ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ వైరస్!

ప్రస్తుతం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత దేశంలో కూడా ప్రవేశించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.రెండు కేసులూ కర్ణాటక రాష్ట్రంలో కనుగొన్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన ఇద్దరూ పురుషులే. ఒకరి వయసు 66 సం.లు కాగా మరొకరి వయసు 46 సం.లు. ఈ ఇద్దరి జాతీయత ఏమిటో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో భారత పత్రికలు వెల్లడించడం లేదు. అయితే WION వెబ్ సైట్ అందజేసిన…

రష్యన్ పి‌ఎం‌సిలు: సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో తిష్ట -3

సబ్-సహారా ఆఫ్రికా సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలు సంపద్వంతమైన ఖనిజ వనరులకు నిలయం. సహారా ఎడారికి దక్షిణాన ఉన్న దేశాలను సబ్-సహారా ఆఫ్రికా గా పరిగణిస్తారు. ఉత్తరాన సహారా ఎడారి దేశాలు, దక్షిణాన అడవులతో నిండిన ఇతర ఆఫ్రికా దేశాలకు మధ్య అటు పూర్తిగా ఎడారి కాకుండా, ఇటు పూర్తిగా పంటలు సమృద్ధిగా పండేందుకు వీలు లేకుండా ఉన్న ప్రాంతాన్ని సహేలి ప్రాంతం అంటారు. పశ్చిమాన సెనెగల్ నుండి తూర్పున సోమాలియా వరకు ఒక బెల్ట్ లాగా…

విస్తరిస్తున్న రష్యన్ ప్రైవేట్ మిలట్రీ కార్యకలాపాలు -2

అనధికారికంగానే అయినా రష్యన్ పి‌ఎం‌సి లు రష్యాకు చెందిన పలు వ్యూహాత్మక, ఆర్ధిక, రాజకీయ లక్ష్యాలను నెరవేరుస్తున్న సంగతి కాదనలేనిది. ఈ ప్రయోజనాలు: 1. విదేశీ విధానం:. పి‌ఎం‌సిల ద్వారా రష్యా ప్రభావం విస్తరిస్తోంది. ముఖ్యంగా భద్రతా రంగంలో. దానితో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వేతర శక్తులతోనూ స్నేహ సంబంధాలు పెంపొందుతున్నాయి. 2. మిలట్రీ ప్రయోజనాలు: ప్రత్యేక బలగాల (స్పెషల్ ఫోర్సెస్) ద్వారా శిక్షణ పొందిన ప్రైవేటు బలగాలు ప్రత్యేకమైన నైపుణ్యం, సామర్ధ్యం కలిగి…

విస్తరిస్తున్న రష్యన్ ప్రైవేట్ మిలట్రీ కార్యకలాపాలు

“నువ్వు రాళ్ళు విసిరితే చుట్టూ గోడ కట్టుకుంటా…” అంటూ సాగుతుంది ఒక కొటేషన్. ఉక్రెయిన్ సంక్షోభం దరిమిలా, అమెరికా ప్రపంచాధిపత్యాన్ని ఎదుర్కొనే క్రమంలో రష్యా ఈ సూత్రాన్నే పాటించింది. అమెరికా విసిరిన వ్యూహాన్ని ప్రయోగించి తన వరకు గోడ కట్టుకోవడంతో పరిమితం కాకుండా తన సహాయం అర్ధించిన ఇతర దేశాలకు కూడా గోడలు కట్టి ఇస్తోంది రష్యా. పనిలో పనిగా తన ప్రభావాన్ని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో సాపేక్షికంగా గణనీయంగా విస్తరించుకుంటోంది. 2014 వరకు…

క్యూబా వాక్సిన్ రెడీ: ఫార్మా కంపెనీల గుండెల్లో గుబులు

కోవిడ్ 19 (సార్స్-కోవ్-2) వ్యాధి నిర్మూలనకై పశ్చిమ దేశాలకు చెందిన బడా కార్పొరేట్ ఫార్మా కంపెనీలు అనేక వ్యాక్సిన్ లు తయారు చేశాయి. అవసరమైన 3 దశల పరీక్షలు జరిపినట్లు చెప్పాయి. ఇక వైరస్ చచ్చినట్లే అని నమ్మబలికాయి. ఆ మేరకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రియా, జర్మనీ తదితర ధనిక దేశాల అధిపతులు కూడా తమ తమ కంపెనీల తరపున సగర్వ ప్రకటనలు జారీ చేశారు. కానీ వైరస్ ఇంకా విస్తరిస్తూనే ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి. తయారైన…

జింబాబ్వేలో మిలట్రీ కుట్ర: ముగాబే హౌస్ అరెస్ట్!

