రచన: డా. రమణ యడవల్లి (ఫేస్ బుక్ నుండి)
*********
“ఏవిఁటీ! దేశప్రజలందరికీ ఒక్కరోజులో ఈత నేర్పేశారా! యెలా సాధ్యం?”
“సింపుల్! రాత్రికిరాత్రే ఒక్కసారిగా ప్రజల్ని నీళ్ళల్లోకి తోసేశాం.”
“వామ్మో!”
“సరీగ్గా వాళ్ళూ ఇలాగే ఆర్తనాదాలు చేశారు.”
“తర్వాత?”
“వారిలో కొందరు ప్రాణభయంతో కాళ్ళూచేతుల్ని తపతపలాడిస్తూ ఈత నేర్చేసుకున్నారు.”
“మిగిలివాళ్ళు?”
“వాళ్ళు సోమరులు, నీళ్ళల్లో మునిగి చచ్చారు.”
“ఈత నేర్పే పద్ధతి ఇది కాదేమో!”
“ప్రజలకి మంచి చెయ్యాలనే మా స్పూర్తిని నువ్వు అభినందించాలి!”
“కానీ బలహీనులు రక్షింపబడాలి కదా!”
“తప్పదు, సంస్కరణలు శరవేగంగా అమలవ్వాలంటే బలహీనుల బలిదానం తప్పదు.”
రమణ యడవల్లి గారు యానాటి కాదు
అవును కదా. ఇప్పుడు సవరించాను. మీకు ధ్యాంక్స్, డా. రమణ గారికి సారీ.
నాకు ఒక ధాన్యం సాహుకారు నెఫ్ట్ ద్వారా పంపిన డబ్బులు రెండుసార్లు అతనికే రిటర్న్ అయ్యాయి. సర్వర్‌ల సామర్థ్యం పెంచకుండా ఎన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్‌లైనా చెయ్యగలగడం జరిగితే అది కాశీమజిలీ కథల్లోనే సాధ్యం.