“50 రోజులు ఆగితే అంతా సర్దుకుంటుంది” అని ప్రధాని మోడీ చెబుతూ వచ్చారు. మొన్న సుప్రీం కోర్టులో కూడా “మరో 15 రోజుల్లో కరెన్సీ పరిస్దితి పూర్తిగా మెరుగు పడుతుంది” అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీం ధర్మాసనానికి హామీ ఇచ్చారు. కానీ అదే రోహత్గి మరుసటి రోజే మాట మార్చేశారు.
“70 రోజుల వరకు ప్రజలు సహనం పాటించాలి. అసౌకర్యాన్ని భరించాలి. ఎందుకంటే 70 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం నల్ల ధనం, అవినీతిలపై ‘విప్లవం’ ప్రకటించింది. ప్రజలు 70 రోజులైనా ఓపిక పట్టాలి” అని రోహత్గి కోర్టు వేదికగా జనానికి గీతోపదేశం చేసారు.
దీనెమ్మ సహనం! సహనం అంటే, ముఖ్యంగా ప్రజల సహనం అంటే ఎంత లోకువ అయిపొయింది?! ఎంత చీప్ అయిపోయింది?! ప్రతి తలకు మాసిన వెధవా జనం సహనానికి రూల్స్ విధించేవాడే! సహనానికే గనక మాటలు వస్తే, సహనానికే గనక చేతలు వస్తే ఈ పాటికి ఈ వెధవల్ని అందరిని ఉప్పు పాతరేసి ఉండేది.
జనం సహనాన్ని బలి కోరేముందు తమకు సహనం ఉందో లేదో ప్రధాని, మంత్రులు, సలహాదారులు మొదట పరీక్షించుకోవాలి. ఎంత సహనం ఉంటె హడావుడిగా, ఎలాంటి ఏర్పాట్లు లేకుండా, ఎలాంటి అధ్యయనం లేకుండా 86 శాతం నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేసేసారు? ప్రముఖ ఆర్ధిక వేత్త అరుణ్ చెప్పినట్లు మానవ దేహానికి రక్తం ఎలాంటిదో ఆర్ధిక వ్యవస్ధకు కరెన్సీ అలాంటిది. 86 శాతం రక్తం తొలగించి కొత్త రక్తాన్ని కొద్ది కొద్దిగా ఎక్కిస్తానంటే శరీరం బ్రతుకుతుందా? వ్యవస్ధ నుండి అంత మొత్తంలో డబ్బుని వెనక్కి తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు తదనంతర పరిణామాలను ఎంత సహనంతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది?
అంత సహనాన్ని ప్రధాని మోడీ, జైట్లీ, వారి సలహాదారులు ప్రదర్శించి ఉంటే ఈ రోజు జనానికి ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవా? ఆర్ధిక వ్యవస్ధకు ఇంత నష్టం జరిగి ఉండేదా? కార్పొరేట్ల ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మీరు నిర్ణయాలు తీసేసుకుని దానికి జనం సహనం పాటించాలని కోరడం ఏమిటి? సంస్కరణల అమలుకు సహనం పాటించాలని బహుళజాతి కంపెనీలకు, విదేశీ-స్వదేశీ కార్పొరేట్ పెట్టుబడులకు బోధించిన చరిత్ర ఈ పాలకులకు ఉన్నదా? వీళ్లా జనం నుండి సహనాన్ని డిమాండ్ చేసేది?
డీమానిటైజేషన్ వల్ల జనానికి, దేశానికీ నిజంగానే ప్రయోజనం ఉంటే, అందుకు ప్రధాని, మంత్రులు గ్యారంటీ ఇస్తే ప్రజలు సహనం పాటించవచ్చునేమో. కానీ జనానికి ఏమి ప్రయోజనం ఉంటుందో మోడీ గానీ, జైట్లీ గాని, రోహత్గి గానీ ఇంతవరకు చెప్పింది లేదు. వాళ్ళు చెప్పిన ప్రయోజనాలు (నల్ల డబ్బు, టెర్రరిజం, దొంగ నోట్లు ) నెరవేరడం లేదని ఇప్పటికే స్పష్టం అయిపొయింది. ఇంకా ఏవో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని చెప్పడమే గాని అవేమిటో చెప్పగల దమ్ము, ధైర్యం ఈ బ్లాక్ మనీ పోరాట వీరులకు లేకపోయింది. జనానికి నిజంగా ప్రయోజనాలు ఉంటే కదా వాళ్ళు చెప్పడానికి? వాళ్ళు చెప్పే దీర్ఘకాలిక ప్రయోజనాలు కంపెనీల, కార్పొరేట్లకు గాని జనానికి మాత్రం కాదు. అందుకే ఆ ప్రయోజనాల గురించి పైకి చెప్పలేకపోతున్నారు. వారి దృష్టిలో కార్పొరేట్ల ప్రయోజనాలే ప్రజల, దేశ ప్రయోజనాలు.
