రష్యాపై మోపేందుకు ఇక ఆంక్షలు మిగల్లేదు -ఈ‌యూ


EU foreign affairs Chief Joseph Borrell

రష్యా పైన అమెరికా ఎంత కక్ష గట్టిందంటే రష్యా పైన మోపేందుకు ఇక ఆంక్షలు ఏమీ యూరోపియన్ యూనియన్ వద్ద మిగలకుండా పోయేట్లు వత్తిడి తెచ్చేంతగా…!

యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాల విభాగాధిపతి జోసెఫ్ బొరెల్ ఈ మేరకు పత్రికలతో మాట్లాడుతూ స్వయంగా అంగీకరించాడు.

రష్యాపైన ఆర్ధిక ఆంక్షలు విధించే సామర్ధ్యం తమ వద్ద ఇంకిపోయిందని, ఇంతకు మించి ఆంక్షలు విధించడం తమవల్ల సాధ్యం కాదని బోరెల్ స్పష్టం చేశాడు. ఇప్పటికే రష్యా వ్యాపారాలు, మీడియా చానెళ్లు, వెబ్ పత్రికలు, ఆర్ధిక వ్యవస్థ, సంస్కృతి, వాణిజ్యం, సహజవాయువు పైప్ లైన్లు, సంపన్నులు (Oligarchs)… ఇంకా అనేక అంశాలపైనా, సరుకుల పైనా, వ్యక్తుల పైనా, కంపెనీల పైనా ఈ‌యూ, అమెరికాలు ఆంక్షలు విధించాయి.

అయినా అమెరికా కక్ష తీరలేదు. రష్యాపై పగ చల్లారలేదు. ఉక్రెయిన్ లో తాను అభివృద్ధి చేసిన బయో వెపన్ (జీవాయుధ) తయారీ ల్యాబొరేటరీల ఆచూకీ వెల్లడి చేయడం దగ్గరి నుండి, బిలియన్లు కుమ్మరించి పోషిస్తూ వచ్చిన నయా నాజీ గ్రూపులను నాశనం చెయ్యడం వరకు రష్యా చేస్తున్న ఏ పనీ అమెరికాకు నచ్చలేదు. ఎందుకంటే అవి అమెరికా గుట్టు మట్టులను బైయట పెట్టినవే మరి!

ఇప్పటిదాకా విధించిన ఆంక్షలన్నీ చాలక రష్యా నుండి దిగుమతి చేసుకునే చమురు ను కూడా బంద్ చేయాలని అమెరికా శాసించింది. రష్యన్ గ్యాస్ దిగుమతిని పూర్తిగా రద్దు చేసుకోవాలని ఆజ్ఞాపించింది. అందుకు ఈ‌యూ నిరాకరించింది.

జర్మనీ ఇప్పటికే నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ ను సర్టిఫై చేసే ప్రక్రియను నిలిపివేసింది లేదా సస్పెండ్ చేసింది. అంటే భవిష్యత్ లో సంబంధాలు మెరుగయ్యాక నార్డ్ స్ట్రీమ్ 2 కు ఆమోదం తెలిపే అవకాశాల్ని అట్టే పెట్టుకుంది. నార్డ్ స్ట్రీమ్ 1 ద్వారా ఇప్పటికీ రష్యన్ గ్యాస్ సరఫరా అవుతోంది. అలాగా ఉక్రెయిన్, పోలండ్ ల మీదుగా వెళ్ళే పైప్ లైన్ ల ద్వారా పాత కాంట్రాక్టుల ప్రకారం గ్యాస్ ఇంకా సరఫరా అవుతూనే ఉంది. ఇవి కూడా ఆపేసి యూరప్ దేశాలు చీకటిలో మగ్గాలని, చలికి చావాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.

చమురు, సహజవాయువు ఆంక్షలకు ఐరోపా దేశాలు అంగీకరించకపోవడంతో అమెరికా తానే ఒంటరిగా రష్యా చమురు దిగుమతిని రద్దు చేసుకుంది. ఫలితంగా చమురు, గ్యాస్ ధరలు కొండెక్కాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ధరల పెరుగుదల కట్టడి చేసేందుకు ఉత్పత్తి పెంచాలని అమెరికా సౌదీ నాయకత్వం లోని OPEC కూటమిని అడుగుతోంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చమురు ఉత్పత్తి పెంచాలని కొరేందుకు సౌదీ రాజు, యూ‌ఏ‌ఈ పాలకులతో మాట్లాడే ప్రయత్నాలు చేశాడు. కానీ వాళ్ళు బైడెన్ తో మాట్లాడేందుకు నిరాకరించారు.

