ఇలాంటి వీడియో చూడటం నాకు ఇదే మొదటిసారి. ఫేస్ బుక్ గతంలో ఇలాంటివి అందించిందో లేదో నాకు తెలియదు. చూడగానే ఆకర్షించింది.
బహుశా ఇతర ఖాతాదారులకు కూడా ఇలాంటి వీడియోలు అందే ఉంటాయి.
ఫ్రెండ్స్’ లోగో / ఐకాన్ లతో, ట్రాన్స్ఫార్మర్స్ సినిమాలోని గ్రహాంతర రోబోట్ల తరహాలో, మనిషి ఆకారాన్ని తయారు చేసి వీడియోగా ప్రదర్శించడం… ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది.
ఖాతాదారుల భుజం తట్టి “భళిరా భడవా, భలే మిత్రుల్ని సంపాదించావ్” అని మెచ్చుకున్న ఫీలింగ్ ని కల్పిస్తున్న ఈ యానిమేషన్ వీడియో ఐడియా ఎవరిదో గానీ వారిని మెచ్చుకుని తీరాలి.
ఇలాంటి మెచ్చుకోళ్ళతో ఖాతాదారుల్ని సంతృప్తిపరిచి సంపాదిస్తున్న వారి సొంత, ప్రైవేట్ సమాచారంతో బిలియన్లు గడిస్తున్న ఫేస్ బుక్ పొదిలో ఇలాంటి అమ్ములు ఇంకెన్ని ఉన్నాయో?!