హియరింగ్ సందర్బంగా సుప్రీం కోర్టు కొన్ని అంశాలపై కేంద్రాన్ని (అటార్నీ జనరల్ ను) నిలదీసింది. “ఆదాయ పన్ను విభాగం ప్రతి రోజు కోట్ల కొద్దీ కొత్త నోట్లను దాడుల్లో స్వాధీనం చేసుకుంటోంది. కానీ బ్యాంకులేమో ప్రజలకు వారానికి ఇస్తామని హామీ ఇచ్చిన రు 24000 లను కూడా క్యూలో నిలబడ్డవారికి ఇవ్వలేకపోతున్నాయి. ఇదెలా సాధ్యం?” అని ప్రశ్నించింది.
ముకుల్ రోహత్గి ఇందుకు నేరాన్ని బ్యాంకు మేనేజర్ల పైకి నెట్టేశాడు. “బ్యాంకు మేనేజర్లు ఈ అవినీతికి పాల్పడ్డారు. వారిని పట్టుకుంటున్నాము” అని రోహత్గి ధర్మాసనానికి సమాధానం ఇచ్చాడు. యాక్సిస్ బ్యాంకు మేనేజర్లను అవినీతి నేరానికి పాల్పడినందుకు అరెస్టు చేశామని, ఇలాంటి కేసులను ఇంకా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పాడు. ప్రభుత్వం ప్రతి బ్యాంకుకు వెళ్లి కాపలా కాయడం సాధ్యం కాదని కూడా వ్యాఖ్యానించాడు.
అయితే రోహత్గి చెప్పని విషయం ఏమిటంటే కొత్త నోట్లను ప్రయివేటు బ్యాంకులకు ఇచ్చినంతగా ప్రభుత్వ బ్యాంకులకు ఇవ్వడం లేదు. ఈ మేరకు RBI కి కేంద్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు అందాయని ఫ్రంట్ లైన్ పత్రిక తెలిపింది. దేశంలో అతి పెద్ద బ్యాంకు, ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా అయినా SBI కి కూడా యాక్సిస్, ICICI, HDFC లకు ఇచినన్ని కొత్త నోట్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వ బ్యాంకులను కూడా, చివరికి SBI ని కూడా ప్రయివేటు బ్యాంకులను అడిగి కొత్త నోట్లు తీసుకోమని చెబుతున్నారు. కొత్త నోట్లు కుప్పలు తెప్పలుగా బైట పడుతున్న కేసులు అన్నీ, ఒకటి రెండు తప్ప, ఈ ప్రయివేటు బ్యాంకుల వద్ద పట్టుబడినవే. కొన్ని చోట్ల కొద్ది మొత్తంలో పోస్ట్ ఆఫీస్ లు పట్టుబడ్డాయి.
ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రయివేటు బ్యాంకులకే కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటి? ఎప్పటి నుండో బ్యాంకింగ్ కార్యకలాపాల్లో నిమగ్నమైన ప్రభుత్వ బ్యాంకుల కంటే నిన్న మొన్న వచ్చిన ప్రయివేటు బ్యాంకులకు భారీ కరెన్సీ అప్పగించిన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రయివేటు బ్యాంకులు పాల్పడుతున్న అవినీతికి బాధ్యత వహించవలసిన అవసరం లేదా? ప్రయివేటు సంస్ధలపై అలవిమాలిన ప్రేమ కనబరుస్తూ డీమానిటైజేషన్ అనంతర బాధ్యతను వాటికే అధికంగా అప్పగించిన మోడీ ప్రభుత్వం ఈ అవినీతిలో భాగస్వామి కాకుండా పోతుందా?
ప్రధాని మోడీ దగ్గరి నుండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వరకు ప్రయివేటు ఈవాలెట్ లకు ప్రచారం చేసి పెడుతున్నారు గానీ ప్రభుత్వ బ్యాంకులు ప్రవేశపెట్టిన యూపీఐ అప్లికేషన్ కు ప్రచారం చేయడం లేదు. ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే కనీసం 4 శాతం (సేవింగ్స్ ఖాతా) వడ్డీ వస్తుంది. కానీ పేటిఎం లాంటి ప్రయివేటు కార్పొరేట్ కంపెనీల ఈవాలెట్ లో డబ్బు ఉంచితే పైసా వడ్డీ ఇవ్వరు. NDTV నిర్వహించిన ఒక చర్చలో, AAP నేత ఒకరు ఇదే అంశాన్ని ఐటి మంత్రి ముందు పెడితే ఆయన “ప్రభుత్వ బ్యాంకులు చాల స్లో. అవి ఇంకా అభివృద్ధి కాలేదు. కానీ పేటిఎం కి ఐతే బ్రహ్మాండమైన ఇంఫ్రాస్ట్రక్చర్ ఉన్నది” అని సమాధానం ఇచ్చాడు.
