అమెరికా కరువుకు దృష్టాంతం ఒరోవిల్లే, షాస్టా సరస్సులు -ఫోటోలు

అమెరికాలో పలు చోట్ల ఇప్పుడు కరువు నెలకొని ఉంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో అతి తీవ్ర కరువు నెలకొని ఉండగా ఇంకా ఇతర చోట్ల ఒక మాదిరి నుండి తీవ్ర స్ధాయి వరకు కరువు పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. కరువు క్రమంగా పుంజుకుంటున్న చోట్లు విస్తరిస్తున్నాయి. కరువు కారణాలను ప్రకృతి పైకి నెట్టేసి తప్పించుకోవడం ప్రభుత్వాలకు అనాదిగా ఉన్న అలవాటు. వర్షాభావం వల్ల పంటలు పండకపోతే ఆహార గింజల ఉత్పత్తి తగ్గేమాట నిజమే కావచ్చు. కానీ భారీ ఉత్పత్తులు…

నెల వాన ఒకేసారి, మట్టిదిబ్బల కింద హిరోషిమా -ఫోటోలు

11, 2 సం.ల వయసు గల సోదరులు నిద్రలోనే సమాధి అయ్యారు. ఒక పిల్లాడి ఎర్ర స్కూల్ బ్యాగ్ బురదలో కూరుకుపోయి కనిపిస్తోంది. ఇక్కడ ఉండాల్సిన ఇల్లు కూలిపోయి, కొట్టుకుపోయి 100 మీటర్ల దూరంలో సగం తేలి కనిపిస్తోంది. బురద ప్రవాహం బలంగా దూసుకురావడంతో ఇళ్ళగోడలు చెల్లా చెదురై కొట్టుకుపోయి శిధిలాల కుప్పలై తేలాయి. మూడు మీటర్ల మందం ఉన్న భారీ రాళ్ళ కింద సగం కనిపిస్తున్న మానవదేహాలు భయం గొలుపుతున్నాయి. ఇటీవలే పెళ్లి చేసుకున్నా కొత్త…

ప్రపంచంలో అత్యంత తడి ప్రాంతం మేఘాలయ -ఫోటోలు

ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? ‘అస్సాంలోని చిరపుంజి’ ఈ ప్రశ్న- సమాధానం చిన్నప్పుడు చిన్న తరగతుల్లో ముఖ్యమైన బిట్ ప్రశ్నగా మాస్టార్లు చెప్పేవాళ్లు. కాలక్రమేణా చిరపుంజి ఆ హోదాను కోల్పోయింది. గతంలో అస్సాంలో ఉన్న చిరపుంజి మేఘాలయ విడిపోయాక కొత్త రాష్ట్రంలో భాగం అయింది. ఇప్పుడు చిరపుంజి స్ధానాన్ని మోసిన్రామ్ ఆక్రమించింది. మోసిన్రామ్ గ్రామం కూడా మేఘాలయ లోనిదే. చిరపుంజి కి 16 కి.మీ దూరంలోనే ఉన్న మోసిన్రామ్ గ్రామ్ మేఘాలయ రాష్ట్రంలో తూర్పు…

‘పవిత్రం’ కనుక గంగా నదిని శుద్ధి చేయాలా?

“పవిత్ర” గంగానది ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని బి.జె.పి ప్రభుత్వం ఎందుకు వెనక్కి నెట్టేసిందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. బి.జె.పి నేతృత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వంలో గంగా నదిని పరిశుభ్రం చేయాలన్న ఆతృత (urgency) చూపించడం లేదని వ్యాఖ్యానించింది. ‘దేశంలో 2,500 దూరం ప్రవహించే గంగా నదిని శుద్ధి చేసే పధకాల పట్ల ప్రభుత్వం ఆసక్తి కోల్పోయిందా?’ అని ప్రశ్నించింది. 20 యేళ్ళ నాటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పైన విచారణ కొనసాగిస్తూ సుప్రీం కోర్టు బెంచి బుధవారం…

ప్రశ్న: ఆర్కిటిక్ సంపదలో ఇండియాకు భాగం ఎలా?

మూల: అర్కిటిక్ రిజియన్లో మనదేశానికి భాగంలేనందున ఆ రిజియన్లో మన ప్రయత్నాలు పరోక్షపద్దతులవలననే అర్ధం అవుతోంది!!మరిదానికి సహకరించేది రష్యానా? లేక వేరేదైనా? సమాధానం: ఈ అంశాన్ని గతంలో రెండు ఆర్టికల్స్ లో వివరించాను. వాటికి లంకెలు కింద ఇస్తున్నాను. ఆర్కిటిక్ సంపదలను వివాదరహితంగా పరిష్కరించుకునేందుకు వీలుగా ఆర్కిటిక్ దేశాలు కలిసి ‘ఆర్కిటిక్ కౌన్సిల్’ అనే సంఘం ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో 8 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. ఇతర దేశాలు కూడా ఇందులో చేరవచ్చు. కానీ ప్రస్తుతానికి…