పశ్చిమ సామ్రాజ్యవాదులు మరోసారి ప్రచ్చన్న యుద్ధం నాటి మిలట్రీ కుట్రలకు తెర తీశారు. జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (97) ను, ఆయన కుటుంబాన్ని ఆ దేశ మిలట్రీ గృహ నిర్బంధంలో ఉంచింది. రాజధాని హరారేలో సైనికులు కవాతు తొక్కుతున్నారు. పలు ప్రభుత్వ భవనాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి ఆఫీసులకు వెళ్లకుండా రోడ్లపైనే ఆపి వెనక్కి పంపేశారు. “దేశాధ్యక్షుడు క్షేమమే” అంటూ మొదట ప్రకటించిన సైన్యం ఆ తర్వాత ఆధికారాలను చేపట్టినట్లు ప్రకటించింది.…

వెనిజులా సంక్షోభం: సుప్రీం కోర్టుపై హెలికాప్టర్ దాడి

సంక్షుభిత లాటిన్ అమెరికా దేశం వెనిజులాలో మరో సారి రాజకీయ సంక్షోభం తీవ్రం అయింది. నిరసన పేరుతో జాతీయ పోలీసుల్లోని ఒక సెక్షన్ అధికారి జూన్ 27 తేదీన ప్రభుత్వ హెలికాప్టర్ ను స్వాధీనం చేసుకుని దాని ద్వారా నేరుగా సుప్రీం కోర్టు పైనే కాల్పులు సాగించాడు. దాడి చేసిన వారిని టెర్రరిస్టులుగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించాడు. ప్రతిపక్షాలు అధ్యక్షుడు మదురోపై పెడుతున్న తప్పుడు కేసులను సాక్ష్యాలు లేని కారణాన డిస్మిస్ చేస్తున్న నేపధ్యంలో…

ఒబామా విధానాలను కొనసాగిస్తున్న ట్రంప్ -2

………….మొదటి భాగం తరువాత లాటిన్ అమెరికా ఒబామా పాలన చివరి సంవత్సరాల్లో అమెరికా సామ్రాజ్యవాదం లాటిన్ అమెరికాలో పాల్పడిన కుట్రలు కొన్ని విజయవంతం అయ్యాయి. వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావేజ్ ను పోలోనియం ఇంజక్షన్ ద్వారా చంపేశారు. చావేజ్ స్ధానంలో అధ్యక్ష పదవి చేపట్టిన మదురో ప్రభుత్వాన్ని కూలదొసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. మదురోపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. బడ్జెట్ లో ఒక ప్రొసీజర్ లో చేసిన తప్పును పెద్దది చేసి బ్రెజిల్ అధ్యక్షురాలు…

ఎబోలా యుద్ధంలో మరో విజయం -ది హిందు ఎడిట్

(జనవరి 24 తేదీన ప్రచురించబడిన ‘Another Ebola battle won’ కు యధాతధ అనువాదం. -విశేఖర్) ********* జనవరి 18 తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ, మాలి ప్రభుత్వంలు మాలిని ఎబోలా వైరస్ నుండి విముక్తి అయిన దేశంగా ప్రకటించాయి. ఈ ప్రాణాంతక వ్యాధి నుండి విముక్తి అయిన దేశాలలో నైజీరియా, సెనెగల్ ల తర్వాత మాలి మూడవది. ఎబోలా వైరస్ నుండి విముక్తి అయినట్లుగా ఒక దేశాన్ని ప్రకటించాలంటే వరుసగా 42 రోజుల పాటు అక్కడ…

బొకో హరమ్ కిడ్నాప్, మిచెల్లే ఒబామా హిపోక్రసీ

నైజీరియా పాఠశాల విద్యార్ధినుల కిడ్నాప్ విషయంలో అమెరికా ప్రధమ మహిళ మిచెల్లే ఒబామా తీసుకున్న చొరవ అధ్యక్షుడు ఒబామాకు ఎదురు తిరిగింది. కిడ్నాప్ అయిన అమ్మాయలను వెనక్కి తేవాలంటూ మిచెల్లే ఒక ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫోటో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, దాదాపు అన్నీ పత్రికల్లోనూ హల్ చల్ చేసింది. ఒబామా విధ్వంసక డ్రోన్ దాడుల విధానాన్ని వ్యతిరేకిస్తున్న అనేకమంది వ్యక్తులు, సంస్ధలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. ఒబామా ముందు తన డ్రోన్ లను…

తలచేము నిను నెల్సన్ మండేలా… -విని తీరాల్సిన పాట!

