భళా అరుణ్ కె. సింగ్!

బ్రిటన్ కేంద్రంగా పని చేసే బహుళజాతి మీడియా కార్పొరేట్ సంస్ధ రాయిటర్స్ ఈ రోజు ఓ వార్తా కధనాన్ని ప్రచురించింది. మోడి పాలనలో ఇండియాను సందర్శించే అమెరికా అధికారుల పరిస్ధితి ఏమిటో విశ్లేషించడానికి ప్రయత్నించిన కధనం అది. భారత రాయబారి దేవయాని ఖోబ్రగాదేను అక్రమంగా అరెస్టు చేసి జైలుపాలు చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితిలో తేడా ఏమన్నా వచ్చిందా అని ఈ కధనం విశ్లేషించేందుకు ప్రయత్నించింది. దేవయాని ఖోబ్రగాదే వ్యవహారం గురించి మర్చిపోతే గనక…

మోడిని ప్రసన్నం చేసుకోలేని కెర్రీ? -కార్టూన్

అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ కొద్ది రోజుల క్రితం ఇండియా వచ్చి వెళ్లారు. మోడి రాక కోసం తమ అధ్యక్షుడు బారక్ ఒబామా ఆత్రంగా ఎదురు చూస్తున్నారన్న సందేశాన్ని మోసుకొచ్చిన కెర్రీ, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా మోడీ ముందు వ్యవహరించారని కార్టూన్ సూచిస్తోంది. దేవయాని ఖోబ్రగదేను అమెరికాలో అరెస్టు చేసినప్పటి నుండి ఇరు దేశాల సంబంధాలు క్షీణ దశలో ఉన్నాయని పత్రికలు చెప్పే మాట. మోడి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న…

ఇండియా-అమెరికా సంబంధాల్లో షాడో బాక్సింగ్ -ది హిందూ ఎడిటోరియల్

(ఈ సంపాదకీయం ది హిందూ పత్రిక ఎప్పటి అవగానలో భాగంగా కనిపించడం లేదు. మోడి అధికారంలోకి వచ్చినప్పటి నుండీ బి.జె.పి నూతన హయాంలో సానుకూల అంశాలను కనిపెట్టడానికి ఆపసోపాలు పడుతున్నట్లు కనిపిస్తున్న ది హిందూ ధోరణిలోనే ఈ సంపాదకీయం సాగింది. లేదంటే తెలిసి తెలిసీ అమెరికాతో సత్సంబంధాలను కోరే దుస్సాహసానికి పత్రిక ఎందుకు పూనుకుందో అంతుబట్టని విషయం. కోరి దృత రాష్ట్ర కౌగిలిలోకి వెళ్ళమని ప్రోత్సహిస్తున్న ఇటువంటి సంపాదకీయం ది హిందూ నుండి వెలువడడం ఒకింత ఆశ్చర్యకరమే…

యుద్ధోన్మాది మెక్ కెయిన్ ఇండియా పర్యటన

కరడు గట్టిన యుద్ధోన్మాది, అమెరికా సెనేటర్ జాన్ మెక్ కెయిన్ ఇండియా పర్యటన కోసం వేంచేశారు. దేవయాని ఖోబ్రగదే వ్యవహారం వల్ల చెడిన ఇండియా-అమెరికా సంబంధాలను తిరిగి పట్టాలు ఎక్కించడానికి మెక్ కెయిన్ పర్యటన ఉద్దేశించబడింది. మెక్ కెయిన్ రాకకు మునుపు బి.జె.పి పార్టీపై గూఢచర్యం నిర్వహించడానికి అమెరికా రహస్య గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనుమతి సంపాదించిందన్న సమాచారాన్ని ఎడ్వర్డ్ స్నోడెన్ లీక్ చేసినప్పటికీ అమెరికాతో దృఢమైన సంబంధాల పెంపుదలకు మోడి ప్రభుత్వానికి ఏమీ ఆటంకం కాలేకపోయింది.…

దేవయాని: అమెరికా రాయబారి రాజీనామా

భారత దేశంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ రాజీనామా చేశారు. ఆమె రాయబారిగా నియమితులై రెండు సంవత్సరాలు కూడా కాలేదు. ఈ లోపే రాజీనామా చేయడానికి దేవయాని ఖోబ్రగదే వ్యవహారమే కారణమని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని కలవడం ద్వారా ఏడేళ్ళ బాయ్ కాట్ కి లాంఛనంగా తెరదించిన నాన్సీ పావెల్ రాజీనామా కొంత కాలంగా అమెరికా విదేశాంగ శాఖ చర్చల్లో నలుగుతున్నదే అని తెలుస్తోంది. రాజీనామా అనంతరం నాన్సీ…

