రాజు వెడలె రవి తేజము లలరగ… -కార్టూన్


naidu-u-turn

డీమానిటైజేషన్ ప్రకటించినప్పుడు ‘ఆహా… ఒహో…’ అన్న వారంతా ఇప్పుడు వెనక్కి మళ్లుతున్నారు. U టర్న్ తీసుకుంటున్నారు.

“బ్లాక్ మనీపై పోరాటం మంచిదే” అని నితీశ్ కుమార్ అప్పుడు తొందరపడి ఆమోదించేశారు. ఇప్పుడు “డిసెంబర్ 30 వరకూ చూసి, పరిస్ధితి సమీక్షించి నా అవగాహన చెబుతాను” అంటున్నారు.

“నిర్ణయం, ఉద్దేశం మంచిదే, కానీ అమలు తీరు బాగోలేదు” అని సి‌పి‌ఐ నేతలు నీళ్ళు నమిలారు. ఇప్పుడు “పేదలకు, కార్మికుల జీవితాలు నాశనం చేశారు” అంటున్నారు.
“ఇది చేయమని ఎప్పటి నుండో చెబుతున్నా. ఇప్పటికైనా నా మాట విన్నారు. సంతోషం” అని అప్పుడు చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని తన సొంతం చేసేసుకున్నారు అప్పుడు. “మంచి జరుగుతుంది అనుకున్నాను. కానీ ఇన్ని రోజులు కష్ట పెడుతుంది అనుకోలేదు. ఏమైనా తొందర పడ్డారు. ప్లాన్ చేసుకోవలసింది” అంటున్నారిప్పుడు.

జనం విదిలింపులు, చీదరింపులు, ఆర్ధికవేత్తల వెక్కిరింపులు… ఇక వినలేక ఒక్కొక్కరుగా మోడీకి దూరం అవుతున్నట్లు కనిపిస్తున్నది. అసలు బి‌జే‌పి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకే మోడి నిర్ణయం నచ్చలేదని, అమిత్ షా వారిని గద్దించి నోరు మూపించాడని పత్రికలు ఘోషిస్తున్నాయి.

డిసెంబర్ 28 తేదీన బ్యాంకు కార్మిక సంఘాలు, అధికారుల సంఘాలు నిరసన చేయనున్నట్లు ప్రకటించాయి. జనవరి 2, 3 తేదీలలో కూడా ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపాయి.

బ్యాంకులు, ఏ‌టి‌ఎం ల ముందు క్యూలు మళ్ళీ పెరుగుతున్నాయి. “ఈ పరిస్ధితి ఎప్పుడు సద్దుమణుగుతుందో అప్పుడే చెప్పలేను” అని ఎస్‌బి‌ఐ ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య ప్రకటించారు. తద్వారా ఆమె చేతులెత్తేశారు.

మొన్నటిదాకా బ్యాంకుల్లోకి పాత, రద్దయిన నోట్లు ఎంత మేరకు డిపాజిట్ అయిందో చెబుతూ వచ్చిన, ఆర్‌బి‌ఐ, కేంద్రం ఇప్పుడు చెప్పడం మానేశాయి.

“డబుల్ కౌంట్ జరిగింది. అందుకే చెప్పడం లేదు” అని ఆర్ధిక మంత్రి జైట్లీ చెప్పేశారు.

ఆర్‌బి‌ఐ మాత్రం “డబుల్ కౌంట్ జరిగే అవకాశమే లేదు. మేము చెప్పేది బ్యాంకుల వద్దకు వస్తున్న నోట్ల లెక్క కాదు. కరెన్సీ చెస్ట్ లకు వస్తున్న నోట్ల లెక్క. కనుక డబుల్ కౌంట్ ప్రశ్నే తలెత్తదు” అని స్పష్టం చేసింది.

అప్పుడే ఏమయింది. ముందుండి ముసళ్ళ పండగ!

4 thoughts on “రాజు వెడలె రవి తేజము లలరగ… -కార్టూన్

  1. సర్,మీరు ప్రచురించిన కార్టూన్లో పి.యం & సి.యం లు వేసుకున్న చొక్కాలకు రంగులు లేవు,కానీ హిందూ పత్రికలో రంగులు ఉన్నాయి గమనించగలరు!

  2. కరెన్సీ చెస్ట్ లు అంటే ఏంటి? బ్యాంకుల వద్దకు వచ్చే నోట్ల లెక్కకు కరెన్సీ చెస్ట్ లకు వచ్చే నోట్ల లెక్కకు తేడా ఏంటి?

  3. ఆర్బీఐ నుండి కరెన్సీ మొదట చెస్ట్‌ లకి వస్తాయి. అక్కడ నుండి బ్యాంకులు తెచ్చుకుంటాయి. ఇవి ఎంపిక చేసిన సెంటర్ లలో ఉంటాయి. అది ఒక బ్యాంకుకు చెందిన పెద్ద బ్రాంచి కావచ్చు. కొన్ని బ్యాంకులు ఉమ్మడిగా నిర్వహించే పెద్ద సేఫ్ కావచ్చు. ఆర్బీఐ స్వయంగా నిర్వహించే కార్యాలయం కావచ్చు.

    రద్దు అయిన నోట్లు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల వద్దకు వచ్చాయి. అక్కడి నుంచి ఛెస్ట్ లకి చేరాయి. బంకులు, ఇతర చోట్ల నుంచి బ్యాంకులకూ అక్కడ నుంచి ఛెస్ట్ లకి చేరాయి. అన్ని కలెక్షన్ పాయింట్లకీ ఛెస్ట్ లు అంతిమ గమ్యం. ఆర్బీఐ ఇక్కడే నోట్లు లెక్కబెట్టింది. కాబట్టి డబుల్ కౌంటింగ్ కి అవకాశం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s