గాంధీ బొమ్మ లేని 2000 నోటు!

డీమానిటైజేషన్ / రీమానిటైజేషన్ లీలలు ఒకటీ, రెండూ కాదు.  ఆ మధ్య సంస్కృత అంకెలను తప్పు ముద్రించారు. ఆ తర్వాత ఆంగ్లం అంకెలని కూడా తప్పు ముద్రించారు. ద్రెడ్ లేకుండా కొన్ని నోట్లు పంచారు. ఓ చోట  బ్యాంకు రెండు వేళా నోటు తెచ్చుకున్నాక కొన్ని గంటల లోపే ముక్కలు ముక్కలుగా దానంతట అదే విరిగిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. కొన్ని చోట్ల సగం మాత్రమే ప్రింట్ అయినా 500 నోట్లు ఎటిఎం లలో ప్రత్యక్షమై…

నోట్ల రద్దు: సేవలు, తయారీల జీడీపీ పతనం

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
డీమానిటైజేషన్ ప్రభావం డిసెంబర్ నెల జీడీపీ పైన కూడా తీవ్రంగా పడిందని నిక్కీ PMI సూచిక తెలియజేస్తున్నది. తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్) తో పాటు సేవల రంగం కూడా భారీగా పతనం అయిందని నిక్కీ PMI సూచిక ద్వారా తెలుస్తున్నది.  PMI అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని అర్ధం. ఆర్ధిక సర్వే సంస్ధలు ఆయా ఉత్పత్తి రంగాల లోని కంపెనీల మేనేజర్లను సర్వే చేసి సదరు రంగాల ఉత్పత్తి పనితనాన్ని అంచనాల…

నోట్ల రద్దు నిరసన: లక్ష కి.గ్రాల కూరగాయలు ఫ్రీగా ఇచ్చేసిన రైతులు

“డీమానిటైజేషన్ వల్ల జనానికి కాస్త అసౌకర్యం కలిగించిన మాట నిజమే. కానీ ప్రజలందరూ డీమానిటైజేషన్ కు మద్దతు ఇస్తున్నారు. మోడీ మంచి చర్య తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్నారని మెచ్చుఁకుంటున్నారు. దేశంలో ఏ ఒక్కరూ నిరసన తెలియజేయక పోవటమే అందుకు నిదర్శనం. జనం ఎక్కడా వీధుల్లోకి రాకపోవడమే అందుకు సాక్షం.”  ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న మాట. డీమానిటైజేషన్ ఫలితంగా వందకు మందికి…

నోట్ల రద్దు: ఆర్‌టి‌ఐ కింద సమాచారం నిరాకరించిన ఆర్‌బి‌ఐ

“ప్రభుత్వ అధికారులు, మంత్రులు ప్రజలకు జవాబుదారీ వహించాలి. పాలనలో పారదర్శకత పాటించాలి. అప్పుడే సుపరిపాలన అందించినట్లు” అని ప్రధాని మోడి గొప్ప గొప్ప నీతి బోధలు చేస్తారు. ఆయన నీతి బోధనలను ఆయన ప్రభుత్వమే పాటించదు. ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనంల కోసం ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వ సంస్ధలే గౌరవించవు. కోట్లాది మంది ప్రజల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి రద్దు చేసి, రోడ్ల మీదికి నెట్టి, చివరికి రద్దు చేసిన నోట్లు కలిగి ఉన్నందుకు వారిని…

రాజు వెడలె రవి తేజము లలరగ… -కార్టూన్

డీమానిటైజేషన్ ప్రకటించినప్పుడు ‘ఆహా… ఒహో…’ అన్న వారంతా ఇప్పుడు వెనక్కి మళ్లుతున్నారు. U టర్న్ తీసుకుంటున్నారు. “బ్లాక్ మనీపై పోరాటం మంచిదే” అని నితీశ్ కుమార్ అప్పుడు తొందరపడి ఆమోదించేశారు. ఇప్పుడు “డిసెంబర్ 30 వరకూ చూసి, పరిస్ధితి సమీక్షించి నా అవగాహన చెబుతాను” అంటున్నారు. “నిర్ణయం, ఉద్దేశం మంచిదే, కానీ అమలు తీరు బాగోలేదు” అని సి‌పి‌ఐ నేతలు నీళ్ళు నమిలారు. ఇప్పుడు “పేదలకు, కార్మికుల జీవితాలు నాశనం చేశారు” అంటున్నారు. “ఇది చేయమని ఎప్పటి…

