ప్రపంచ కాబూలీవాలా కూడా ఒప్పేసుకున్నాడు. డీమానిటైజేషన్ వల్ల ఇండియా జిడిపి వృద్ధి రేటు అంచనాను ఐఎంఎఫ్ కూడా తగ్గించేసుకుంది. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో భారత్ జిడిపి 7.6 శాతం వృద్ధి చెందుతుందని గతంలో అంచనా వేసిన ఐఎంఎఫ్ ఇప్పుడు దాన్ని 6.6 శాతానికి తగ్గించుకుంది.
“ఇండియాలో ప్రస్తుత సంవత్సరానికి (2016-17) మరియు ఆ తర్వాత సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను వరుసగా 1 శాతం మరియు 0.4 శాతం మేరకు తగ్గిస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఇటీవల ప్రవేశపెట్టిన (పెద్ద) కరెన్సీ నోట్ల ఉపసంహరణ మరియు (నగదు రహిత) మారకం వైపుగా తీసుకున్న చొరవ. వీటి వల్ల వినియోగంలో ప్రతికూల (నెగిటివ్) షాక్ చొప్పించబడింది. చెల్లింపుల్లో ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి”
అని ఐఎంఎఫ్ ప్రచురించిన “వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్” నివేదిక పేర్కొంది.
ఆ విధంగా “ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధలలో ఒకటి గా మన దేశం ప్రసిద్ధి చెందింది” అని ఇన్నాళ్లూ దేనినైతే ప్రధాని మోడి పదే పదే చెప్పుకుని సంతోషపడుతూ, మనల్నీ సంతోషపడమన్నారో ఆ గొప్ప కిరీటాన్ని దభెల్ మని తానే కిందకు విసిరి కొట్టారు.
ఇండియా వృద్ధి 6.6% నమోదు కావటం అంటే అది చైనా (6.7%) తక్కువ వేగంగా వృద్ధి చెందినట్లే. “చైనా కంటే కూడా మనమే వేగంగా వృద్ధి సాధిస్తున్నాం. ప్రపంచం అంతా దీనిని అంగీకరిస్తోంది” అని కూడా ప్రధాని మోడి అనేకసార్లు…
అసలు టపాను చూడండి 378 more words