శశి ధరూర్ ని ప్రశ్నిస్తాం -ఢిల్లీ పోలీసులు

కాంగ్రెస్ ఎం.పి శశి ధరూర్ మునుముందు మరిన్ని కష్టాలు ఎదుర్కొనే సూచనలు బలపడుతున్నాయి. ఆయన భార్య సునంద పుష్కర్ హత్య కేసులో శశి ధరూర్ ని కూడా ప్రశ్నిస్తామని, అనుమానితుల్ని ఎవరిని వదిలిపెట్టేది లేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ స్పష్టం చేశారని పత్రికలు నివేదించాయి. ‘గుర్తు తెలియని వ్యక్తులు’ నిందితులుగా పేర్కొంటూ హత్య కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు తనను కేసులో ఇరికించడానికి చూస్తున్నారని ధరూర్ రెండు నెలల క్రితమే ఆరోపించడం గమనార్హం. జనవరి…

2014 లో జాతీయ అంతర్జాతీయ వార్తా విశ్లేషణ -సమీక్ష

ఎప్పటిలాగే వర్డ్ ప్రెస్ వాళ్ళు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ కు సంబంధించి 2014 సంవత్సర కాల సమీక్ష తయారు చేసి అందించారు. వర్డ్ ప్రెస్ లో బ్లాగింగ్ చేసేవాళ్లందరికి ఈ సౌకర్యం ఉంటుంది. బ్లాగ్ మిత్రులు, పాఠకుల కోసం సమీక్షను ప్రచురిస్తున్నాను. సమీక్షను పూర్తిగా ప్రచురించే సౌకర్యాన్ని వాళ్ళు ఇవ్వలేదు. కేవలం లింక్ మాత్రమే ఇచ్చారు. కింది భాగం అంతా వారు అందుబాటులో ఉంచిన లింక్ ని క్లిక్ చేయగా ఆటోమేటిక్ గా పబ్లిష్…

గగనతలంలో మరో ట్రాజెడీ -ది హిందు ఎడిటోరియల్

(True translation of the editorial published today i.e 31.12.2014 in The Hindu. -Visekhar) ********* ఇండోనేషియాలోని సురబయ నుండి సింగపూర్ కు వెళ్తున్న ఎయిర్ ఆసియా విమానం కనపడకుండా పోయి రెండు రోజులు పూర్తయ్యాక రక్షణ బృందాలు విమానంలో ఉన్న 162 మంది ప్రయాణీకులు మరియు సిబ్బందిలో కనీసం 40 మంది మృత దేహాలను విమాన శిధిలాలను కనుగొన్నారు. ఫలితంగా, రాడార్ తెరపై నుండి విమానం అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయిన దరిమిలా విమానం…

పోలీస్ చర్యతో సిడ్నీ సీజ్ అంతం -ఫోటోలు

సిడ్నీలో ఒక చాకోలేట్ కేఫ్ ను అదుపులో తీసుకున్న ఆగంతకుడు ఒకరు ఒక రోజంతా భయాందోళనలు సృష్టించాడు. కేఫ్ లో ఉన్న పౌరులను బందీలుగా ఉంచుకున్న సాయుధ వ్యక్తి డిమాండ్ లు ఏమీ చేయకపోవడం విశేషం. ఆగంతుకుడు ముస్లిం ఉగ్రవాదిగా పశ్చిమ పత్రికలు ప్రచారం చేశాయి. తీరా చూస్తే ఆ వ్యక్తి ఒక ఇరానియన్ ఆస్ట్రేలియన్ అనీ, తనపై దాఖలైన కేసుల్లో హై కోర్టు నిర్ణయం తనకు వ్యతిరేకంగా ఉండడంతో ఈ చర్యకు పాల్పడ్డాడని కొన్ని పత్రికలు…

ఏ కొద్దిమందివోతప్ప జర్నలిస్టుల జీవితాలు బాగోలేవు

Originally posted on Full Story:
ఏ కొద్దిమందివోతప్ప జర్నలిస్టుల జీవితాలు బాగోలేవు…రాజమండ్రిలో ఆంధ్రప్రభ రిపోర్టర్ జానకి నిన్న చనిపోయాడు. నలభై ఏళ్ళ చిన్న వయసులో మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి అపస్మారకంలోకి వెళ్ళిపోయి వారం తరువాత భార్యని కూతురుని అనాధలుగా వదిలేసి వెళ్ళిపోయాడు. జీతం రాని దిగులు, అడ్వర్టయిజుమెంట్లు సంపాదించలేని దిగులు, పెన్నేసుకుని/నోరేసుకు పడిపోలేని సౌమ్యస్వభావం తప్ప నల్లా జానకీ శ్రీరామ్ కి అనారోగ్యకారకాలైన ఏఅలవాట్లూ లేవు. మరణం అనివార్యమే అయినా ప్రశాంతంగా చనిపోయే అవకాశాలు లేని…

