
Bill Gates -AFP
అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి తెలియని వారు ఉండరు. గూగుల్, ఫేస్ బుక్ లాంటి కంపెనీలు వచ్చేవరకూ ప్రపంచ సాఫ్ట్ వేర్ సామ్రాజ్యానికి ఆయన మకుటం లేని మహారాజు. అనేక మూడో ప్రపంచ దేశాల రాజకీయ నాయకులు కూడా ఆయనతో స్టేజి పంచుకోవటానికి ఉబలాట పడేవారు.
కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రధాన ఉత్పత్తి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తనకు తెలిసింది తక్కువే అని ఆయన పలుమార్లు చెప్పుకున్నాడు. ఆరంభంలో విండోస్ డెవలప్^మెంట్ లో పాల్గొనడం తప్ప ఆ తర్వాత కాలంలో ఆయన పాల్గొనలేదని ఇతర కంపెనీ అధికారులు చెబుతుంటారు.
అయితే సార్స్-కోవ్-2 వైరస్ విస్తరణ మొదలై ప్రపంచం మొత్తం కోవిడ్ 19 వ్యాధి బారిన పడుతున్న నేపధ్యంలో వ్యాధి గురించి బిల్ గేట్స్ వ్యాఖ్యానాలు తరచూ వినబడుతున్నాయి. కోవిడ్ విస్తరించకుండా తీసుకోవలసిన జాగ్రత్తల దగ్గర నుండి, కోవిడ్ లాంటి వైరస్ ల శాశ్వత నిర్మూలనకు ప్రత్యేకమైన ఛిప్ ని అభివృద్ధి చేసి మానవ శరీరంలో అమర్చవలసిన అవసరం గురించి నొక్కి చెప్పడం వరకూ ఆయన వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా ప్రచురితం అవుతున్నాయి.
తాజాగా ఆయన ఒమిక్రాన్ రకం కోవిడ్ వైరస్ గురించీ, దానివల్ల కలిగే ప్రమాద తీవ్రత గురించీ, అలాగే వైరస్ భవిష్యత్ గురించీ కూడా వ్యాఖ్యానించి మరోసారి వార్తలకెక్కాడు. వరుస ట్వీట్లు చేస్తూ ఆయన ఒమిక్రాన్ రకం కోవిడ్ వైరస్ విస్తరించే కొద్దీ రానున్న కొద్ది నెలలు కష్టంగానూ, ప్రమాదకరంగానూ ఉండబోతున్నాయని ఆయన హెచ్చరించాడు.
అలాగే కోవిడ్ వైరస్ వ్యాప్తి 2022 సంవత్సరంలో ముగిసిపోతుందని ఆయన జోస్యం చెప్పాడు. వేగంగా వ్యాపించగలగడంలో ఒమిక్రాన్ కనబరుస్తున్న సామర్ధ్యం బట్టి చూస్తే తాజా కోవిడ్ వేవ్ మరో 3 నెలలు మాత్రమే కొనసాగుతుందని సైతం ఆయన ఊహించాడు. “మరి కొన్ని నెలలు కష్టమే, కానీ కోవిడ్ పాండమిక్ 2022 లోనే అంతం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను” అని ఆయన ట్వీట్ చేశాడు.
ఇలా ఒక ప్రమాదకర వైరస్ గురించి జోస్యం చెప్పేందుకు బిల్ గేట్స్ కు ఉన్న అర్హత ఏమిటి అన్నది అనేక మందిని తొలుస్తున్న ప్రశ్న. ఆయన ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీ సహ వ్యవస్ధాపకుడు గనక ఆ కంపెనీ గురించి జోస్యం చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే సాఫ్ట్ వేర్ రంగం భవిష్యత్ గురించి జోస్యం చెప్పవచ్చు, నమ్మేవాళ్లు ఉంటారు. మరింత ముందుకు పోయి, ఆయన ఒక వ్యాపారవేత్త కూడా కనుక, సాఫ్ట్ వేర్ వ్యాపార రంగం అభివృద్ధి, నిలకడతనం, స్తంభన లాంటి అంశాల పైన తీర్పులు ప్రకటించవచ్చు.
కానీ ఆయనకు ఏ మాత్రం సంబంధం లేని ఆరోగ్య రంగం గురించీ అందునా ఒక వైరస్ విస్తరణ గురించి, దాని నిర్మూలన గురించి, దాని భవిష్యత్ గురించి జోస్యం చెప్పగల అర్హత ఆయనకు ఎక్కడ నుండి వస్తుంది? ఆయనేమన్నా వైరాలజీ నిపుణుడా? ఎపిడెమాలజీలో ఆయనకు ప్రవేశం ఉన్నదా? జనానికి వైరస్ పాఠాలు చెప్పమని ఏ ప్రభుత్వం అయినా ఆయనను నియమించిందా?
