఆ దేశ పిల్లల పాలిట మరణ మృదంగం వినిపిస్తోంది. లక్షలాది మంది సిరియన్లు ఇసిస్ ఉగ్ర మూకల చెరలో నుండి తప్పించుకునేందుకు టర్కీ, లెబనాన్, జోర్డాన్ లకు శరణార్ధులుగా తరలి వెళ్తున్నారు. సిరియా నుండి వెళ్ళే శరణార్ధుల్లో ఎక్కువ మంది టర్కీలో ప్రవేశిస్తున్నారు. ఆ తర్వాత స్ధానం లెబనాన్ ది. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ తన ప్రజలపై అమలు చేస్తున్న నియంతృత్వం పట్ల తెగ…