పశ్చిమ అమెరికా కరువు విభ్రాంత దృశ్యం -ఫోటోలు

అమెరికన్ వాల్ స్ట్రీట్ కంపెనీలు ఎప్పటిలాగానే లాభాలు నమోదు చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు పైపైకి చూస్తున్నాయి. ఆర్ధిక సంక్షోభం ముగిసిందని ప్రభుత్వాలు తీర్మానిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వృద్ధి రేటు కూడా పెరుగుద్దంటున్నారు. జనం మాత్రం కరువు బారిన పడి విలాపిస్తున్నారు. పశ్చిమ అమెరికా తీర రాష్ట్రాలను ఎన్నడూ ఎరగని కరువు పట్టి పీడిస్తోంది. ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రమే కాదు, నెవాడా, ఆరిజోనా, ఉటా తదితర రాష్ట్రాలన్నీ నీటి కోసం అలమటిస్తున్నాయి. ప్రతి యెడూ సాధారణంగా ఈ…

కాలిఫోర్నియాలో రికార్డు కరువు, నీటికి రేషన్ -ఫోటోలు

అమెరికాకు అన్నపూర్ణగా పేర్కొనబడే కాలిఫోర్నియా రాష్ట్రం ప్రస్తుతం రికార్డు స్ధాయి కరువుతో తీసుకుంటోంది. వరుసగా 4 సం.ల పాటు వర్షాలు లేకపోవడంతో కరువు అమెరికా భారీ మూల్యం చెల్లిస్తోంది. కాగా ఇంతటి తీవ్ర స్ధాయి కరువు పరిస్ధితులకు గ్లోబల్ వార్మింగే కారణమన్న వాదనపై నాయకులు శాస్త్రవేత్తలు రెండు శిబిరాలుగా చీలిపోయి వాదులాడుకుంటున్నారు. నేల మాత్రం నెర్రెలిచ్చి వర్షపు చుక్క కోసం చేతకపక్షిలా ఎదురు చూస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో కరువు ఎంత తీవ్రంగా ఉన్నదంటే నగరాలకు, పట్టణాలకు 25…

అమెరికా: మంచు తుఫాను అంటే 100 అంగుళాలా! -ఫోటోలు

అమెరికా ఈశాన్య రాష్ట్రాలను వణికించిన హిమపాతం -బ్లిజ్జర్డ్- గురించి రెండు వారాల క్రితం తెలుసుకున్నాం. నిజానికి ఒక్క బ్లిజ్జర్డ్ మాత్రమే కాదు. గత కొద్ది వారాలుగా ఆ ప్రాంతాన్ని వరుస మంచు తుఫాన్లు చుట్టుముట్టి మోదుతున్నాయి. ఈ తుఫాన్ల తీవ్రత ఎంత అధికంగా ఉన్నదంటే గత నెల రోజులలో అక్కడ 100 అంగుళాల మంచు కురిసింది. మరీ ముఖ్యంగా న్యూ ఇంగ్లండ్ గా పిలిచే 6 ఈశాన్య రాష్ట్రాలు (కనెక్టికట్, మైన్, మసాచూసెట్స్, న్యూ హ్యాంప్ షైర్,…

మృత్యువును సమీపిస్తున్న మృత సముద్రం -ఫోటోలు

మృత సముద్రం (Dead Sea) తాను కూడా మృత్యువును సమీపిస్తోంది. మృత సముద్రం జోర్డాన్, ఇజ్రాయెల్ సరిహద్దు మీద ఉంటుంది. సముద్రానికి తూర్పు ఒడ్డు జోర్డాన్ వైపు ఉంటే, పశ్చిమ ఒడ్డు ఇజ్రాయెల్ వైపు ఉంటుంది. ఈ సముద్రంలోకి వచ్చి కలిసే ఒకే ఒక్క నది జోర్డాన్ నది. ఇంతకీ మృత సముద్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? మృత సముద్రం అంటే చచ్చిపోయిన సముద్రం అని కాదు. చంపేసే సముద్రం అని. ఈ సముద్రాన్ని ‘Sea…

ఈశాన్య అమెరికాను వణికించిన బ్లిజ్జర్డ్ -ఫోటోలు

బ్లిజ్జర్డ్ అంటే హిమపాతం. మంచు తుఫానుతో పోలిస్తే తీవ్రత ఎక్కువ కలిగినది. రెండు లేదా మూడు అడుగుల ఎత్తున మంచు కురవడంతో పాటు గంటకు 35-50 మైళ్ళ వేగంతో సముద్రం మీది నుండి చలిగాలులు వీచడం బ్లిజ్జర్డ్ లక్షణం. అలాంటి తీవ్రమైన హిమపాతం జనవరి చివరి వారంలో అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను గజ గజ వణికించింది. హిమపాతానికి ముందు అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన మంచు తుఫాను ఈశాన్య అమెరికాను చుట్టుముడుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.…

