ఇస్తాంబుల్ చర్చలు సఫలం, ఆందోళనలో అమెరికా శిబిరం?


Press gathers outside Dolmabache palace in Turkey

మంగళవారం, మార్చి 29, 2022 తేదీన రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయని రష్యా ప్రతినిధి బృందం నేత మెడిన్ స్కీ చేసిన ప్రకటనతో స్పష్టం అయింది.

ఈ పరిణామం రష్యా శిబిరంలో సంతోషాతిరేకాలు కలిగిస్తుండగా అమెరికా నేతృత్వంలోని పశ్చిమ శిబిరంలో ఆందోళన, అగమ్యం వ్యక్తం అవుతున్నాయి. నిజానికి చర్చలు సఫలం అయితే పశ్చిమ శిబిరంలోని యూరోపియన్ యూనియన్ కూడా లోలోపల సంతోషిస్తుంది అనడంలో సందేహం లేదు.

అమెరికా డిమాండ్, ఒత్తిడిల వల్ల రష్యాపై ఆంక్షలను ఐరోపా ప్రకటించింది. కానీ సదరు ఆంక్షలు చివరికి ఐరోపా దేశాల నెత్తికే చుట్టుకున్నాయి. గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. చమురు ధరలు కూడా పెరిగాయి. ద్రవోల్బణం పై చూపే తప్ప కింది చూపు లేకుండా పోయింది. దాంతో ధరలు పెరిగి ప్రజల్లో అసంతృప్తి పెరుగింది.

పశ్చిమ పత్రికలు కవర్ చేయలేదు గాని ఐరోపా దేశాల్లో పలు చోట్ల రష్యా అనుకూల ప్రదర్శనలు కూడా జరిగాయి. రష్యా తన భద్రత కోసం పడుతున్న ఆందోళనకు ఈ ప్రదర్శనల్లో సానుభూతి వ్యక్తం అయింది. చివరికి జర్మనీలో కూడా రష్యా అనుకూల ప్రదర్శనలు జరిగాయి.

ఇస్తాంబుల్ చర్చలు సఫలం అయిన దరిమిలా రష్యా, ఉక్రెయిన్ ల నుండి వరసపెట్టి సానుకూల ప్రకటనలు వెలువడుతున్నాయి. వాటిలో కొన్ని:

ఇరు దేశాల విదేశీ మంత్రులు శాంతి ఒప్పందాలపై సంతకాలు చేస్తున్న తరుణంలోనే సమానాంతరంగా పుతిన్-జెలెన్ స్కీ ల సమావేశం జరుగుతుందని రష్యా ప్రకటించింది.

మాస్కో మిలట్రీ మరియు రాజకీయ డీ-ఎస్కలేషన్ చర్యలు చేపడుతుంది. -రష్యన్ చీఫ్ నెగోటియేటర్ మెడిన్ స్కీ

క్రిమియా మరియు డాన్ బాస్ (లుగాన్స్క్ & డోనెట్స్క్) లకు వ్యతిరేకంగా మిలట్రీ చర్యలను ఉక్రెయిన్ నిలిపివేస్తుంది. -మెడిన్ స్కీ

యూరోపియన్ యూనియన్ లో ఉక్రెయిన్ భాగం అయ్యేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. -రష్యా విదేశీ శాఖ ప్రతినిధి

రష్యా, ఉక్రెయిన్ లు వీడియో లింక్ ద్వారా చర్చలు కొనసాగిస్తారు. చర్చలు జరపడంలో సహాయం చేసినందుకు రష్యా విదేశాంగ శాఖ టర్కీకి కృతజ్ఞతలు తెలిపింది.

రష్యాతో ఘర్షణ వైఖరి విడనాడాలని మాస్కో యూరోపియన్ యూనియన్ ను కోరింది. ఉక్రెయిన్ దాడి నేపధ్యంలో రక్షణ బడ్జెట్ పెంచుతూ మిలట్రీ వృద్ధిపై దృష్టి పెట్టడానికి ఈ‌యూ నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో రష్యా ఈ కోరిక వెలిబుచ్చింది.

వార్సా నుండి రష్యా రాయబారిని బహిష్కరిస్తామని ప్రకటించడం ద్వారా పోలండ్ దేశం రష్యాతో సంబంధాలను నాశనం చేస్తోంది.

ఉక్రెయిన్ విషయాన్ని మేకరాన్, షోల్జ్, ద్రఘి, జాన్సన్ లతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ చర్చించడానికి నిర్ణయించాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేకరాన్, జర్మనీ ఛాన్సలర్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని జాన్సన్, ఇటలీ ప్రధాని మెరియో ద్రఘి లతో చర్చించడానికి బైడెన్ హడావుడిగా నిర్ణయించాడు.

