విదేశీ టూరిస్టులకు డీమానిటైజేషన్ శరాఘాతం అయింది. ముఖ్యంగా నోట్ల రద్దు ప్రకటించిన రోజుకు అటూ ఇటూ రోజుల్లో ఇండియాలో చారిత్రక స్ధలాలు చూద్దామని వచ్చిన టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చేతిలో ఉన్న 500, 1000 నోట్లు చిత్తు కాగితాలు అయ్యాయి. బ్యాంకులో మార్చుకోవడానికేమో వారి వద్ద ఆధార్ లాంటి భారతీయ గుర్తింపు కార్డులు లేవు. ఉన్న చిల్లర డబ్బులతో (100, 50, 10 మొ.నవి) జరిగినంత కాలం గడిపారు. ఇక జరగడం ఆగిపోయాక ఎటూ పాలుపోక అడుక్కోవడం ప్రారంభించారు.
కింది వీడియోలో ఉన్న టూరిస్టులు ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్ దేశాల నుండి రాజస్ధాన్ లో పుష్కర్ పట్టణంలో పండగ (పుష్కర్ ఫెయిర్) చూద్దామని వచ్చారు. సరిగ్గా డీమానిటైజేషన్ ప్రకటించిన రోజునే ఇండియా వచ్చారు. ఏమి జరుగుతున్నదో తెలియకపోవడంతో అప్పటికే తమ కరెన్సీని ఇండియన్ నోట్లలోకి మార్చుకున్నారు.
కానీ పుష్కర్ వచ్చాక గాని వారికి డీమానిటైజేషన్ గురించి తెలియలేదు. ATM లలో డ్రా చేద్దామంటేనేమో అక్కడ ‘నో క్యాష్’ బోర్డ్ రోజుల తరబడి వెక్కిరించింది. లాడ్జిలో ఉండేందుకు కూడా డబ్బు లేదు. తమ ఎంబసీలను సహాయం కోరడానికి ఢిల్లీ వెళదామన్నా డబ్బు లేదు.
ఇక చేసేది లేక రోడ్ల పైన తమకు తెలిసిన విద్యలను ప్రదర్శించడం ప్రారంభించారు. గిటార్ ఉన్న వాళ్ళు వాటిని ప్లే చేయడం ప్రారంభించారు. ఓ అమ్మాయి దగ్గర పెద్ద రింగు ఉంటే దానిని నడుముకు తగిలించుకుని ఊగుతూ నాట్యం చేయడం ప్రారంభించింది.
“You can help us” అనీ, “Money problem” అనీ కార్డ్ బోర్డ్ అట్టలపైన రాసి ప్రదర్శించడంతో జనానికి కాస్త అర్ధమై పదీ, పరకా వేయడం మొదలు పెట్టారు. abplive చానెల్ ఈ దృశ్యాన్ని చిత్రీకరించి ప్రసారం చేసింది. మీరూ చూడండి.
ఈ ఘటన నవంబర్ 28 తేదీన పుష్కర్ లో జరిగింది. ఆ తర్వాత వారు ఢిల్లీ చేరిందీ లేనిదీ మాత్రం తెలియలేదు. విదేశీ ఎంబసీలు కూడా డీమానిటైజేషన్ వల్ల తమ సిబ్బందికే వేతనాలు చెల్లించలేని ఇబ్బందుల్లో పడిపోయాయి. ఇక అవి తమ టూరిస్టుల కష్టాలు ఎలా తీర్చి ఉంటాయో మరి!
nuvvu koodaa vaallatho jeru poi
mallee enti free gaa open chgesaav boothulu kaavalaa
మళ్ళీ ఓపెన్ చేయడం ఏంట్రా అంట్ల వెధవా? చూడబోతే కొత్త బిచ్చగాడల్లే ఉన్నావ్. నీకు ముందు బూతు వెధవలకు ఇచ్చిన ట్రీట్ మెంట్ తెలియదా ముష్టి వెధవా! తెలియకపోతే ఆ వెధవల్ని అడిగి కనుక్కో, సన్నాసీ.
అవునూ, బూతులు రాయటం ఏమన్నా బ్రహ్మ విద్యా అనుకున్నావుట్రా కుంకా. ఏ గల్లీ కెళ్ళినా వాటిని వినొచ్చు. పోటీ కావాలంటే అక్కడికెళ్లి ట్రై చెయ్యి.
మళ్ళీ ఇటేపు వచ్చావంటే పోలీసులు నీ ఇంటికొస్తారు. పేస్ బుక్ లో మహిళల మీద కూసినోళ్ళ ఇంటికి వచ్చారే, అలాగ!
సంస్కారం లేని వెధవా! ఇప్పుడన్నా మీ అమ్మా నాన్నల్ని అడిగి కాస్త నేర్చుకుని తగలడు.
పేరు రాసుకునే దమ్ము లేదు గానీ, బూతు కూస్తాడంట అదేదో గొప్ప అయినట్లు! అంట్ల, ముష్టి, వెధవ, సన్నాసి.