ఇండియాలో అమెరికా రాయబారుల వీసా ఫ్రాడ్

తమ పని మనిషి విషయంలో దేవయాని వీసా ఫ్రాడ్ కి పాల్పడిందని అమెరికా ఆరోపించింది. అమెరికన్ అయినా-ఇండియన్ అయినా, ధనికులైనా-పేదలైనా, యజమాని ఐనా-పని మనిషి ఐనా ఇలాంటి నేరాలు సహించేది లేదని హుంకరించింది. అయితే దేవయాని చేసిందంటున్న నేరంలో భారత ప్రభుత్వం పాత్ర ఏమీ లేదు. అనగా ఫలానా పద్ధతుల ద్వారా పని మనుషుల్ని అమెరికా తీసుకెళ్లవచ్చని భారత ప్రభుత్వం సూచనలు, సలహాలు ఏమీ ఇవ్వలేదు. కానీ ఇండియాలో ఆదాయ పన్ను చెల్లించకుండా ఉండడానికి, తమతో పాటు…

అమెరికా ఎంబసీ: పన్ను ఎగేస్తుంది, స్పైలను పోషిస్తుంది…

దేవయాని ఖోబ్రగదే వ్యవహారంలో భారత పాలకులు కాస్త తల ఎత్తిన ఫలితంగా ఇండియాలో అమెరికా ఎంబసీ సాగించిన చట్ట విరుద్ధ కార్యకలాపాలు కొద్దిగా ఐనా వెలుగులోకి వస్తున్నాయి. భారత దేశంలో అమెరికా దౌత్యాధికారులు, రాయబార ఉద్యోగులు, వారి అనుబంధ సంస్ధలు దశాబ్దాలుగా అనుభవిస్తున్న సౌకర్యాలకు తోడు దేశ ఆదాయానికి కూడా గండి కొట్టే కార్యాలు వాళ్ళు చాలానే చక్కబెట్టుకున్నారు. అమెరికన్ ఎంబసీకి అనుబంధంగా నిర్వహించే క్లబ్ కార్యకలాపాలకు చెక్ పెట్టిన కేంద్రం ఇప్పుడు ‘అమెరికన్ ఎంబసీ స్కూల్’…

చలికి చివికిపోతున్న అమెరికా దౌత్యం -కార్టూన్

తాజా రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిణామాలను ఉనికిలో ఉన్న వాతావరణంతో పోలిక పెట్టి పాఠకులకు గిలిగింతలు పెట్టడం కార్టూనిస్టులకు ఇష్టమైన విద్య. ది హిందూ కార్టూనిస్టు కేశవ్ కూడా ఈ కార్టూన్ లో ఈ విద్యనే ప్రదర్శించారు. పోలార్ వొర్టెక్స్ ప్రభావంతో గత వారం అంతా అమెరికా చలితో గజ గజ వణికిపోయింది. కొన్ని చోట్ల -56 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోయేంతగా చలి గాలులు అమెరికాను పీడించాయి. ఆర్కిటిక్ చలి వాతావరణాన్ని సహజసిద్ధంగా పట్టి బంధించే…

దేవయాని: అమెరికా ఆఫర్ తిరస్కరించిన ఇండియా

దేవయాని విషయంలో చివరి క్షణాల్లో అమెరికా ఇవ్వజూపిన ఒక ఆఫర్ ను భారత ప్రభుత్వం తిరస్కరించిన సంగతి వెల్లడి అయింది. దేవయానిపై మోపిన నేరారోపణల తీవ్రతను తగ్గించి నమోదు చేస్తామని, అందుకు సహకరించాలని అమెరికా అధికారులు కోరారు. అయితే తగ్గించిన ఆరోపణలు కూడా క్రిమినల్ ఆరోపణలే కావడంతో అందుకు భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆరోపణలను పూర్తిగా రద్దు చేయడం తప్ప మరో పరిష్కారం తమకు ఆమోదయోగ్యం కాదని ఇండియా స్పష్టం చేయడంతో అమెరికా తాను అనుకున్న పని…

నాలుగేళ్ల ఆఫ్ఘన్ పిల్లాడిన చంపేసిన అమెరికా సైన్యం

‘టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం’లో నిండా మునిగిన అమెరికా సైనికులు 4 సంవత్సరాల వయసుగల టెర్రరిస్టును కాల్చి చంపి కాలరెగరేశారు. ఆనక ప్రమాదవశాత్తూ చంపామని ప్రకటించారు. దుమ్ము దట్టంగా ఉండడంతో 4 యేళ్ళ పిల్లాడు తమ మీదికి దాడికి వస్తున్నాడని భావించి కాల్చి చంపామని సైనికులు చెప్పారని స్ధానిక ఆఫ్ఘన్ ప్రభుత్వం తెలిపింది. ఆఫ్ఘన్ పౌరుల ప్రాణాలకు హామీ ఇస్తే తప్ప అమెరికాతో ‘ద్వైపాక్షిక భద్రతా ఒప్పందాని’కి ఒప్పుకునేది లేదని చెబుతున్న అధ్యక్షుడు కర్జాయ్ తాజా ఘటనతో స్వరం…