కోవిడ్ 19 పై పోరాటానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ 1.75 బిలియన్ డాలర్లు కేటాయించిన మాట నిజమే. అలా చూసినా ఆ ఫౌండేషన్ లో పని చేసే వైరాలజీ నిపుణులో లేక ఎపిడెమాలజీ నిపుణులో వైరస్ గురించిన అధ్యయనాలు, వైరస్ వ్యాప్తి-విస్తృతిల గురించి చెప్పాలి గానీ సొమ్ము మాత్రమే సమకూర్చిన బిల్ గేట్స్ ఎలా చెప్పగలరు?
బిల్ గేట్స్, అమెరికా ఇమ్యునాలజిస్టు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డీసీజెస్ సంస్ధ డైరెక్టర్, అమెరికా అధ్యక్షుడికి మెడికల్ అడ్వైజర్ కూడా అయిన డాక్టర్ ఆంటోని ఫాచి తో చాలా తరచుగా సంప్రతింపులు చేస్తారట. తన ఫిలాంత్రొఫీ (దాన ధర్మాలు) కార్యకలాపాల ద్వారా బిల్ గేట్స్ కి పాండమిక్ నిర్మూలనలో ప్రవేశం, జ్ఞానం, అనుభవం ఉన్న గొప్ప శాస్త్రవేత్తలతో, వైద్యులతో మాట్లాడగల అవకాశం ఉన్నదట. అలాంటప్పుడు, ఆయన ఫలానా నిపుణుడు ఇలా చెప్పారు అని మాత్రమే ఆయన చెప్పగలడు గానీ ఆయనే వాళ్ళ తరపున వైరస్ వ్యాప్తి, నిర్మూలనల గురించి అంచనా వేయకూడదు కదా?
ఈ ప్రశ్నలు వేయడానికి ఒక కారణం ఉన్నది. అదేమిటంటే, కోవిడ్ వైరస్ మనిషి జోలికి రావడానికి చాలా ముందే (కనీసం ఒకటి రెండు సంవత్సరాల ముందే) “భవిష్యత్తులో రాబోయే ప్రపంచ ఆరోగ్య సంక్షోభానికి మానవ ప్రపంచం తగినంతగా సిద్ధపడి లేదు’ అని ప్రకటించాడు. ప్రకటించడమే కాకుండా ఎలా సిద్ధపడాలో ఒక వ్యూహాన్ని కూడా రచించి పెట్టాడాయన. సరిగ్గా కోవిడ్ బైటపడడానికి కొన్ని రోజుల ముందే ఒక శక్తివంతమైన వైరస్ వ్యాపించడం మొదలైతే ఎలా స్పందించాలి అన్న అంశంపై ఒక ‘మాక్ ఆపరేషన్’ కూడా నిర్వహించాడు. ఈ ఆపరేషన్ లో ఒక్క బిల్ గేట్స్ మాత్రమే కాకుండా ఇతర పెద్ద కంపెనీలు, వైద్య కంపెనీలు, బ్యాంకులు, నిపుణులు పాల్గొన్నారు.
సరిగ్గా ఈ ఆపరేషన్ లో సూచించినట్లుగానే కోవిడ్ వ్యాప్తి మొదలయ్యాక లాకౌట్ లు, ప్రయాణ నిబంధనలు, విమానాశ్రయాల్లో చెకింగ్ లు…. ఇలాంటివన్నీ జరిగాయి. సరిగ్గా బిల్ గేట్స్ తదితర బృందం ఏవైతే చర్యలు సూచించారో అవే చర్యలు కోవిడ్ నిర్మూలన కార్యక్రమంలో అమలు చేశాయి. వైరస్ పేరు, వ్యాధి పేరు కాస్త అటు ఇటుగా మాక్ ఆపరేషన్ లో పెట్టిన పేర్లను పోలి ఉన్నాయి.
ఈ వాస్తవాల వల్లనే బిల్ గేట్స్ జోస్యాల పైనా, ఆయన ఉద్దేశ్యాలపైనా అనేక ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి. వైరస్ నిర్మూలనకు ఆయన ఛిప్ ఇంప్లాంటేషన్ ను ప్రతిపాదించగా దానికి తగ్గట్లుగా వివిధ కంపెనీలు మానవ జన్యువులను ప్రభావితం చేసే జన్యు ఆధారిత వ్యాక్సిన్ లు, డిఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్ లు తయారు చేశాయి.
కనుక మరోసారి….. జన్యు ఆధారిత, డిఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్ లతో తస్మాత్ జాగ్రత్త!