నోట్ల రద్దు: సేవలు, తయారీల జీడీపీ పతనం


ద్రవ్య రాజకీయాలు

డీమానిటైజేషన్ ప్రభావం డిసెంబర్ నెల జీడీపీ పైన కూడా తీవ్రంగా పడిందని నిక్కీ PMI సూచిక తెలియజేస్తున్నది. తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్) తో పాటు సేవల రంగం కూడా భారీగా పతనం అయిందని నిక్కీ PMI సూచిక ద్వారా తెలుస్తున్నది. 

PMI అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని అర్ధం. ఆర్ధిక సర్వే సంస్ధలు ఆయా ఉత్పత్తి రంగాల లోని కంపెనీల మేనేజర్లను సర్వే చేసి సదరు రంగాల ఉత్పత్తి పనితనాన్ని అంచనాల రూపంలో సేకరిస్తాయి. సర్వే వివరాల ద్వారా PMI స్ధాయిని లెక్క కడతాయి. కంపెనీలనే నేరుగా సంప్రదించి సేకరించిన వివరాలు కనుక ఈ సూచిక అంచనాలు, అధికారిక ఫలితాల ప్రకటనతో దాదాపు సరిపోలుతాయి. అందువలన ఆర్ధిక సర్వే సంస్ధల PMI లను ఆర్ధిక విశ్లేషకులు, మార్కెట్ పండితులు, ప్రభుత్వ అధికారులు విశ్వాసం లోకి తీసుకుంటారు. 

PMI సూచిక 50 పాయింట్ల వద్ద భిన్న ధోరణులను ప్రతిబింబిస్తుంది. 50 పాయింట్లకు తక్కువ నమోదు అయితే ఆ రంగంలో జీడీపీ వృద్ధి (growth) లేదా విస్తరణ (expansion) చెందడానికి బదులు కుచించుకున్నదని (contraction) అర్ధం. 50 పాయింట్లకు ఎక్కువగా PMI నమోదైతే ఆ రంగం వృద్ధి చెందిందని లేదా విస్తరించిందని అర్ధం. 

డిసెంబర్ నెలకు గాను భారత సేవల రంగం యొక్క PMI, 46.8 పాయింట్లుగా నమోదు అయిందని నిక్కీ తెలియజేసింది. నవంబర్ నెలలో సేవల రంగం PMI , 46.7 గా…

అసలు టపాను చూడండి 407 more words

వ్యాఖ్యానించండి