చివరికి నిన్న మొన్నటివరకు తీవ్రమైన వెర్రి మొర్రి ఆంక్షలతో మరో చమురు సంపన్న దేశం వెనిజులా ను పరివిధాలా వేధించింది. ఇప్పుడు వెనిజులాకు ప్రతినిధుల్ని పంపి ఆ దేశ చమురుని అంతర్జాతీయ మార్కెట్ లో పెంచేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.

ఇరాన్ పైన అమెరికా, ఈ‌యూ లు దశాబ్దాలుగా విధిస్తున్న ఆంక్షల విషయం తెలిసిందే. ఇరాన్ అణు విధానం సాకుగా చూపిస్తూ ఇజ్రాయెల్ ను సంతృప్తి పరిచేందుకు ఇరాన్ చమురు వాణిజ్యానికి కొనుగోలుదారులు లేకుండా చేసింది. అమెరికా ఆంక్షల వల్లనే ఇండియా చౌక ధరకు లభించే ఇరాన్ చమురు కొనుగోలు బంద్ చేసుకుంది.

ఇప్పుడు రష్యా పై ఆంక్షలను విజయవంతం చేసుకునేందుకు ఇరాన్ చమురుని కూడా మార్కెట్ లో తెచ్చేందుకు అమెరికా చర్చలు మొదలు పెట్టింది. ఇరాన్ ‘ముందు ఆంక్షలు ఎత్తేయి, అప్పుడు చూద్దాం’ అంటోంది.

ఈ నేపధ్యంలో యూరోపియన్ యూనియన్ సైతం ‘ఇకపై ఆంక్షలు విధించేందుకు మా వద్ద అవకాశాలు లేవు’ అని ప్రకటించడం అమెరికాకు ప్రతికూలంగా మారింది. “ఆర్ధిక ఆంక్షల విషయానికి వస్తే, మరింత ముందుకు వెళ్ళేందుకు ఎప్పుడు అవకాశాలు ఉంటాయి. కానీ మేము చేయగలిగినదంతా ఇప్పటికే చేసేశాము. మా పరిమితులకు చేరుకున్నాం. ఇక చేసేదేమీ లేదు” అని ఈ‌యూ విదేశీ వ్యవహారాల చీఫ్ బోరెల్ ప్రకటించాడు.

“రష్యాతో యుద్ధానికి దిగడానికి మేము సిద్ధంగా లేము.ఎందుకంటే అది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుంది” అని ఆయన హెచ్చరించాడు. “అమెరికా చేసినట్లుగా చమురు దిగుమతి పైన ఆంక్షలు విధించలేము. ఎందుకంటే అమెరికాకి వెళ్ళే రష్యా చమురు చాలా తక్కువ. మా విషయం అలా కాదు” అని బోరెల్ స్పష్టం చేశాడు.

తమ చర్యల వల్ల రష్యన్ కరెన్సీ ఇప్పటికే 40 శాతం పడిపోయిందని అది చాలని బోరెల్ చెప్పాడు. 160 మంది రష్యన్లపై ఆంక్షలు విధించామని, అదనంగా క్రిప్టో అసెట్ పైనా ఆంక్షలు పెట్టామని చివరికి బెలా రూస్ బ్యాంకింగ్ రంగం పైన కూడా ఆంక్షలు విధించామని బోరెల్ గుర్తు చేశాడు.

One thought on “రష్యాపై మోపేందుకు ఇక ఆంక్షలు మిగల్లేదు -ఈ‌యూ

  1. మార్క్సిస్ట్‌లు ప్రభుత్వ ఉద్యోగం చెయ్యొచ్చా అనే దాని గురించి వ్యాసం వ్రాయండి. పల్లెటూరిలోని ప్రైవేట్ బస్ ఆపరేతర్ డ్రైవర్‌కి రోజుకి 200 వందలు ఇస్తాడు కానీ అతనికి నెలకి ఐదు వేలు లాభం కూడా రాదు. ఆర్.టి.సి. శ్రైవర్‌కి సీనియారిటీని బట్టి ఇరవై వేల నుంచి నలభై వేలు జీతం ఇస్తోంది, కండక్టర్‌కి కూడా అంతే జీతం. ఐదు వేలు రెమ్యూనరేటివ్ కూడా కాని సర్వీస్‌కి ప్రభుత్వం నలభై వేలుకి పైగా ఖర్చు పెడుతోందంటే దాని అర్థం ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ అప్పులతో నడుస్తోందనే కదా. విరసం సభ్యుల్లో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు, కొంత మంది జర్నలిస్టులు. వీళ్ళు మార్క్సిజం వదులుకోవడానికే ప్రభుత్వం దగ్గర పదిహేను లక్షల అవార్డులు తీసుకున్నవాళ్ళని మీటింగులకి పిలుస్తున్నారని నా అభిప్రాయం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s