చైనా: కాస్త భూకంపం, భారీ విధ్వంసం -ఫోటోలు

జాతీయ, అంతర్జాతీయ పత్రికలన్నీ పశ్చిమ రాజ్యాలు సృష్టించిన యుద్ధ భీభత్సాలపై దృష్టి పెట్టడంతో చైనాలో సంభవించిన ప్రకృతి భీభత్సం పెద్దగా ఎవరి దృష్టికీ రాలేదు. నైరుతి చైనాలోని యూనాన్ రాష్ట్రంలో ఆగస్టు 3 తేదీన చిన్నపాటి భూకంపం విరుచుకుపడింది. రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదయిన ఈ భూకంపం మామూలుగానైతే అంత భారీ భూకంపం ఏమీ కాదు. కానీ కొండలు, లోయలతో నిండి ఉన్న ప్రాంతంలో సంభవించడంతో భారీ నష్టాన్ని కలుగ జేసింది. ఈ భూకంపంలో…

సాహసికుల స్వప్న తీరం, అలాస్కా బోర్ టైడ్ -ఫోటోలు

ఓ చెక్క (లేదా ప్లాస్టిక్) బల్లపైన నిలబడి నీటి అలల పైన తేలియాడుతూ పోయే క్రీడ సర్ఫింగ్. సర్ఫింగ్ క్రీడాకారులకు ఇష్టమైన స్ధలాల్లో అలాస్కా కుక్ ఇన్ లెట్ ఒకటి. సన్నని జల మార్గాల్లో ఏర్పడే బోర్ టైడ్ లు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో అలాస్కా కుక్ ఇన్ లెట్ అయినందున ఉత్తర అమెరికాలోని సర్ఫింగ్ క్రీడాకారులకు ఇది ఫేవరెట్ గా మారింది. భారత దేశంలో కలకత్తాకు సమీపంలో పారే హుగ్లీ నది కూడా ప్రపంచంలో ప్రసిద్ధి…

ఆకాశం దించాలా, భువి తునక తుంచాలా? -ఫోటోలు

అమెరికా, రష్యాలు భౌగోళిక రాజకీయ రంగంలో ఎంతగా తగువులాడుకున్నా ఆ దేశాల అంతరిక్ష సంస్ధలు మాత్రం కలిసి మెలిసి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి. బహుశా, కనీసం ప్రస్తుత కాలానికి,  అమెరికా-రష్యాల మధ్య గల వైరుధ్యాల పరిమితులను ఇది తెలియజేస్తుందేమో! ఎక్స్ పెడిషన్ 39 పేరుతో జరిగిన అంతరిక్ష ప్రయాణంలో ఇరు దేశాల సిబ్బంది కలిసి ప్రయాణించి శాస్త్ర పరిశోధనలలో పాలు పంచుకోవడమే కాకుండా అద్భుతమైన భూ దృశ్యాలను రికార్డు చేసి మనముందు ఉంచారు. ఇరు దేశాలకు చెందిన ముగ్గురు…

టర్కీ: బొగ్గు గని కూలి 300కి పైగా దుర్మరణం!

గని ప్రమాదాలకు పేరు పొందిన టర్కీ మరోసారి తన పేరు నిలుపుకుంది. పశ్చిమ టర్కీ నగరం సోమా లో బొగ్గు గని కూలి 300 మందికి పైగా దుర్మరణం చెందారు. ఇప్పటివరకూ 245 మంది మరణాలను అధికారులు ధృవీకరించారని బి.బి.సి తెలిపింది. మరో 120 మంది వరకు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. 450 మంది బతికి బైటపడ్డారని తెలుస్తోంది. జీవించి ఉన్నవారి ప్రాణాలు నిలపడానికి ఆక్సిజన్ వాయువును గనిలోకి పంపింగ్ చేస్తున్నారు. మంగళవారం ఉదయం జరిగిన…

2వేల ఆఫ్ఘన్లను సమాధి చేసిన రాక్షస భూపాతం -ఫోటోలు

నీళ్ళు ఎత్తైన ప్రదేశం నుండి కిందకు జారిపడితే జలపాతం. ఏకంగా భూమే ఎత్తైన చోటి నుండి జారిపడితే! భూపాతం? గాంధార దేశంలో ఈశాన్య మూలన ఎత్తైన కొండ వాలుల్లో నివసించే గ్రామాల్లో ఓ చిన్న గ్రామాన్ని అలాంటి భూపాతం తాకింది. కొండ వాలులు తప్ప నివశించడానికి మరో చోటే లేని ఈ ప్రాంతంపై కొండ చరియలు విరిగి పడడం, ప్రాణ నష్టం సంభవించడం కొత్త కాదు. కానీ ఈసారి జరిగిన దుర్ఘటనలో 2,000 మందికి పైగా మరణించారని…

ఎల్ నినో, లా నినా అంటే?

