ప్రశ్న: గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ గురించి వివరించండి

ప్రశ్న (పేరు ఇవ్వలేదు): క్యూబా వ్యాక్సిన్ ఆర్టికల్ లో గ్లోబల్ సౌత్ అన్న పదజాలం వాడారు. భూమధ్య రేఖకు దిగువ దేశాలు అంటూనే ‘కొన్ని పరిమితులతో’ అన్నారు. కాస్త వివరించగలరు. జవాబు: ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం చాలా అవసరం. ప్రపంచ స్ధాయి పరిణామాలు, ముఖ్యంగా భౌగోళిక రాజకీయార్ధిక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఆంగ్ల పత్రికలు తరచుగా గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ అన్న పదజాలాల్ని ఉపయోగిస్తాయి. ఈ పేర్లు సూచించే విధంగా ఉత్తరార్ధ గోళంలో ఉన్న…

ప్రశ్న: మన డేటా అమ్ముకుంటే నష్టం ఏమిటి?

లోకేశ్వర్: “వినియోగదారుల సమాచారాన్ని ఇతర సంస్థలకు అమ్ముకుంటే మనకు వచ్చే నష్టమేంటి? సేవలని ఉచితంగా ఇస్తున్నప్పుడు వాటిని పూడ్చుకోవడానికి ఇలాంటివి చేయడంలో తప్పేముంది?” అనే సగటు పౌరుడి/వినియోగదారుడికి సమాధానం ఏంటి? (నాకు కూడా) సమాధానం:  ఈ అనుమానానికి చాలా పెద్ద సమాధానం, సమాచారం ఇవ్వాలి. విస్తృత విశ్లేషణ చెయ్యాలి. అందుకని కాస్త తీరికగా రాయొచ్చు అనుకున్నాను. మీరు రెండోసారి అడగడంతో క్లుప్తంగా రాస్తున్నాను. మనకొక ఉత్తరం వచ్చిందనుకుందాం. దాన్ని పక్కింటి వాళ్ళు చించి చదివితే మన రియాక్షన్…

ప్రశ్న: స్టార్టప్ కంపెనీ అంటే?

జి అమర్ నాధ్: ఈ మధ్య ‘స్టార్టప్ కంపెనీ’ అన్న పేరు తరచుగా వినిపిస్తోంది. కాస్త ఐడియా ఉన్నట్లు అనిపిస్తున్నా పత్రికల్లో కనిపిస్తున్న పదాలు (ఉదా: ఇంక్యుబేటర్) కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. కాస్త వివరించి చెప్పగలరా? సమాధానం: సరైన సమయంలో వేసిన ప్రశ్న. గత సంవత్సరం ఆగస్టు 15 తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడి గారు ‘స్టార్టప్ ఇండియా; స్టాండప్ ఇండియా’ పేరుతో ఓ పధకాన్ని ‘మన్ కీ బాత్’ రేడియా ప్రసంగంలో ప్రకటించారు. పధకం…

ప్రశ్న: సిల్క్ రోడ్ పేరు విశిష్టతల గురించి…

  ఎన్.రామారావు: ఈ మధ్య సిల్క్ రోడ్ అన్న పేరు తరచుగా వినిపిస్తోంది. ఆ పేరు ఎందుకు వచ్చింది? అంత విశిష్టత ఎందుకు? సమాధానం: ప్రాచీన నాగరికతలు విలసిల్లిన దేశాలలో చైనా, భారత ఉపఖండం, మెసపోటేమియా (ఇరాక్), గ్రీసు, రోమన్ (ఇటలీ)లు ముఖ్యమైనవి. చైనా నుండి ఈ ప్రదేశాలకు భూమార్గంలో అతి పొడవైన వాణిజ్య మార్గం ఉండేది. ఈ మార్గం గుండా జరిగే వాణిజ్యంలో సిల్క్ వాణిజ్యం భాగం ఎక్కువగా ఉండేది. దానిని దృష్టిలో పెట్టుకుని 1877లో…

టెర్రరిజంను అమెరికా ఎలా ప్రోత్సహిస్తుంది?