ఇస్తాంబుల్ చర్చలలో ఉక్రెయిన్ చేసిన ప్రతిపాదనలను యధాతధంగా అమలు చేసినట్లయితే రష్యా లక్ష్యం నెరవేరినట్లే. ఏ లక్ష్యాల కోసం అయితే ఉక్రెయిన్ పై దాడి చేసిందో ఆ లక్ష్యాలన్నీ దాడి ద్వారా రష్యా సాధించింది.

దాడికి ముందున్న పరిస్థితితో పోల్చితే ఉక్రెయిన్ పరిస్థితి (వాస్తవానికి అమెరికా పరిస్థితి) మరింత క్షీణించింది.

దాడికి ముందు మిన్స్క్ ఒప్పందాలకు కట్టుబడి ఉంటే చాలని రష్యా డిమాండ్ చేసింది. ఈ ఒప్పందం ప్రకారం డాన్ బాస్ కు కేవలం స్వయం ప్రతిపత్తి ఇస్తే చాలు. అవి ఉక్రెయిన్ లో భాగంగా కొనసాగుతాయి. ఇప్పుడేమో క్రిమియాతో పాటు డాన్ బాస్ ని కూడా ఉక్రెయిన్ వదులుకోవలసి వచ్చింది.

దాడికి ముందు రసాయన, క్రిమి ఆయుధాలను తయారు చేసే బయో-ల్యాబ్ ల ప్రసక్తే రాలేదు. ఇప్పుడు రష్యా వాటన్నింటిని నాశనం చేసింది. ఆ ల్యాబ్ లన్నీ అమెరికాయే నడుపుతోందని రష్యా బైటపెట్టింది. తద్వారా రసాయన, క్రిమి ఆయుధాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా చేసుకున్న ఒప్పందాలను అమెరికా అడ్డంగా ఉల్లంఘిస్తున్న సంగతి బైటపెట్టింది. అంతే కాక ఈ ల్యాబ్ లకు నిధులు సమకూర్చడంలో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ ది ప్రధాన పాత్ర అన్న సంగతి కూడా రష్యా బైటపెట్టింది.

దాడికి ముందు డాన్ బాస్ లో కొంత భాగం మాత్రమే రష్యా ఆధీనంలో ఉన్నది. ఇప్పుడు డాన్ బాస్ ఏరియా పూర్తిగా రష్యా ఆధీనంలోకి వచ్చింది. డాన్ బాస్ ను స్వతంత్ర ప్రాంతంగా రష్యా గుర్తించినప్పటికి ఆచరణలో అది రష్యా నియంత్రణలోనే ఉంటుంది. మునుముందు డాన్ బాస్ రాష్ట్రాలే రిఫరెండం నిర్వహించి రష్యాలో అధికారికంగా కలిసిపోయినా ఆశ్చర్యం లేదు.

దాడికి ముందు అమెరికా, బ్రిటన్, పోలండ్ దేశాల సైన్యాలు ఉక్రెయిన్ లో తిష్ట వేసుకుని ఉన్నాయి. దాడి మొదలు అవుతుండగానే తమ సైన్యాలను ఆ దేశాలు ఉక్రెయిన్ నుండి వెనక్కి పిలిపించుకున్నాయి. ఇప్పుడు శాంతి ఒప్పందం కుదిరితే ఈ సైన్యాలకు ఇక ఉక్రెయిన్ లో చోటు ఉండబోదు.

దాడికి ముందు అణ్వాయుధాల ప్రసక్తి లేదు. ఇప్పుడు ఆ ద్వారం పూర్తిగా మూసుకుపోయింది. చెర్నోబిల్ తో సహా ఇతర అణు విద్యుత్ కేంద్రాలను రష్యన్ సైన్యాలు కాపలా కాస్తున్నాయి.

ఇవన్నీ ఉక్రెయిన్ కు ప్రధానంగా అమెరికాకు ఆందోళన కారకాలే. రష్యాపై అమెరికా, ఈ‌యూ విధించిన ఆర్ధిక ఆంక్షలు క్రమ క్రమంగా తగ్గించుకోవలసిన అవసరం ఆ దేశాలకే వస్తుంది. ఆంక్షల ఉపసంహరణకు లేదా బలహీనపరిచేందుకు మొండిగా తిరస్కరిస్తే రష్యాతో పాటు ఈ‌యూ దేశాలు కూడా నష్టపోతాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s