ఒక జాతీయ ఛానెల్ లో కనపడి బహిరంగంగానే ఒక ప్రయివేటు బహుళజాతి కార్పొరేట్ కంపెనీకి మద్దతు ఇవ్వడానికి, ప్రచారం చేసి పెట్టడానికి కూడా కేంద్ర మంత్రి వెనుదీయలేదంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు ఎవరితో ముడిపడి ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. వారి లక్ష్యం బ్లాక్ మనీ కాదు, గాడిద గుడ్డూ కాదు. డీమానిటైజేషన్ పేరుతో ఆన్ లైన్ కంపెనీలకు మార్కెట్ పెంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, పేటిఎం మొదలైన కంపెనీలకు లాభాలు పెరిగేలా చేయటమే వారి లక్ష్యం. దేశ కరెన్సీ వ్యవస్ధను మొత్తాన్ని తీసుకెళ్లి బహుళజాతి కార్పొరేట్ కంపెనీల కాళ్ళ దగ్గర పడవేయడమే వారి లక్ష్యం.
కనుక ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి జైట్లీ, అటార్నీ జనరల్ రోహత్గి మొదలైన కంపెనీల సేవకులు అందరూ ప్రజల నుండి డిమాండ్ చేస్తున్న సహనం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే గాని ప్రజల కోసం కాదు. ఈ నిజాన్ని ప్రజలు గ్రహించి అందుకు మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేయాలి. ఇలాంటి మతి మాలిన ప్రజా వ్యతిరేక చర్యకు ఇంకెవరు పాల్పడకుండా గుణపాఠం నేర్పాలి.
సమయం అనేది సాపేచ్చికం అని అయానుస్టీను జెప్పిండు. అంటే ఏందట? గర్లుఫ్రెండు పెదాలను జుర్రుకుంటున్నోడికి ఒకనిముషం అనిపించేంతటి కాలవ్యవధి, కాలే పెనమ్మీద పద్మాసనంవేసుక్కూచున్నవాడికి గంటలా అనిపిస్తుంది. ర్యాంపులమీద వయ్యారంగా నడిచేవాళ్ళు ఎక్కువసేపు ర్యాంపుమీద కనబడాలనుకుంటారు. అదే రోహిణీకార్తెలో నాపరాళ్ళమీద ‘నంగేపైర్’ నడవమనిచెప్పండి. మన అమ్మమ్మలమీద, తాతయ్యలమీద కొత్త గౌరవం పుట్టుకొస్తుంది. అంతా సాపేక్షికత మహిమ.
నోటిమాటతో నోట్లకట్టల ఉనికినీ, సామాన్యుడి జీవితంలోంచి నిత్యావసరాల్ని బయటకు పొమ్మని శాశించిన వెధవలు, ఏసీలోతప్ప ముద్ద, మందు గొంతు దిగని వెధవలు, చేసినతప్పుకు సారీ చెప్పే దమ్ములేని వెధవలు సామాన్య ప్రజానీకాన్ని ఓపికపట్టమంటున్నారు. గడచిన పదేళ్ళలో, వీళ్లలో క్యూలో నిల్చున్నవాడెవడో వాణ్ణొక్కణ్ణి వేలెత్తి చూపండి, వాణ్ణిచూసి మనం ఆశ్చర్యపోదాం. These guys should be punished on the charges of treason.
ప్రధాని చెప్పే సొల్లుకబుర్లును జనాలు ఇంకా నమ్ముతున్నారు!వారీ అవస్థలకు పూర్తిభాధ్యత ప్రధానిదేఅని గ్రహించలేకపోతున్నారు. వారికన్న ఎక్కువగా నల్లకుబేరులూ ఇబ్బంది పడ్డుతున్నారని భ్రమలలో ఉన్నారు. ప్రధానితీసుకున్న చర్య మంచిదేనని వెనకేసుకొస్తున్న సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఎప్పుడో వోట్లద్వారా తమ నిరసనని తెలియజేయగలగుతామని తమ అసంతృప్తిని వాయిదా వేయడం తప్ప ఇప్పుడేమీ చేయలేమని భావిస్తున్నారు. తమ దుస్తితికి బాంకర్లమీద నెపాన్ని వేస్తున్నారే గానీ ప్రభుత్వాన్ని భాద్యులను చేయడంలేదు.
Reblogged this on agkanth's Weblog.