జి.కె.గణేష్: టెర్రరిజంని అమెరికాయే మొదట్లో ప్రోత్సహిస్తుందని మీ వ్యాసాల్లో చదివాను. అదెలాగో వివరించగలరా? సమాధానం: ప్రపంచంలో వివిధ చోట్ల పెచ్చరిల్లుతున్న ఉగ్రవాద దాడుల గురించి గతంలో రాశాను. ఆ సంఘటనల గురించి రాసినప్పుడు వాటి వెనుక అమెరికా హస్తం ఉందని చెప్పినా, ఉండవచ్చని చెప్పినా దానికి సంబంధించిన వివరాలు కూడా ఆ సందర్భంలోనే వివరించాను. బహుశా అప్పటి వివరణలు మీ దృష్టికి వచ్చినట్లు లేదు.  ఏయే ఉగ్రవాద ఘటనలు జరిగాయో వివరిస్తూ వాటి వెనుక అమెరికా హస్తం…

ప్రశ్న: కూలింది సోషలిస్టు రష్యాయేనా? -2

మొదటి భాగం తరువాయి…………   ఆ విధంగా సోవియట్ రష్యా ప్రజల సహాయంతో స్టాలిన్, మొట్టమొదటి సోషలిస్టు రాజ్యానికి ఎదురైన అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొన్నాడు. కానీ సోషలిస్టు రాజ్యం వయసు అప్పటికి ఇంకా బాల్య దశలోనే ఉంది తప్ప పరిపక్వ దశకు చేరుకోలేదు. సోషలిస్టు నిర్మాణం నిరంతర సవాళ్లను ఎదుర్కొంటూ చేయవలసిన ప్రయాణం. ఒక కుటుంబాన్ని సక్రమంగా నిర్మించుకోవాలంటేనే కిందిమీదులు అవుతుంటాం. అలాంటిది అనేక జాతులతోనూ, ప్రజా సమూహాలతోనూ, ప్రాంతాలతోనూ కూడి ఉండే బహుళజాతుల వ్యవస్ధను…

ప్రశ్న: సోవియట్ రష్యా ఎందుకు కూలింది?

ఎస్.రామ కృష్ణా రావు: Two three decades ago there was cold war between America & Russia. Both were competing for no1 position. But down the line Russia faded away and USA is actively participating in almost all parts of the world’s politics. Russia became neutral & insignificant. I would like to know what went wrong with…

ప్రశ్న: విదేశాల్లో సబ్సిడీలు మనంత లేవా?

శశిధర్:  శేఖర్ గారు, మీ బ్లాగ్ లో రెగ్యులర్ గా ఆర్టికల్స్ చదువుతుంటాను. అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణలు చాల బాగా వివరిస్తారు. అలాగె ఆర్థిక సంబంద విశ్లెషణలు కుడా బాగుంటాయి. సబ్సిడీలు వాటి ఆవశ్యకత గూర్చి చదివాను. ఈ మధ్య కాలంలో ట్రెడ్ ఫెసిలిటేషన్ అగ్రీమెంట్ గుర్చి చదివాను. నా ప్రశ్న: భారత్ లో సబ్సిడిలు అంత ఎక్కువగ ఉన్నాయా? అభివ్రుద్ది చెందిన దేశాల్లో ఇస్తున్న సబ్సిడీల విలువ ఎంత? ఏయే  రంగాలకు సబ్సిడిలు ఎంత మొత్తంలో…

ప్రశ్న: బిట్ కాయిన్ అంటే?

రమేష్: శేఖర్ గారు, మీ బ్లాగ్ నేను క్రమం తప్పకుండా చదువుతుంటాను. మీ విశ్లేషణలు చాల బావుంటాయి. సర్, నాకు ఒక సంధేహము. ఏమిటంటే నేను గత 2, 3 సంవత్సరాలుగ అంతర్జాతీయంగా బిట్ కాయిన్ అనే కరెన్సి గురించి విన్నాను. కాని దాని గురించి గాని, అది ఏ దేశ కరెన్సి అని గాని తెలియదు . దయచేసి ఆ కరెన్సి గురించి, అది ఎలా మనకు ఉపయోగపడుతుంది, దానిని ఎక్కడ, ఎలా మార్చుకొవాలి? మెదలగు…

ప్రశ్న: తన ప్రజల్ని చల్లగా చూసుకునే దేశమే లేదా?

