సంవత్సర కాలం లోనే చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇండియాను తమ ఫోన్లతో నింపేసాయి. 2015 లో ఇండియాలో ప్రవేశించిన పలు చైనా కంపెనీలు సంవత్సర కాలం లోనే అత్యంత వేగంగా తమ ఉత్పత్తుల అమ్మకాన్ని పెంచుకోగలిగాయి. 2016 సంవత్సరంలో ఇండియాలో అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లలో సగానికి పైగా చైనా కంపెనీలు ఉత్పత్తి చేసినవేనని వాణిజ్య వార్త సంస్ధ రాయిటర్స్ తెలిపింది.
తమ ఉత్పత్తుల మార్కెటింగ్ లో ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించడం చైనా కంపెనీలు విజయవంతం కావడానికి ఒక కారణం. బాలీవుడ్ సినిమాలతోనూ, క్రికెట్ ఆటతోనూ భారతీయులు తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారన్న సంగతిని చైనా కంపెనీలు సరిగానే పసిగట్టాయి. బాలీవుడ్ స్టార్లను, క్రికెట్ ఆటగాళ్లనే తమ ప్రచారానికి వినియోగించాయి. దూకుడుతో కూడిన ప్రచారం ద్వారా అత్యంత స్వల్ప కాలం లోనే మార్కెట్ లో దూసుకు వెళ్లాయి.
ఇండియాలో అమ్ముడు అయిన ప్రతి రెండు స్మార్ట్ ఫోన్లలో ఒకటి చైనా కంపెనీదని రాయిటర్స్ తెలిపింది. చైనా కంపెనీల వల్ల ప్రధానంగా నష్టపోయింది దక్షిణ కొరియాకు చెందిన సామ్ సంగ్. ఒకప్పుడు ఇండియాలో స్మార్ట్ ఫోన్ అంటే సామ్ సంగ్ ఫోన్లు మాత్రమే. తక్కువ ఖరీదు ఫోన్లకు నోకియా ప్రసిద్ధి చెందగా, హై ఎండ్ స్మార్ట్ ఫోన్లకు సామ్ సంగ్ పేరు గడించింది. ఐఫోన్ల వాటాల చాలా తక్కువ.
మైక్రో సాఫ్ట్ అధీనం లోకి వెళ్లిన తర్వాత నోకియా కూడా స్మార్ట్ ఫోన్లను విడుదల చేసినప్పటికీ సామ్ సంగ్ అంతగా సక్సెస్ కాలేదు. 2015 సంవత్సరంలో ఒక్క సామ్ సంగ్ కంపెనీయే 30 శాతం స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ను నియంత్రించింది. మధ్య స్ధాయి నుండి అత్యధిక ఖరీదు ఫోన్ల వరకు అనేక మోడళ్ళు విడుదల చేయడం ద్వారా సామ్ సంగ్ ఈ ఫీట్ సాధించింది.
2015 వరకు ఒక్క లెనోవో కంపెనీ మాత్రమే చైనా కంపెనీగా కాస్త గౌరవ స్ధానంలో ఉండేది. అప్పటి వరకు చైనా ఫోన్ అంటే చవక ఫోన్లు అనే ప్రచారం ఉండేది. సాంకేతికంగా తక్కువ రకానికి చెందిన ఫోన్లనీ, ఎక్కువ కాలం పని చేయవని, నాసిరకం ప్రమాణాలు కలిగినవనీ చైనా ఫోన్లకు పేరు ఉండేది. చైనా ఫోన్ అంటేనే ఒక రకమైన తేలిక భావన కలిగేది.
వన్ ప్లస్, జియోనీ, ఒప్పో, లీ ఎకో తదితర కంపెనీల ప్రవేశంతో పరిస్ధితి పూర్తిగా తలకిందులు అయింది. సరసమైన ధరలకు అత్యున్నత స్ధాయి ఫీచర్స్ కలిగిన ఫోన్లు విడుదల చేయడమే చైనా ఫోన్ల విజయానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ‘ఫ్లాగ్ షిప్ కిల్లర్’ నినాదంతో వన్ ప్లస్, ‘సూపర్ ఫోన్’ నినాదంతో లీ ఎకో, ‘సెల్ఫీ స్పెషలిస్ట్’ జియోనీ… ఇలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఆకర్షక నినాదాన్ని ప్రవేశపెట్టి కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించాయి. తమ నినాదాలకు తగ్గ క్వాలిటీతో స్మార్ట్ ఫోన్లు విడుదల చేయడం ద్వారా కొనుగోలుదారుల నమ్మకాన్ని చూరగొన్నాయి.
3 గిగా బైట్ ర్యామ్ మెమొరీ ని మొదట ప్రవేశపెట్టింది చైనా కంపెనీలే. ఆ తర్వాత ఒకదానితో ఒకటి పోటీపడుతూ 6 గిగా బైట్ మెమొరీతో కూడా ఫోన్లు విడుదల చేశాయి. తద్వారా ఫోన్ల స్పీడ్ ను గ్యారంటీ చేశాయి. మంచి కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ అంటే వినియోగదారులు ఇట్టే ఇష్టపడతారు. ఓ వైపు సామ్ సంగ్ 5 పిక్సెల్ నుండి 13 పిక్సెల్ వరకు గల కెమెరాలతోనే అధిక ధరలతో ఫోన్లు విడుదల చేయగా చైనా కంపెనీలు ఆరంభ ఫోన్ కె 8 నుండి 13 పిక్సెల్ వరకు కెమెరాలు అందించాయి.
