లండన్ కు చెందిన వీధి చిత్రాల కళాకారుడు బ్రెగ్జిట్ పై తన కళాలోచనను తాజా వీధి చిత్రం ద్వారా పంచుకున్నాడు.
తన వీధి చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాపితంగా అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించినప్పటికీ తానెవరో ప్రపంచానికి తెలియనివ్వని బ్యాంక్సీ ఎక్కడ గోడపై ఒక గీత గీసిన సంచలనమే.
పశ్చిమ సామాజిక, సాంస్కృతిక విలువలపై విమర్శలతో ప్రారంభించి రాజకీయ విమర్శల వరకూ ప్రయాణించిన బ్యాంక్సీ వీధి చిత్రాలు సామాన్య ప్రజలకు కన్నుల పండుగ, అనామ్దాదాయకం కాగా ధనిక వర్గాలకు మాత్రం తీరని కోపం.
బ్యాంక్సీ (Banksy) ఆయన అసలు పేరు కాదు. అసలు పేరు ఏమిటో ఎవరికీ తెలియదు. ఆయన రూపు రేఖలూ ఎవరికీ తెలియవు. ఆరంభంలో బ్యాంక్సీని పట్టుకుని అరెస్టు చేయడానికి బ్రిటిష్ పోలీసులు విపరీతంగా శ్రమించి విఫలమయ్యారు. ఆయన చిత్రాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాక వారు తమ ప్రయత్నాలు ఆపేశారు. బిబిసి లాంటి సంస్ధలు బ్యాంక్సీ తమ వాడైనందుకు ఎంతో గర్విస్తాయి.
భారీ యూరోపియన్ యూనియన్ జెండాను దాని 12 నక్షత్రాలతో సహా చిత్రీకరించిన బ్యాంక్సీ ఓ కార్మికుడు ఒక నక్షత్రాన్ని జెండా నుండి చెక్కి తొలగిస్తున్నట్లుగా చూపాడు. కార్మికుడు నక్షత్రాన్ని చెక్కుతున్న చోటి నుండి మొదలైన పగుళ్లు జెండా అంతా విస్తరిస్తున్నట్లుగా బ్యాంక్సీ చిత్రీకరించాడు.
యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బైటికి రావడానికి బ్రిటన్ కార్మికులే ప్రధాన కర్తలని బ్యాంక్సీ చూపాడు. బ్రిటన్ ఎగ్జిట్ ద్వారా ప్రారంభమయిన యూరోపియన్ యూనియన్ విచ్ఛిన్నం ఇతర సభ్య దేశాలన్నింటికీ విస్తరిస్తున్నదని పగుళ్ళ ద్వారా ఆయన చూపాడు.
తాజా వీధి చిత్రాన్ని చిత్రీకరించిన డోవర్ నగరం ఫ్రాన్స్ కు అతి దగ్గరి చోటు. ఫ్రాన్స్ లోని కలయిస్ నగరం నుండి బ్రిటిష్ చానల్ ను దాటినవారు మొదట ఈ పోర్టు నగరానికే వస్తారు.
బ్యాంక్సీ గీసిన బ్రెగ్జిట్ చిత్రం అప్పుడే కాఫీ కప్పుల పైనా, డ్రాయింగ్ రూమ్ ల గోడల పైనా, టీషర్ట్ ల పైనా ప్రదర్శితం అవుతోంది. వాణిజ్య స్ధాయిలో పోస్టర్లుగా ముద్రితం అవుతున్నాయి.
బ్యాంక్సీ విద్వేషులు / బ్రెగ్జిట్ వ్యతిరేకులు బ్యాంక్సీ చిత్రం లోని కొద్ది భాగాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారు. చిత్రానికి కొద్ది నష్టం జరిగినప్పటికీ మొత్తంగా రూపు మారలేదు. విధ్వంసానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన కూడా జరిగిపోయింది.
poyyaavaa enti
kothai raayatlaa kottaaraa enti ilaiah ni kottinatlu