డీమానిటైజేషన్: పడిపోయిన ఇండియా జిడిపి
2016-17 సంవత్సరంలో ఇండియా జిడిపి గణనీయంగా పడిపోయింది. 8 శాతం పైగా నమోదు చేస్తుందని ఆర్ధిక సంవత్సరం ఆరంభంలో ప్రభుత్వం, ఆర్‌బిఐ, ఆర్ధిక సలహాదారులు అంచనా వేయగా 7 శాతం మాత్రమే నమోదు అయినట్లు ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు తెలిపాయి. డీమానిటైజేషన్ వల్ల భారత ఆర్ధిక వృద్ధి రేటు పడిపోతుందన్న పలువురు నిపుణుల అంచనాలు నిజం కాగా ప్రభావం పెద్దగా ఉండబోదన్న కేంద్ర ప్రభుత్వ అంచనా తప్పింది. గడచిన ఆర్ధిక సంవత్సరం (2016-17) నాలుగవ త్రైమాసికంలో (జనవరి…