ఎస్. రామ కృష్ణ రావు: Thanks for publishing my question in QA and detailed analysis. Let me ask you differently. Actually my intention behind asking the question was in which country typical common people are living with more peace & happily? Is it China (as it became financially stronger) or America (good governance) or England, Singapore…

ప్రశ్న: అమెరికాకి ఆధిపత్యం ఎందుకు?

వెంకట్ నాయుడు మీ వెబ్ సైట్ కు ధన్యవాదాలు. నాకు సరిగా అర్ధం కాని విషయం ఏంటంటే ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం ఎందుకు చూపిస్తుంది? అసలు ఆధిపత్యం చూపించడానికి కారణాలు ఏమిటో చెప్పండి. సమాధానం: ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ అవసరాలు. ప్రతి దేశంలోనూ ఆ దేశ వనరులపై గుత్తాధిపత్యం కలిగిన కొద్దిపాటి ధనిక కుటుంబాలు ఉంటాయి. వారికి సహకారంగా వారి మాట వింటూ పని చేసే ధనిక వర్గాలు మరింత మంది ఉంటారు. వారు…

మానవ స్వభావం అనేది ఒకటుందా?

(‘మానవ ప్రవృత్తి, ‘మానవ స్వభావం’, ‘మానవ నైజం’… ఇలాంటి పదబంధాలన్నీ ఒకే అర్ధం ఇచ్చేవి. సమాజంలో మానవ స్వభావం అనేది ఒకటుందని, దాని ప్రకారం ప్రతి మానవుడూ నడుచుకుంటారని ఈ పదాలు మనకు చెబుతాయి. ఈ అంశాన్ని చర్చించమని ఇద్దరు ముగ్గురు మిత్రులు ఈ మెయిల్ ద్వారా కోరారు. ఒకరిద్దరు నన్నే అడిగారు. ఈ అంశం పైన గతంలో ఒక ఆర్టికల్ రాశాను. పౌర హక్కుల సంఘం నేతగా ఉంటూ అనంతరం ‘మానవ హక్కుల సంఘం’ను స్ధాపించిన…

ప్రశ్న: సుఖ శాంతులున్న తావు భూమిపై ఉందా?

ఎస్ రామ కృష్ణ రావు Dear Sekhar, I regularly follow your Q&A section in the teluguvartalu website. I have one question in this context. We know that every where on this world people are suffering with some problems (may be financial/political/lack of food  … and many more). I was wondering is there any place on the…

ఎనలైజ్: వ్యవసాయ సబ్సిడీలు ఎందుకివ్వాలి? -ఈనాడు

‘అధ్యయనం’ ధారావాహికలో ఆరవ భాగం నేటి ఈనాడు పత్రికలో ప్రచురితమయింది. గత వారం ‘ఎనలైజ్’ అనే డైరెక్టివ్ గురించి వివరించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఓ ఉదాహరణ తీసుకుని ఈ వారం వివరించాను. వ్యవసాయ సబ్సిడీలకు సంబంధించి గత సంవత్సరం జనరల్ స్టడీస్ పేపర్ లో ఇచ్చిన ప్రశ్నను ఉదాహరణగా తీసుకున్నాను. ఆర్టికల్ ను నేరుగా ఈనాడు ఆన్ లైన్ ఎడిషన్ లో చూడాలనుకుంటే కింది లంకె పైన క్లిక్ చేసి చూడగలరు. ఈ లంకే…

ప్రశ్న: ఆర్కిటిక్ సంపదలో ఇండియాకు భాగం ఎలా?

మూల: అర్కిటిక్ రిజియన్లో మనదేశానికి భాగంలేనందున ఆ రిజియన్లో మన ప్రయత్నాలు పరోక్షపద్దతులవలననే అర్ధం అవుతోంది!!మరిదానికి సహకరించేది రష్యానా? లేక వేరేదైనా? సమాధానం: ఈ అంశాన్ని గతంలో రెండు ఆర్టికల్స్ లో వివరించాను. వాటికి లంకెలు కింద ఇస్తున్నాను. ఆర్కిటిక్ సంపదలను వివాదరహితంగా పరిష్కరించుకునేందుకు వీలుగా ఆర్కిటిక్ దేశాలు కలిసి ‘ఆర్కిటిక్ కౌన్సిల్’ అనే సంఘం ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో 8 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. ఇతర దేశాలు కూడా ఇందులో చేరవచ్చు. కానీ ప్రస్తుతానికి…