మరో ప్రతీకారం: అమెరికా రాయబారి వెళ్లిపోవాలని ఆదేశం

దేవయాని దేశం విడిచి వెళ్లాలని అమెరికా ఆదేశించడంతో ఇండియా మరో ప్రతీకార చర్య ప్రకటించింది. దేవయాని ర్యాంకుకు సమానమైన అమెరికా రాయబార అధికారిని ఇండియా విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఐరాసలోని భారత శాశ్వత కార్యాలయంలో దేవయాని ప్రస్తుతం నియమితురాలయిన సంగతి తెలిసిందే. ఐరాసలో భారత తరపు అధికారిగా దేవయాని పూర్తిస్ధాయి రాయబార రక్షణకు అర్హురాలు. రెండు రోజుల క్రితమే (జనవరి 8) దేవయానికి ఈ హోదా ఇస్తూ అమెరికా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవయాని…

పూర్తయిన నేరారోపణ, ఇండియా వస్తున్న దేవయాని

దేవయాని సమస్య ఎట్టకేలకు పరిష్కారం అవుతోంది. గురువారం వరుసగా, వేగంగా జరిగిన నాటకీయ పరిణామాల మధ్య దేవయాని ఇండియాకు తిరిగి రావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓ వైపు న్యూయార్క్ ప్రాసిక్యూషన్ కోర్టులో దేవయానిపై అభియోగాలను మోపడం పూర్తి అవుతుండగానే ఆమెకు పూర్తి స్ధాయి రాయబార రక్షణ కల్పించే ఐరాస భారత శాశ్వత కార్యాలయం బదిలీని ఆమోదిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటించింది. దానితో రాయబార రక్షణ ఆసరాతో దేవయాని ఇండియాకు తిరిగి రావడానికి మార్గం సుగమం…

ఆదర్శ స్కాం, రాహుల్ ఆదర్శం -కార్టూన్

ఢిల్లీలో ఎఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొదలు రాహుల్ గాంధీకి అవినీతి నిర్మూలనా జ్వరం పట్టుకుంది. అవినీతి నిర్మూలన తమ ఎజెండాలో కూడా ఉందని చెప్పుకోవడానికి ఆయన తెగ తంటాలు పడుతున్నారు. ఆదర్శ కుంభకోణం పైన మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు దరిమిలా తానూ అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి మరో అవకాశం కలిసొచ్చింది. కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన భారత సైనికుల కోసం భారత ప్రభుత్వం ముంబైలో ఆదర్శ్ సొసైటీ పేరుతో స్ధల సేకరణ…

దేవయాని: ప్రాసిక్యూషన్ కే అమెరికా నిర్ణయం

దేవయాని కేసు విషయంలో తెరవెనుక చర్చలు విఫలం అయినట్లు కనిపిస్తోంది. ఇంటి పని మనిషికి వేతనం చెల్లింపులో మోసానికి పాల్పడ్డారని ఆరోపించిన అమెరికా, దేవయాని ప్రాసిక్యూషన్ విషయంలో ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకుందని తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. అరెస్టు అయ్యే సమయానికి దేవయాని ఐరాస తాత్కాలిక సలహాదారుగా పూర్తి స్ధాయి రాయబార రక్షణ కలిగి ఉన్నారని భారత ఐ.ఎఫ్.ఎస్ అధికారులు కనుగొన్నప్పటికీ అమెరికా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. అసలు కేసు పెట్టడానికి తగిన పునాది లేదని దేవయాని…

కొత్త మలుపు: అరెస్టు నాటికి పూర్తి రక్షణకు దేవయాని అర్హురాలే

దేవయాని ఖోబ్రగదే అరెస్టు విషయం కొత్త మలుపు తిరిగింది. వియన్నా ఒప్పందం ప్రకారం కాన్సలార్ సిబ్బంది పూర్తి రాయబార రక్షణకు అర్హురాలు కాదని కాబట్టి ఆమె అరెస్టు, తదనంతరం ఆమె పట్ల వ్యవహరించిన తీరు చట్టబద్ధమే అని అమెరికా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సంవత్సరం ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని దేవయానిని న్యూయార్క్ లోని ఐరాస శాశ్వత కార్యాలయానికి సలహాదారుగా నియమించింది. ఈ హోదాలో ఆమె పూర్తి రాయబార రక్షణకు అర్హురాలు అన్న…