ఇంకో తుఘ్లక్ రూల్, డిసెంబర్ 30 లోపు ఒకే డిపాజిట్

భారత జనం పైన మరో తుఘ్లక్ నిబంధన వచ్చిపడింది. ఈసారి ఆర్‌బి‌ఐ చేత అధికారికంగా ఈ రూల్ ని జారీ చేయించారు. ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 30 లోపు పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసే అవకాశం ఒక్కసారే ఉంటుంది. డిపాజిట్ చేసే సొమ్ము రు 5,000 గానీ అంతకు లోపు గానీ ఉంటే బ్యాంకు వాళ్ళు నిన్ను ఏమీ అనరు. 5,000 కు పైన ఉంటే మాత్రం సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తారు. అంతటితో అయిపోలేదు.…

నోట్ల రద్దు: అడుక్కుంటున్న విదేశీ టూరిస్టులు -వీడియో

విదేశీ టూరిస్టులకు డీమానిటైజేషన్ శరాఘాతం అయింది. ముఖ్యంగా నోట్ల రద్దు ప్రకటించిన రోజుకు అటూ ఇటూ రోజుల్లో ఇండియాలో చారిత్రక స్ధలాలు చూద్దామని వచ్చిన టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేతిలో ఉన్న 500, 1000 నోట్లు చిత్తు కాగితాలు అయ్యాయి. బ్యాంకులో మార్చుకోవడానికేమో వారి వద్ద ఆధార్ లాంటి భారతీయ గుర్తింపు కార్డులు లేవు. ఉన్న చిల్లర డబ్బులతో (100, 50, 10 మొ.నవి) జరిగినంత కాలం గడిపారు. ఇక జరగడం ఆగిపోయాక ఎటూ పాలుపోక…

డీమానిటైజేషన్ & రీమానిటైజేషన్ -కార్టూన్

రీమానిటైజేషన్ (ఆర్ధిక వ్యవస్ధ లోకి కొత్త నోట్లు ప్రవేశపెట్టే ప్రక్రియ) కు అట్టే సమయం పట్టబోదని నిన్న (లేకపోతే మొన్న) ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చేశారు. ఎప్పటిలాగానే ఆయన హామీలో వివరాలు ఏవీ లేవు. సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ “70 రోజుల వరకూ ఆగాలి” అని స్వయంగా చెప్పాడు. అంతకు ముందు రోజు (డిసెంబర్ 13 న) ఇంకా 15 రోజులు ఆగాలి అని చెప్పి…

50 కాదు 70 రోజులు ఆగాలి, మాట మార్చిన కేంద్రం

  “50 రోజులు ఆగితే అంతా సర్దుకుంటుంది” అని ప్రధాని మోడీ చెబుతూ వచ్చారు. మొన్న సుప్రీం కోర్టులో కూడా “మరో 15 రోజుల్లో కరెన్సీ పరిస్దితి పూర్తిగా మెరుగు పడుతుంది” అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీం ధర్మాసనానికి హామీ ఇచ్చారు. కానీ అదే రోహత్గి మరుసటి రోజే మాట మార్చేశారు.  “70 రోజుల వరకు ప్రజలు సహనం పాటించాలి. అసౌకర్యాన్ని భరించాలి. ఎందుకంటే 70 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం నల్ల ధనం, అవినీతిలపై…

నోట్ల రద్దు ఆర్‌బి‌ఐ ప్రతిష్టను మంటగలిపింది -ఎస్&పి

డీమానిటైజేషన్ పరిణామాలు, ఫలితాలపై నివేదిక  వెలువరించిన అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ ఎస్&పి పలు అంశాలను తన నివేదికలో పొందుపరిచింది. వాటిలో ఒకటి: అనేక యేళ్లుగా నిక్కచ్చి పని విధానంతో, ఉన్నత స్ధాయి ప్రమాణాలతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీమానిటైజేషన్ వల్ల ఒక్కసారిగా పరువు పోగొట్టుకుందని చెప్పడం. “కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చర్య సెంట్రల్ బ్యాంకు సమర్ధత, స్వతంత్రతలను మంటగలిపింది” అని ఎస్&పి తన నివేదికలో పేర్కొంది.…