1990 దశాబ్దం అంతా ఈ పాట తెలుగు నేలపై మోగుతూ ఉండేది. ముఖ్యంగా పి.డి.ఎస్.యు విద్యార్ధి సంఘంతో పాటు ఇతర విప్లవ విద్యార్ధి సంఘాల్లో పని చేసిన, అనుసరించిన విద్యార్ధులకు ఈ పాట చిరపరిచితం. నల్లజాతి ప్రజల సాయుధ తిరుగుబాటుకు తలఒగ్గుతూ దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం 1990లో నెల్సన్ మండేలాను విడుదల చేసినపుడు అప్పటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు శక్తి ఉరఫ్ జె.కనకరాజు గారు ఈ పాట రాసి పాడారు. తెలంగాణ ప్రజా కళాకారులు జయరాజ్…

ఆరిపోయిన నల్ల వజ్రానికి ప్రపంచం నివాళి -ఫోటోలు

27 సంవత్సరాల కారాగారవాసం సైతం రొలిహ్లాహ్లా మండేలాను కుంగదీయలేదని చెప్పడానికి  95 యేళ్ళ ఆయన నిండు జీవితానికి మించిన సాక్ష్యం ఏముంటుంది? బలమైన శత్రువుకు వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టడానికి ప్రారంభంలో గాంధీ అహింసా సిద్ధాంతాన్ని ఎత్తుగడల రీత్యా ఆశ్రయించిన మండేలా జాత్యంకార అణచివేతను నిర్ణయాత్మకంగా ఓడించాలంటే సాయుధ పోరాటం తప్ప దారి లేదని సరిగ్గానే అంచనా వేశారు. ఏ.ఎన్.సి యువజన సంస్ధ సాయుధమై మిలిటెంట్ గెరిల్లా పోరాటమే చేయకపోతే మండేలా విడుదల సాధ్యం అయ్యేదే కాదని చరిత్ర…

ముగిసిన మండేలా లాంగ్ వాక్ -2

మొదటి భాగం తరువాత………………. అయితే మండేలా ఖైదుతో వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమం బలహీనపడకపోగా మరింత బలపడింది. 1980ల కల్లా జాత్యహంకార రాజ్యం ఆస్తులను ధ్వంసం చేసే చర్యలు ఊపందుకున్నాయి. గెరిల్లా దాడులు పెరిగిపోయాయి. మండేలా ఖైదు దక్షిణాఫ్రికా అంతటా సంవత్సరాల తరబడి స్ధిరమైన చైతన్యానికి పాదుకొల్పింది. ఉమ్మడి నాయకత్వానికి మండేలా ప్రాధాన్యం 1986లో వెలువడిన ‘మండేలా కోసం ఎదురుచూపులు’ అన్న పుస్తకంలో రచయిత జె.ఎం.కొయెట్జి ఇలా పేర్కొన్నారు. “1985 నాటి తిరుగుబాట్లలో ఎక్కడ చూసినా ఆయన…

ఆఫ్రికన్ సఫారి: అరుదైన జంతు ప్రపంచం -ఫోటోలు

నిన్న మొన్నటి వరకు చీకటి ఖండంగా పిలువబడిన ఆఫ్రికా ఇప్పుడు తనను తాను ప్రపంచానికి చూపుకుంటోంది. జాత్యహంకార అణచివేత నుండి దక్షిణాఫ్రికాను విడిపించిన ఉద్యమానికి నేతగా నెల్సన్ మండేలా ప్రపంచ రాజకీయ యవనికపై 1990లలో అవతరించిననాటి నుండి రువాండా, బురుండి మారణకాండల మీదుగా ‘అరబ్ వసంతం’ పేరుతో ఇటీవల ట్యునీషియా, ఈజిప్టులలో ప్రజా తిరుగుబాట్లు చెలరేగడం వరకు ఆఫ్రికాను అంతర్జాతీయ వార్తల్లో నిలిపాయి. ఇది మానవ ప్రపంచం. కాకులు దూరని కారడవులకు నిలయమైన ఆఫ్రికా దక్షిణ దేశాలు…

ఉగ్రవాదం కాదు స్వార్ధం కోసమే అమెరికా గూఢచర్యం -బ్రెజిల్

ప్రపంచంలో ఉగ్రవాద ప్రమాదాన్ని అరికట్టడానికే తాను ప్రపంచ ప్రజలందరిపైనా గూఢచర్యం సాగిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పుకున్నాడు. వాస్తవంలో అమెరికా బహుళజాతి కంపెనీల వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాల కోసమే అమెరికన్ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం జరుగుతోందని తాజా స్నోడెన్ పత్రాలు స్పష్టం చేశాయి. అమెరికాతో పాటు కెనడా కూడా ఈ గూఢచర్యంలో భాగం పంచుకుందని, ముఖ్యంగా బ్రెజిల్ లోని మైనింగ్ పరిశ్రమలో తమ కంపెనీల ప్రయోజనాల కోసం ఎన్.ఎస్.ఏ గూఢచర్యాన్ని కెనడా వినియోగించుకుందని బ్రిటిష్ పత్రిక ది గార్డియన్…