ప్రధాని మోడీ గారి డీమానిటైజేషన్ కధ దాదాపు కంచికి చేరినట్లే. పాత పెద్ద నోట్ల రద్దు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం, RBI లు దేశంలో ఎంత డబ్బు చలామణిలో ఉన్నదో చెప్పారు. వారి ప్రకారం రద్దు చేసిన ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లలో చలామణిలో ఉన్న మొత్తం 14.95 లక్షల కోట్లు. కొన్ని పత్రికలు 14.18 లక్షల కోట్లు అని చెబుతున్నాయి. ప్రస్తుతానికి పెద్ద అంకెనే తీసుకుందాం.
ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న “ఇప్పటి వరకు (నవంబర్ 30 వరకు) 11.55 లక్షల కోట్లు మేర రద్దు చేసిన నోట్ల బ్యాంకుల్లో జమ అయింది” అని చెప్పింది. పోస్ట్ ఆఫీసుల్లో 35 వేల కోట్లు జమ అయిందని ముందే చెప్పారు. నోట్ల రద్దు నాటికి బ్యాంకుల వద్ద 50 వేల కోట్ల మేర రద్దయిన నోట్ల నిల్వలు ఉన్నాయని RBI చెప్పింది.
ఇవి కాకుండా లెక్కించవలసిన అంకె మరొకటి ఉంది. అది కేష్ రిజర్వ్ రేషియో (CRR). చట్టం ప్రకారం RBI నిర్దేశించిన నిష్పత్తి మేరకు తమ వద్ద డిపాజిట్ అయిన డబ్బుని RBI వద్ద రిజర్వ్ లో ఉంచాలి. ఖచ్చితంగా చెప్పాలంటే డిమాండ్ మరియు టైం లయబిలిటీస్ లో 4% మేర డబ్బు రూపంలోనూ, డబ్బు సమాన రూపంలోనూ నిల్వ ఉంచాలి. ఖాతాదారుల డబ్బు మొత్తాన్ని బ్యాంకులు వినియోగించకుండా ఉండేదుకు, తద్వారా వారి డిపాజిట్లు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఈ నిల్వలను RBI నిర్దేశిస్తుంది.
ఈ ఏర్పాటు కింద RBI వద్ద 4 లక్షల కోట్ల మేర పెద్ద, రద్దయిన నోట్ల నిల్వ ఉన్నాయి.
ఇపుడు ఈ మొత్తాన్ని కలిపి చూద్దాం.
నవంబర్ 30 వరకు బ్యాంకుల్లో జమ అయిన పాత పెద్ద నోట్లు… = 11.55 లక్షల కోట్లు
నవంబర్ 30 వరకు పోస్ట్ ఆఫీసుల్లో జమ అయినది……………. = 0.35 ల కో
నవంబర్ 8 నాటికి బ్యాంకుల వద్ద ఉన్న పెద్ద నోట్లు……………… = 0.50 ల కో
CRR కింద RBI వద్ద ఉన్న పెద్ద నోట్లు……………………………… = 4.00 ల కో
……………………………………………………మొత్తం………. = 16.40 లక్షల కోట్లు
కానీ నవంబర్ 8 తేదీ నాటికి చలామణిలో ఉన్న పెద్ద నోట్లు 14.95 లక్షల కోట్లు అని కేంద్ర ప్రభుత్వం, RBI చెప్పాయి. అనగా అవి చెప్పిన మొత్తం కంటే 1.45 లక్షల కోట్లు పాత వెయ్యి, ఐదొందల నోట్ల బ్యాంకుల్లో జమ అయ్యాయి.
ఇది ఎలా సాధ్యం?
నిజానికి బ్లూమ్ బర్గ్ పత్రిక ప్రకారం డిసెంబర్ 3 తేదీ నాటికి బ్యాంకుల్లో 12.6 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయింది. ఈ లెక్కను పరిగణిస్తే 2.5 లక్షల కోట్లు అంచనాలకు మించి జమ అయినట్లు తేలుతుంది.
ఈ అదనపు డబ్బు ఎక్కడిదో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకులు ప్రజలకు చెప్పవలసి ఉన్నది.
డీమానిటైజేషన్ కు ప్రధాన మంత్రిని ప్రేరేపించిన వారిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతి భట్టాచార్య ఒకరని పత్రికల సమాచారం. ఆమె అప్పుడే ఈ అదనపు సొమ్ముకి కారణాలు చెప్పేస్తున్నారు. ఒకే మొత్తాన్ని రెండు సార్లు లెక్కించడం జరిగి ఉండవచ్చని ఆమె ఒక ఊహ వదిలారు. ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంకుల మధ్య మారకం జరిగిన మొత్తాన్ని రెండు సార్లు లెక్కించి ఉండే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ఆ సాకుతో ఆమె తమ మతి మాలిన చర్యను/సలహాను కవరప్ చేసుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి.
విమర్శలను పక్కనబెట్టి ఆమె చెప్పిన కారణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే చివరికి ప్రధాని, RBI లు కూడా ఇదే కారణాన్ని చెప్పే అవకాశం మెండుగా ఉన్నది. ఇలా రెండు సార్లు లెక్కించిన మొత్తం 10 నుండి 15 శాతం ఉండవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన ఒక అధికారి చెప్పారని ఎకనామిక్ టైమ్స్ పత్రిక తెలిపింది. ఇందులో పెద్ద అంకెనే లెక్కలోకి తీసుకుందాం.