అసలు సహనం ఎవరికి ఉండాలి? ప్రజలకే ఉండాలి- ఏలినవారు చెబున్నది నిజమే గదా! ఏళ్ళ తరబడి దోపిడికి, సహనానికి అలవాటు పడింది వాళ్ళే గదా! అలవాటు పడిన వారికి ఇదో పెద్ద సహనమా? ఇది వాళ్ళకో లెక్క కాదు. వాళ్లు ఎంతైనా భరించగలరు. అసలు కష్టం, సహనం లేనిది ప్రభువులకే! వాళ్ళకు అలవాటు లేనిది ఎక్కడ నుండి వస్తుంది? అర్ధం చేసుకోరు! క్యూలో నుంచున్న వారు నుంచున్నట్లు ఏమి కాదు. దేశానికి ఏ లోటు రాదు. మొన్న జయలలిత అమ్మవారు పరమపదిస్తే తమిళ ప్రజలకు ఎంత కష్టమో గదా! అమ్మ గారి కొరకు ప్రాణాలు వదిలినవారు డెబ్భై ఐదు మంది అట! వారు పోతే దేశానికి ఏమైంది. తాహతు ఉన్నవారు సహనాన్ని సహించగలరా? అందుకే కొత్త నోట్లు ప్రింటింగ్ ప్రెస్ నుండి నేరుగా ఇంటికే వచ్చి చేరుతన్నాయి.
మొన్నా మధ్య మధ్య తరగతి వాడికి కింది తరగతి వాడికి ఒకే ఉద్యోగం ఇస్తే మధ్య తరగతి వాడు వెళ్ళి ప్రభువుల దగ్గర మొరపెట్టు కున్నాడు. ఏమని అంటే, “అయ్యా! నేను మధ్య తరగతి వాడ్ని. గౌరవమైన కుటుంబానికి చెందిన వాడ్ని. వాడు ఆ కింది తరగతి వాడికి నాకు ఒకే రకమైన హోదా ఇస్తే ఎలాగా? వాడి తాహతు నాకు సరి తూగనిది” అని వాపోయాడట. అప్పుడు ప్రభువుల వారు ధీర్ఘాలోచనలొ పడి, ‘అవును, వాడు చెపుతున్న దాంట్లో వాస్తవం ఉంది. బతికి చెడ్డ వాడు. వాడు చెడి బతికిన వాడు. చెడి బతినవాడు చెడిపోయినా పరవాలేదు. వాడికి కొత్తగా కష్టం వచ్చేదేమి లేదు. బతికి చెడినవాడు మాత్రం చెడిపోకూడదు. వాడికి అర్హత లేకపోయినా ప్రమోషన్ కల్పించి న్యాయం చేశారట. అందువల్ల ప్రభువులకు సహనం కావాలనడం ఎంత మాత్రం న్యాయసమ్మతం కాదు. దాన్ని దేవుడు కూడా క్షమించడు. ఏమంటారు!
https://m.facebook.com/story.php?story_fbid=355039594863468&id=100010722906678
Please watch this a moment https://m.facebook.com/story.php?story_fbid=355039594863468&id=100010722906678
ప్రజల్ని బలవంతంగా డిజిటలైజేషన్ వైపు మల్లించే లక్ష్యం తప్ప మిగతావన్నీ అబధాలే అని తేలిపొయింది. అలా చేస్తే ప్రభుత్వ పన్ను ఆదాయం పెరుగుతుంది. కాని దానికి ఇంత అరాచకం గా హడావిడి గా నిర్ణయం తీసుకొనక్కరలేదు. అందుకు ఇప్పుడున్న ఇంఫ్రాస్ట్రక్చర్ సరిపోదు కూడా.
ఉదాహరణకి హెచ్.డి.ఎఫ్.సి. బాంక్ హైదరబాద్ సిటీ లో ఉన్న పి.ఒ.ఎస్. లు 40000. హెచ్.డి.ఎఫ్.సి. బాంక్ సర్వర్లు ఇతర బాంక్ ల కన్నా అత్యున్నత సామర్ధ్యం కలవి. అలాంటిది నోట్ల రద్దు తర్వాత చాలా ట్రాన్సాక్షన్లు పూర్తి కావడం లేదు. లెదా రద్దై పొతున్నాయి. సాయంత్రం 7-8 మధ్య అసలు ఏ బాంక్ పి.ఒ.ఎస్. పనిచెయడం లెదు. ఇప్పుదు ఒక హైదరబాద్ సిటీ లోనే పది లక్షల అప్ప్లికేషన్లు ఒక్క హెచ్.డి.ఎఫ్.సి. బాంక్ కే వచాయట. ఇక ముందు ముందు పరిస్థితి ఏంటో?
ప్రజల్ని మభ్య పెట్టి ఇమేజ్ పెంచుకున్నారు కాని నిజమైన చిత్తసుధ్ధి లొపించింది.లేకుంటే కొన్ని సిస్టమాటిక్ స్టెప్స్ తొ డిజిటలైజేషన్ లక్ష్యాలు సులభంగా కాల క్రమం లో సాధించేవారు.