మహా విలయం సునామీకి పదేళ్ళు -ఫోటోలు

డిసెంబర్ 26, 2014 తేదీతో ఆనాటి సునామీకి పదేళ్ళు నిండాయి. ఇండోనేషియా తీరానికి సమీపంలో హిందూ మహా సముద్రంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సంభవించిన సునామీలో 14 దేశాల్లో 2,30.000 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇందులో అత్యధికులు ఇండోనేషియాలోని సుమత్ర ద్వీపానికి చెందినవారే. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని చెప్పేవారూ ఉన్నారు. సముద్రంలో ఆటు, పోటుల గురించి తెలియడమే గానీ సునామీ గురించి అప్పటికి ఎవరికీ తెలియదు లేదా తెలిసినవారు చాలా తక్కువ.…

చైనీయ మంచు పల్లకి ‘వింటర్ వండర్ ల్యాండ్’ -ఫోటోలు

పశ్చిమ దేశాలు గడ్డ కట్టే మంచుతో నిండే చలి సీజన్లకు పెట్టింది పేరు. చైనాలోని అత్యధిక భాగంలోని శీతా కాలం కూడా ఇంచు మించు ఐరోపా దేశాల లాగానే మంచు కింద కప్పబడి పోయి ఉంటుందని అక్కడి నుండి వెలువడే ఫోటోల ద్వారా స్పష్టం అవుతోంది. అంతర్జాతీయ వేడుకలకు గతంలో పెద్దగా చోటివ్వని చైనా ఇప్పుడు అంతకంతకు ఎక్కువగా అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహిస్తూ టూరిస్టులను సైతం ఆకర్షిస్తోంది. చలి సీజన్ లో చైనా ప్రతి యేటా ‘హార్బిన్…

ఆసియా, ఐరోపా: శీతల దృశ్య మాలిక -ఫోటోలు

అన్ని కాలాల్లో నీకు ఏది ఇష్టం అని అడిగితే చాలామంది టక్కున చెప్పే మాట ‘చలి కాలం’ లేదా ‘శీతా కాలం’. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలలు దాదాపు అన్ని వయసుల వారికి మధుర స్మృతుల్ని మిగుల్చుతాయి. కాలేజీలు, పాఠశాలల విద్యార్ధులు ఎక్కువగా విహార యాత్రలకు వెళ్ళేది ఈ కాలంలోనే కావడంతో ఆ స్మృతుల్ని ఫొటోల్లో భద్రం చేసుకుని జీవితం అంతా చెప్పుకుంటూ చాలా మంది గడుపుతుంటారు. యుక్త వయసులో ఉన్న యువతీ యువకుల సంగతి చెప్పనే…

సముద్రంలోనే కూలింది, 6 మృత దేహాలు లభ్యం -ఫోటోలు

అనుకున్నట్లుగానే ఎయిర్ ఆసియా విమానం QZ 8501 విమానం జావా సముద్రంలోనే కూలిపోయిందని నిర్ధారణ అయింది. జావా సముద్రం లోని బోర్నియో ద్వీపానికి సమీపంలో విమానానికి సంబంధించిన అనేక శిధిలాలు కనపడడంతో ప్రమాదం నిర్ధారించబడింది. ప్రయాణీకులకు చెందిన 6 మృత దేహాలను రక్షణ సిబ్బంది వెలికి తీశారు. అనేకమంది ప్రయాణీకుల మృత దేహాలు ఇంకా విమానంలోనే ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. 40 మృత దేహాలను వెలికి తీశామని మొదట ఇండోనేషియా నౌకా బలగం ప్రకటించింది. అయితే అనంతరం…

162 మందితో మరో మలేసియా విమానం అదృశ్యం -ఫోటోలు

మళ్ళీ మరో విమానం! కూలి పోవడం కాదు, అదృశ్యం అయిపోయింది. మలేషియా విమాన కంపెనీ ఎయిర్ ఆసియా విమానం ఇండోనేషియా లోని రెండో అతి పెద్ద నగరం సురబాయా నుండి సింగపూర్ వెళ్తూ మార్గ మధ్యంలో జావా సముద్రంపై ఉండగా అదృశ్యం అయిపోయింది. ఎదురుగా ఉన్న మేఘాలను తప్పించేందుకు ఎడమ పక్కకు తిరిగి కాస్త పైకి వెళ్తామని పైలట్ అనుమతి కోరాడని, ఇంతలోనే విమానం రాడార్ నుండి అదృశ్యం అయిందని ఇండోనేసియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పారు.…