పడిపోనున్న 2014 Q2 వృద్ధి రేటు -అంచనా

2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను మొదటి త్రైమాసికంలో (2014 Q1) 5.7 శాతం జి.డి.పి వృద్ధి రేటు సాధించడం తమ ఘనతే అని నరేంద్ర మోడి/బి.జె.పి/ఎన్.డి.ఏ2 ప్రభుత్వం చెప్పుకుంది. తమ ప్రభుత్వం దాదాపు మే నెల చివరి వరకు కొనసాగినందున 5.7 వృద్ధి రేటు తమ ఘనతే అని గత యు.పి.ఏ ప్రభుత్వం మోడి ప్రభుత్వంతో పోటీకి వచ్చింది. ఇప్పుడు 2014 రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు పడిపోనున్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జి.డి.పి తగ్గడానికి కారణం…

ఉద్ధవార్జునుడికి కమల గండం -కార్టూన్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించవచ్చని శివ సేన నేత, బాల్ ధాకరే కుమారుడు ఉద్ధవ్ కుమార్ ఎంతగానో ఆశ పెట్టుకున్నారు. తన ఆశను ఆయన దాచుకోకుండా బహిర్గతం చేశారు. మహా రాష్ట్రలో తామే ఇచ్చేవారమని, బి.జె.పి తీసుకునే పార్టీ మాత్రమేనని హుంకరించారు. మరిన్ని సీట్లు కావాలన్న బి.జె.పి కోర్కెను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రాజ్ నాధ్ సింగ్ ఏలుబడి వరకు మహారాష్ట్రలో బి.జె.పి జూనియర్ భాగస్వామిగా మాత్రమే కొనసాగింది. లోక్ సభ ఎన్నికల్లో శివ సేన కంటే 10…

ఎగుడుదిగుడు స్వస్ధత -ది హిందు ఎడిటోరియల్

(ఈ రోజు ది హిందు పత్రికలో ‘Uneven recovery‘ శీర్షికన ప్రచురితం అయిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ద్రవ్యోల్బణం, పారిశ్రామిక వృద్ధి, వాణిజ్యం… ఈ అంశాలపై విడుదలయిన తాజా ఆర్ధిక గణాంకాల వివరాల నుండి స్పష్టంగా తెలుస్తున్న సంకేతం ఏదన్నా ఉంటే, అది: స్వస్ధత (రికవరీ) ప్రక్రియ ప్రారంభం అయింది కానీ అది ఎగుడు దిగుడుగా, ఇంకా మొదటి గేరులోనే ఉంది. ఆగస్టు నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం గత 5…

తెలుగు వార్తలు బ్లాగ్ 1 మిలియన్ హిట్స్ దాటింది…

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ బ్లాగ్ ఈ రోజుతో 1 మిలియన్ హిట్స్ దాటింది. ఫిబ్రవరి 4, 2011 తేదీన ప్రారంభం అయిన ఈ బ్లాగ్ ప్రారంభంలో ‘తెలుగులో జాతీయ, అంతర్జాతీయ వార్తలు’ శీర్షికతో ఉండేది. ప్రారంభం అయిన 43 నెలలకు 1 మిలియన్ హిట్స్ కు చేరుకోగలిగింది. అప్పటికి ‘అరబ్ వసంతం’ పేరుతో ఈజిప్టులో జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి మిలట్రీ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న నేపధ్యంలో ఈజిప్టు…

ప్రపంచ వ్యాపితంగా అరుదైన సూపర్ మూన్ -ఫోటోలు

అరుదుగా కనిపించే సూపర్ మూన్ ఆగస్టు 10, 2014 తేదీ రాత్రి సంభవించింది. చంద్ర కళల ప్రకారం నెలకొకసారి పౌర్ణమి రోజున పూర్తి రూపంలో చంద్రుడు కనిపించే సంగతి తెలిసిందే. భూమి చుట్టూ వర్తులాకారంలో (elliptical shape) తిరిగే చంద్రుడు తన కక్ష్యలో భూమికి అతి సమీపంలో వచ్చే సందర్భం ఒకటి ఉంటుంది. కానీ ఆ సందర్భం ఎప్పుడూ పౌర్ణమి రోజు కానవసరం లేదు. పౌర్ణమి రోజున పూర్తిగా చంద్రుడు కనిపించే రోజునే భూమికి అతి దగ్గరిగా…