ప్రశ్న (నాగ మల్లేశ్వరరావు): ఎల్ నినో, లా నినా అంటే ఏమిటో తెలుగులో వివరించగలరు. సమాధానం: ఇవి రెండూ ప్రపంచ వాతావరణ పరిస్ధితులకు సంబంధించినవన్న సంగతి చాలా మందికి తెలుసు గానీ అవి నిర్దిష్టంగా ఎందుకు ఏర్పడుతాయో తెలియదు. నిజానికి శాస్త్రవేత్తలకు కూడా పూర్తిగా వీటి గురించి తెలియదు. 17వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ అమెరికా ఖండం పశ్చిమ తీరంలోని మత్స్యకారులు ఈ వాతావరణ పరిస్ధితిని మొదటిసారి కనుగొన్నారని రికార్డులు చెబుతున్నాయి. అప్పటి నుండీ శాస్త్రవేత్తలు వీటిపై…

అమెరికాలో మళ్ళీ టోర్నడోల భీభత్సం -ఫోటోలు

అమెరికాలో టోర్నడో (గాలివాన) ల సీజన్ మొదలయింది. శనివారం చెలరేగిన టోర్నడోల ధాటికి వేలాది ఇళ్ళు నామరూపాలు లేకుండా పోయాయి. రెండు డజన్లకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మూడు రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించిన గాలివాన, మొత్తం 6 రాష్ట్రాలను ప్రభావితం చేసింది. ఒక్క ఆదివారమే 30కి పైగా టోర్నడోలు భీభత్సం సృష్టించగా వచ్చే రోజుల్లో మరో 100 టోర్నడోలు అమెరికాను తాకవచ్చని అమెరికా వాతావరణ విభాగం హెచ్చరించింది. అమెరికాలో టోర్నడోగా పిలిచే గాలివాన ఇక్కడ మనం…

300 మంది పిల్లల్ని మింగిన ద.కొరియా టైటానిక్ -ఫోటోలు

దక్షిణ కొరియాలో మహా విషాధం సంభవించింది. వందలాది మంది పాఠశాల పిల్లల్ని ఒక ద్వీపానికి విహార యాత్రకు తీసుకెళ్తున్న ఒక నౌక ప్రమాదానికి గురయింది. హఠాత్తుగా పక్కకు ఒరగడం మొదలు పెట్టిన నౌక క్రమంగా సాయంత్రానికి నీళ్ళల్లో దాదాపు పూర్తిగా మునిగిపోయింది. టైటానిక్ పడవ మధ్యలో విరిగిపోయినట్లు ఈ పడవ విరగలేదు గానీ బైటి జనం, ఫోటోగ్రాఫర్లు చూస్తుండగానే కాస్త కాస్త మునిగిపోతూ పెను విపత్కర దృశ్యాన్ని ప్రపంచం ముందు ఉంచింది. నౌక మునిగిపోతున్నప్పటికీ దానిని వెంటనే ఖాళీ…

చిలీ: తీవ్ర భూకంపం, సునామీ, నష్టం స్వల్పమే -ఫోటోలు

దక్షిణ అమెరికా దేశం చిలీలో ప్రకృతి తీవ్రంగానే ఆగ్రహించింది గానీ స్వల్ప నష్టంతో వదిలేసింది. పసిఫిక్ మహా సముద్రంలో చిలీ తీరానికి దగ్గరలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలు పైన 8.2 గా నమోదయింది. భూకంపం ఎంత తీవ్రంగా ఉన్నదంటే ప్రధాన భూకంపం తర్వాత సంభవించిన ప్రకంపనాలు (after shocks) కూడా దాదాపు అంతే తీవ్రంగా నమోదయ్యాయి. ఉదాహరణకి 8.2 పాయింట్ల భూకంపం తర్వాత అనేక డజన్ల సార్లు భూమి కంపించగా అందులో 18 సార్లు…

అమెరికా: మట్టి పెళ్ల కూలి ఓ పట్నం మాయం -ఫోటోలు

వాషింగ్టన్ రాష్ట్రంలోని ఓసో పట్నం వాసులకు మార్చి 22 ఓ మహా దుర్దినం అయింది. అప్పటికి మూడు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి కొండ చరియ కూలిపోవడంతో దానికింద పడి ఆ పట్నం దాదాపు అదృశ్యం అయిపోయింది. ఇప్పటివరకూ 17 మంది మరణించారని ప్రకటించగా 90 మంది జాడ తెలియలేదు. వీరంతా చనిపోయారన్న నిర్ణయానికి ప్రభుత్వ వర్గాలు వచ్చేశాయి. వారి బంధువులు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు. స్ధానికులు ఈ కొండను ‘స్లైడ్…