డీమానిటైజేషన్ / పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర మంత్రులు ఇప్పటి వరకు చెప్పారు. జిడిపి మహా అయితే అర శాతం లేకుంటే అంతకంటే తక్కువ మాత్రమే తగ్గుతుందని ఆర్ధిక మంత్రి జైట్లీ నమ్మబలికారు. ప్రతిపక్షాలు, బిజేపి వ్యతిరేక ఆర్ధికవేత్తలు చెబుతున్నట్లు ఉత్పత్తి భారీగా పడిపోదని హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంచనా వేసినట్లు 2% పతనం కావడం జరగనే జరగదన్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వ అధికారుల మాట ఇప్పుడు అందుకు విరుద్ధంగా ధ్వనిస్తున్నది. లేదా కేంద్ర మంత్రులే (ప్రధాని, ఆర్ధిక మంత్రి మొ.వారు) అధికారుల ద్వారా చిన్నగా ఉప్పు అందిస్తున్నారు. నిన్నటి దాకా “అబ్బే, తగ్గే సమస్యే లేదు” అని ఠలాయించిన జైట్లీ ఇప్పుడు హఠాత్తుగా “ప్చ్! తగ్గుతుంది” అని చెబితే విపక్షాలకు ఆయన విందు భోజనం అవుతారు. పత్రికలకు ‘పుల్కాలో చికెన్’ అయిపోతారు. అందుకని చిన్నగా అధికారుల చేత చెప్పించి చిన్న జిడిపి అంకెకు ఇప్పటి నుండే పత్రికలను, విశ్లేషకులను, కాస్తో కూస్తో పట్టించుకునే జనాన్ని అలవాటు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.
రాయిటర్స్ వార్తా సంస్ధతో పేరు చెప్పకుండా మాట్లాడినా ప్రభుత్వ అధికారుల ప్రకారం 2016-17 ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4 – జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో భారత దేశ జిడిపి 4 శాతానికి పడిపోతుంది. మొదటి త్రైమాసికంలో వార్షిక వృద్ధి రేటు 7.1 శాతం నమోదు కాగా, రెండవ త్రైమాసికంలో వార్షిక…
అసలు టపాను చూడండి 434 more words
http://epaper.andhrajyothy.com/c/15918580
పాపులిస్టు చర్యలు ఆంటే ఏమిటి?