నోట్ల రద్దు విధ్వంసం 2018 వరకూ… -ఎస్&పి

“యాభై రోజులు ఓపిక పట్టండి. కష్టాలు అన్ని తీరుతాయి” అని ప్రధాని మోడీ నోట్ల రద్దు ప్రవేశపెడుతూ హామీ ఇచ్చారు. “మరో 15 రోజుల్లో అంతా సర్దుకుంటుంది” అని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి డిసెంబర్ 2 తేదీన సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. “ప్రజలు ఎన్నాళ్ళు ఇలా క్యూల్లో నిలబడాలి? ఈ ‘అసౌకర్యం’ ఎన్నాళ్ళు భరించాలి?” అని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనానికి సమాధానం ఇస్తూ రోహత్గి ఈ భరోసా…

మోడి అవినీతి బైటపెడతా -రాహుల్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ తన వద్ద ఒక రహస్యం ఉన్నదని కొద్ది రోజులుగా చెబుతున్నారు. ఆ రహస్యాన్ని చెప్పేస్తానేమో అన్న భయంతో తనను లోక్ సభలో అధికార పక్ష సభ్యులు మాట్లాడనివ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తన వద్ద ఉన్న రహస్యం “మోడి వ్యక్తిగతంగా పాల్పడిన అవినీతికి సంబంధించినది” అని ఆయన ఈ రోజు చెప్పారు. పార్లమెంటులో, ముఖ్యంగా లోక్ సభలో ఎవరు ఎవరిని మాట్లాడనివ్వడం లేదో అర్ధం కాకుండా…

నల్ల ధనం సున్నా, అంచనా దాటిన పాత నోట్ల జమ

ప్రధాని మోడీ గారి డీమానిటైజేషన్ కధ దాదాపు కంచికి చేరినట్లే. పాత పెద్ద నోట్ల రద్దు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం, RBI లు దేశంలో ఎంత డబ్బు చలామణిలో ఉన్నదో చెప్పారు. వారి ప్రకారం రద్దు చేసిన ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లలో చలామణిలో ఉన్న మొత్తం 14.95 లక్షల కోట్లు. కొన్ని పత్రికలు 14.18 లక్షల కోట్లు అని చెబుతున్నాయి. ప్రస్తుతానికి పెద్ద అంకెనే తీసుకుందాం.  ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…

వడ్డీలో మార్పు లేదు, జీడీపీ అంచనా తగ్గింపు

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
  RBI జెల్ల కొట్టింది. వడ్డీ రేటు తగ్గింపు కోసం బడా కంపెనీలు, బడా బాబులు ఆశగా ఎదురు చూస్తుంటే వారి ఆశల్ని వమ్ము చేసింది. వడ్డీ రేట్లలో మార్పులు లేవు పొమ్మంది. పైగా 2016-17 సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు విషయమై గతంలో వేసిన అంచనాను తగ్గించేసుకుంది. వృద్ధి రేటు 7.1 శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.  ప్రస్తుతం రేపో రేటు (స్వల్ప కాలిక వడ్డీ రేటు –…

నోట్ల రద్దు: అధమ స్ధాయిలో ఫ్యాక్టరీ, సేవల జీడీపీ

  ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన డీమానిటైజేషన్ వల్ల ప్రజలు నానా కష్టాలు పడుతుండగా భారత జీడీపీ కూడా అదే పరిస్ధితి ఎదుర్కొంటున్నది. ఆర్ధిక నిపుణులు అంచనా వేసిన దానికంటే ఘోరంగా జీడీపీ వృద్ధి రేటు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  నవంబరు నెలలో భారత సేవల రంగం వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోనున్నదని హఫింగ్టన్ పోస్ట్ నిర్వహించిన సర్వేలో తేలింది. భారత జీడీపీలో అత్యధిక వాటా -60 శాతం వరకు- సేవల రంగానిదే. కనుక మొత్తం జీడీపీ…