జనం సొమ్ము దాచి పెడతామని తీసుకునే బ్యాంకులు ఇప్పుడు ఆ సొమ్ములో సాధ్యమైనంత గరిష్ట భాగాన్ని సొంతం చేసుకునేందుకు సవాలక్ష నిబంధనలు విధిస్తున్నాయి. డీమానిటైజేషన్ తో మొదలైన మోడి గారి విశ్వరూపం మరింతగా విస్తరిస్తూ అచ్చే దిన్ అసలు అర్ధం ఏమిటో జనానికి విప్పి చెబుతోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘కనీస డిపాజిట్’ నిబంధనను సడలించవచ్చో లేదో కాస్త పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్రం కనుసన్నల్లో, అదుపాజ్ఞల్లో నడిచే ఎస్‌బిఐకి ఆ కేంద్రమే విజ్ఞప్తి చేయడం?!
ఎస్‌బిఐ విధించిన దుర్మార్గపూరిత నిబంధనలను విధించడంలో తమ పాత్ర ఏమీ లేదని ఈ విజ్ఞప్తి ద్వారా మోడి ప్రభుత్వం చెప్పదలిచింది. ఓ వైపు కొరడాలతో జనాన్ని బాది పడేస్తూ, వారి చెవుల్లో పూలు కూడా పెడుతోంది.
[లేపాక్షి గారు గీసిన ఈ కార్టూన్ ను ఫేస్ బుక్ లో ‘మా సిద్దిక్’ గారి వాల్ నుండి సంగ్రహించాను.]
బ్యాంకుల(అర్.బి.ఐ,పబ్లిక్ అండర్ టేకింగ్ బ్యాంకులు,ప్రైవేట్ బ్యాంకులు) సంస్కరణలు(నోట్ల రద్దు నుండి వారుతీసుకుంటున్న రకరకాల చర్యలు) – మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు అంశాలను మెజారిటీ ప్రజలు ఇప్పటీకీ వేరువేరుగా చూస్తున్నారు.
అన్నిటి కంటే విచారకరమైన అంశం ఏమిటంటే ప్రధాన స్రవంతి పత్రికలన్నీ మోదీనీ,బ్యాంకింగ్ చర్యలను వేరువేరుగా చూపుతున్నాయి. తెలిసీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.