యు.జి.సి స్వయం ప్రతిపత్తికి ఎవరు యజమాని? -కార్టూన్

“బహుశా ఆయన యజమాని ఆలోచనలు వినబడతాయేమో…” *** గత ఎన్.డి.ఏ ప్రభుత్వం హయాంలో యు.జి.సి స్వయం ప్రతిపత్తి తీవ్ర నియంత్రణకు లోనైంది. మరళీ మనోహర్ జోషి నేతృత్వంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖ యు.జి.సితో పాటు ఎన్.సి.ఈ.ఆర్.టి పాఠ్య గ్రంధాలలోని పాఠ్యాంశాలను సైతం నిర్దేశించడం ద్వారా హిందూత్వ ఎజెండాను పచ్చిగా అమలు చేసేందుకు పూనుకుంది. ఆ క్రమంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారతీయ చరిత్రకారులను వివిధ పదవుల నుండి తొలగించడమే కాకుండా చరిత్రగా పరిగణించలేని అంశాలు సైతం…

బ్రిక్స్ బ్యాంకు త్వరలో సిద్ధం!

ఐదు వర్ధమాన దేశాల బహుళపక్ష బ్యాంకు త్వరలో పని ప్రారంభిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు బ్రెజిల్ ప్రభుత్వ వర్గాలు సమాచారం ఇచ్చాయని రాయిటర్స్ తెలిపింది. BRICS కూటమిగా బహుళ ప్రచారంలోకి వచ్చిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల ఆర్ధిక, వాణిజ్య కూటమి గతేడు దర్బన్ సమావేశంలో బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటును ప్రకటించాయి. (వివరాల కోసం చూడండి: ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు -బ్రిక్స్ బ్యాంకు) ఇది త్వరలో ఆచరణలోకి రానున్నట్లు తెలుస్తోంది. గతంలో అనుకున్నట్లుగా…

మెక్సికో: తుపాకి పట్టిన జనం, డ్రగ్స్ మాఫియా పరార్ -ఫోటోలు

ఏలేవాడికి చేతగాకపోతే జనమే తమని తాము ఎలా రక్షించుకుంటారో మెక్సికో లోని మిచోకాన్ రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు. కిడ్నాప్ లకు, హత్యలకు, అత్యాచారాలకు పాల్పడుతూ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను గుప్పెట్లో పెట్టుకున్న ‘ద నైట్స్ టెంప్లార్’ అని డ్రగ్స్ ముఠాను ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి ఏమీ చేయలేకపోయాయి. నిమ్మ, వెన్న పండు (Avocado) పండించే రైతులకు కూడా వివిధ డ్రగ్స్ ముఠాలు బెడదగా మారినప్పటికీ పోలీసుల నుండి గానీ, సైన్యం నుండి గానీ జనానికి ఏమీ సహాయం…

భారత దేశపు రేప్ అనుకూల లాబీ -ది హిందూ సంపాదకీయం

(ముంబై శక్తి మిల్స్ అత్యాచార నిందితుల్లోని ముగ్గురు రిపీట్ అఫెండర్స్ కు కోర్టు మరణ శిక్ష విధించిన నేపధ్యంలో సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ “అబ్బాయిలు అబ్బాయిలే. వారు తప్పు చేయరా” అని వ్యాఖ్యానించి పెను దుమారానికి తెరతీశారు. అవి ఆయన పొరబాటుగా అన్న మాటలు కావనీ, రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నారని ది హిందూ సంపాదకీయం సరిగ్గా వ్యాఖ్యానించింది. మనకు కనపడని ప్రొ-రేపిస్టు లాబీ ఒకటి మన దేశంలోనూ ఉందని చెబుతున్న…

ఎలక్షన్ అఫిడవిట్: మోడి వివాహితులే

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అవివాహితులని, ఆజన్మ బ్రహ్మచారి అని చెప్పడం అంటే ఆయన అభిమానులకు చాలా యిష్టం. దేశం కోసం, దేశ ప్రజల ప్రయోజనం కోసం మోడి తన వ్యక్తిగత సుఖ సంతోషాలను తృణప్రాయంగా ఎంచుతూ త్యాగం చేశారని వారు తరచుగా చెబుతుంటారు. కానీ మోడి తన అభిమానులను నిరాశపరిచారు. ప్రధాని అభ్యర్ధిగా పోటీ పడుతూ అబద్ధం చెప్పకూడదు అనుకున్నారేమో తెలియదు గానీ తనను తాను వివాహితుడిగా పేర్కొంటూ ఆయన ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు. ది…