సామ్ సంగ్ కంపెనీ అందజేసిన మధ్య స్ధాయి ఫోన్ల ధరలకే ఉన్నత స్ధాయి ఫీచర్లు కలిగిన ఫోన్లను అందుబాటులోకి తేవడం ద్వారా చైనా కంపెనీలు వేగంగా కొనుగోలుదారులను బుట్టలో వేసుకున్నాయి. లీ ఎకో, వన్ ప్లస్, జియోనీ కంపెనీలు 21 పిక్సెల్ వరకు కెమెరాలు అందజేసి ధరలను మాత్రం మధ్య స్ధాయిలోనే ఉంచగలిగాయి. ఫ్రంట్ కెమెరా లను కూడా గరిష్ట పిక్సెల్ తో విడుదల చేసి ‘సెల్ఫీ స్పెషలిస్టు’ నినాదంతో గణనీయ మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నాయి. తద్వారా ప్రధాని మోడీ ద్వారా విస్తృతంగా వాడుకలోకి వచ్చిన సెల్ఫీ కల్చర్ ను సైతం అవి సొమ్ము చేసుకున్నాయి.
“చైనా బ్రాండ్ కంపెనీలు మెరుగైన టెక్నలాజిని, క్వాలిటీని సామ్ సంగ్ తో సమానంగా అందిస్తున్నాయి. అదే సమయంలో సామ్ సంగ్ ధరల కంటే సగానికి అందుబాటులో తెచ్చాయి. నేను అమ్మే ప్రతి 10 ఫోన్లలో 6 నుండి 7 వరకు చైనా బ్రాండ్ ఫోన్లే” అని ఒక ముంబై వ్యాపారి చెప్పారని రాయిటర్స్ తెలిపింది. హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ లాంటి పాపులర్ బాలీవుడ్ హీరోలతో ప్రకటనల ప్రచారం చేయించడంతో పాటు, IPL టోర్నమెంటులను స్పాన్సర్ చేయడం ద్వారా భారతీయుల హృదయ స్పందనలను చైనా కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకోగలిగాయి.
“ఇండియాలో రెండే రెండు మతాలు ఉన్నాయి. ఒకటి బాలీ వుడ్, రెండు క్రికెట్” అని జొయోని కంపెనీ అధిపతి వ్యాఖ్యానించడం బట్టి చైనా కంపెనీయుల మార్కెటింగ్ వ్యూహాన్ని అర్ధం చేసుకోవచ్చు.
120 డాలర్ల నుండి 440 డాలర్ల వరకు ఖరీదు చేసే స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో చైనా కంపెనీల 68 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నాయని రాయిటర్స్ తెలిపింది. అదే సమయంలో సామ్ సంగ్ తన మార్కెట్ ను 14 శాతం కోల్పోయిందని కౌంటర్ పాయింట్ పత్రిక తెలిపింది. ప్రపంచ స్ధాయి కంపెనీ కావడమే సామ్ సంగ్ కంపెనీకి శాపం అయిందనీ దాని వల్ల చైనా కంపెనీల ధరలతో పోటీ పడలేని పరిస్ధితి కంపెనీకి ఏర్పడిందని కొందరు విశ్లేషకులు సామ్ సంగ్ పరిస్ధితిని విశ్లేషిస్తున్నారు.
చైనా అంటేనే విరుచుకు పడే హిందుత్వ పార్టీ ఏలుబడిలోనే చైనా కంపెనీలు ఇండియా మార్కెట్ ను కైవశం చేసుకోవడం ఎలా సాధ్యపడిందో మోడీ/హిందుత్వ భక్తులు ఆలోచించాల్సి ఉన్నది. వ్యాపారంలో ఆ తేడాలు ఉండవు అన్నది సమాధానం అయితే అది పాకిస్తాన్ కు కూడా వర్తించాలి. అదే విధంగా అదే సమాధానం కాంగ్రెస్ ఏలుబడికి కూడా వర్తించాలి.
అలా కాదు, తాము చేస్తే శృంగారం ఇతరులు చేస్తే వ్యభిచారం అనే పనైతే ఇక చెప్పేదేముంటుంది! అదేదో జనమే తేల్చుకుంటారు.
ఇలాంటి సన్నాసులకు ఎమైనా కొట్ల ఆస్తులు వుంటాయా అంటే అవేమీ వుండవు. వాళ్ళకు నచ్చని విషయాలు వ్యెతిరేకించడానికి. కొట్ల రూపాయలు ఒక పార్టీ అండతొ దొచుకుని ఆ పార్టీ ఓడిన వెంటనే పక్కపార్టీలొకి వెళ్ళిపొతారు. అలాంటి వాళ్ళకు పార్టీ అభిమానమూ కులాభిమానమూ ఏమీ వుండవు. అవసరాలే వాళ్ళను నడిపిస్తాయి . ఇలాంటి కామెంట్లు రాసే యదవలకి రొజూ గొడ్డు చాకిరీ చేస్తే గానీ పూట గడవదు. పార్టీ అభిమానమూ కులాభిమానమూ మెండుగా వుంటాయి.
Hi Ramamohan, Actually I didn’t read this comment before publishing it. WordPress allows bloggers to publish the comment through a notification, where we may not actually read it.
I noticed the content of this comment only after several hours. By then, it was too late to trash the comment. So I kept it. I will be more careful in future while publishing comments.
Anyway, thanks for your support. These people lack even self respect. They can’t tolerate opposite view, the very essence of a democratic society. Sadly, these very people happen to preach about respecting ‘Bharat mata’ while they themselves abuse mothers of fellow beings. We can only pity them.