బ్యాంకు(ల) నిలువు దోపిడీ! -కార్టూన్
జనం సొమ్ము దాచి పెడతామని తీసుకునే బ్యాంకులు ఇప్పుడు ఆ సొమ్ములో సాధ్యమైనంత గరిష్ట భాగాన్ని సొంతం చేసుకునేందుకు సవాలక్ష నిబంధనలు విధిస్తున్నాయి. డీమానిటైజేషన్ తో మొదలైన మోడి గారి విశ్వరూపం మరింతగా విస్తరిస్తూ అచ్చే దిన్ అసలు అర్ధం ఏమిటో జనానికి విప్పి చెబుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘కనీస డిపాజిట్’ నిబంధనను సడలించవచ్చో లేదో కాస్త పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్రం కనుసన్నల్లో, అదుపాజ్ఞల్లో నడిచే ఎస్‌బిఐకి ఆ కేంద్రమే…