ఐరోపా మంచు తుఫాను: పైన్ చెట్లా? హిమ శిల్పాలా? -ఫోటోలు

ప్రాకృతిక వింతలను రికార్డు చేయడం మొదలు పెట్టాలే గానీ దానికిక అంతూ పొంతూ అంటూ ఉండదు. అదొక మహా యజ్ఞం అనడం సబబుగా ఉంటుంది. కాదంటే రెండు రోజుల పాటు కురిసిన మంచు తుఫాను తూర్పు యూరప్ దేశాలలోని ఆల్ప్స్ పర్వత శ్రేణిపై విస్తరించిన అటవీ వృక్షాలను, ఇతర నిర్మాణాలను హిమనీ శిల్పాలుగా మార్చివేయడం గురించి ఎలా చెప్పగలం? ఐరోపాలోని పలు దేశాలను తీవ్ర వాతావరణ పరిస్ధితులు చుట్టు ముట్టాయి. ఎముకలు కొరికేసే చలి వాతావరణం జనజీవనాన్ని…

సౌకర్యం ఖరీదు! -ది హిందు ఎడిటోరియల్

పలుచని, పర్యావరణ క్షీణతలో ఇమిడిపోలేని, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచుల వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వమే నియమించిన అనేక కమిటీలు తేల్చి చెప్పినప్పటికీ, వాటి చెడు ప్రభావాలు ఏమిటన్నదానికి పెద్ద మొత్తంలో సాక్ష్యాలు పోగుబడి ఉన్నప్పటికీ దేశంలో “ప్లాస్టిక్ సంచుల ఉత్పత్తి, వినియోగాలను నిషేదించే ఉద్దేశం ఏమీ లేదు” అని ఇటీవల ప్రభుత్వం దృఢంగా ప్రకటించింది. కానీ అటువంటి నిషేధం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్నది. దురదృష్టవశాత్తూ ఛార్జీలు వసూలు…

వేల కోట్ల నౌకా విధ్వంసక వ్యాపారం -ఫోటోలు

ఎంత భారీ నిర్మాణానికయినా ఏదో ఒక నాడు కాలం తీరిపోక తప్పదు. రాబట్టుకోదగిన విలువను అంతటినీ రాబట్టుకున్నాక గాని పెద్ద పెద్ద నిర్మాణాలను మనుషులు వదిలి పెట్టరు. ఇలా కాలం తీరిపోయిన భారీ నౌకలు, భవనాలు, కర్మాగారాలు.. మొదలయిన మౌలిక నిర్మాణాలను ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం రీ సైక్లింగ్! పర్యావరణం గురించిన స్పృహ పెరిగాక వాడిన వస్తువులను రీ సైక్లింగ్ చేసి మరో కొత్త వస్తువు తయారు చేయడం మనిషి పారంభించాడు. రీ సైక్లింగ్…

భోపాల్: వేల ప్రాణాలకు గడ్డిపోచ విలువ కట్టి 30 యేళ్ళు -ఫోటోలు

విషపు రెక్కల డేగ భోపాల్ నగరం విను వీధుల్లో విష విహారం చేసి డిసెంబర్ 3 తేదీకి 30 యేళ్ళు గడిచిపోయాయి. సో కాల్డ్ నాగరిక ప్రజాతంత్ర భారత రిపబ్లిక్ రాజ్యం సాక్షిగా, ఘనతర ఆధునిక న్యాయ వ్యవస్ధల కనుసన్నల్లో, సామ్రాజ్యవాద అమెరికాతో స్నేహ సంబంధాలు దినదిన ప్రవర్ధమానం అవుతుండగానే భోపాల్ విష వాయు బాధితులు నేటికీ విషవాయువు పీడితులుగా ఇళ్ళు, ఒళ్ళు, తరతరాల ఆరోగ్యం అన్నీ గుల్ల చేసుకుని న్యాయం కోసం దేబిరిస్తూనే ఉన్నారు. రారాజులు,…

లాస్ ఏంజిలిస్: మహాగ్నికీలల్లో నివాస భవనాలు -ఫోటోలు

లాస్ ఏంజిలిస్ నగరంలో నిర్మాణంలో ఉన్న నివాస భవనాలు రెండు అగ్ని కీలలకు ఆహుతి అవుతున్నాయి. భవనాలను నిలువునా దహించివేస్తూ ఆకాశాన్ని తాకుతున్న మంటల టవర్ కు సంబంధించిన ఫోటోలను పలువురు పౌరులు సోషల్ వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల రెండు ఫ్రీ వే లను మూసేసినట్లు పత్రికలు తెలిపాయి. 250 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తూ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటో ఇంతవరకు అంతుబట్టలేదని…