అనగా బ్యాంకుల్లో జమ అయిన 11.55 లక్షల కోట్లు మొత్తంలో 15 శాతం రెండు సార్లు లెక్కించారని అర్ధం. అనగా 1.73 లక్షల కోట్లు. దీనిని తీసేస్తే బ్యాంకుల్లో జమ అయిన మొత్తం 9.8 లక్షల కోట్లు అవుతుంది. ఆ లెక్కన చొస్తే రద్దయిన నోట్ల మొత్తం 14.65 లక్షల కోట్లు అవుతుంది. బ్లూమ్ బర్గ్ చెప్పిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకుల్లో ఉన్న పాత నోట్ల మొత్తం 15.56 కోట్లు జమ అయినట్లు లెక్క.
RBI లెక్కను పరిగణిస్తే ఇంకా 30 వేల కోట్లు మాత్రమే జమ కావలసి ఉన్నట్లు అర్ధం. పాత నోట్ల జమ చేసేందుకు ఇంకా 22 రోజులు మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 15 వరకే జమ చేయాలి అని మరో ప్రకటన చేసినందున బహుశా పాత నోట్ల జమకు ఇంకా వారం రోజులు ఉన్నట్లేనేమో. ఈ వారం రోజుల్లో మిగిలిన 30 వేల కోట్లు జమ కావడం కష్టం కాబోదు. అది కాక పొడిగించిన “ఆదాయ ప్రకటన పధకం” కింద (50 శాతం పన్నుకు అంగీకరిస్తూ ) 20 వేల కోట్ల ఆదాయం ప్రకటించారని కేంద్రం ప్రకటించింది కూడా. కనుక ఇక ప్రకటించవలసింది పది వేల కోట్లు మాత్రమే.
బ్లూమ్ బర్గ్ లెక్కను పరిగణిస్తే 0.61 లక్షల కోట్లు అదనంగా జమ అయినట్లు అర్ధం. కాబట్టి కేంద్రానికి వివరణ ఇచ్చుకోవలసిన అగత్యం తప్పిపోలేదు. “నల్ల ధనం, దొంగ డబ్బు, టెర్రరిజం లపై పోరాటం” అంటూ ఆర్భాటంగా ప్రకటించి 125 కోట్ల ప్రజానికాన్ని నెల రోజులుగా నానా కష్టాలు పెట్టి, కనీసం మరో ఆరు నెలల పాటు మరిన్ని కష్టాలు పెట్టబోతూ ఒక్క పైసా కూడా నల్ల డబ్బు వెలికి తీయలేని చేతగానితనానికి ప్రధాన మంత్రి మోడీ వివరణ ఇవ్వాల్సి ఉన్నది.
దొంగ నోట్లకు అవకాశం లేకుండా చేసి టెర్రరిజం వెన్ను విరిచాము అని జబ్బలు చరిచి మోడీ డీమానిటైజేషన్ తర్వాత కూడా వరసపెట్టి టెర్రరిస్టు దాడులు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాల్సి ఉన్నది. టెర్రరిస్టుల వద్ద వారం రోజులకే 2 వేల రూపాయల దొంగ నోట్ల ఎలా ప్రత్యక్షం అయ్యాయో చెప్పవలసి ఉన్నది.
ప్రధాన మంత్రి పార్లమెంటుకు నాయకుడు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రధాని ప్రతినిధుల సభకు జవాబుదారీ వహించాలి. కానీ పార్లమెంటులో తప్ప ఇంకెక్కడైనా డీమానిటైజేషన్ గురించి సొల్లు చెబుతున్న ప్రధాని నుండి ‘డీమానిటైజేషన్ విఫలం చెందినందుకు’ వివరణ ఆశించగలమా?
సక్సెస్ అయితే గొప్పతనం తమది. కాకపోతే చేతగానితనం ప్రతిపక్షాలది.
Dear Sir,
I am a big fan of you, from long time. I am so impressed by your revolutionary poems, sang against United state politicians and their behaviour upon our poor people. and the punches you used against united people in the meetings were so impressive. In one word I am your ever green follower.
But, when I go through this above mentioned posting, I got shocked, written against the Central Demonetization policy. You said that, the bank deposits are already exceeded, of what the Central/RBI expected; 14.95 Lakhs Crores. May be you are right Sir, but why don’t you think that these deposits are inclusive of Black money. We have to think that, those Culprits might have also deposited, the Black Money into the Banks. Now the Govt.part is left, to trace out ,those Black Money Culprits, making as much as rides on the Banks.
Sir, some times by default also those Culprits are being caught by Income Tax people, when they are acting to pay the advance Taxes of the Coming Financial Year. If we take the Example of our Hyderabadi Mr.Laxman Rao, is been traced out with Rs.10000 crores of money, yesterday.
Sir, Now the Central Govt. had already started making rides on the banks, based on the input given by the bankers to catch hold the Culprits. As per Central/RbI there is almost 4.5 Lakhs Crores of Blank money in our Indian market. May be it is true Sir, we shouldn’t leave it just like that.
Moreover, there are so many cases, that we are observing through daily new papers, that the Bank Officials and the Post Office People are making so much cash exchanges (Crores of Rupees) to the Culprits expecting some commission from those Culprits. So, the Central Govt. with the help of State Governments has to make so many rides on the banks and catch hold those Culprits. Especially these huge money exchange practice is been done by the Private limited banks and the Post offices.
Surprisingly fake money had already started pumping into the market. Here, it is not that possible to control Malpractice by only the Central Govt. It is possible only with the help of State Governments also. As per everybody’s knowledge, it is not that easy to eradicate the Malpractice, by only one person; our PM Mr.Narendra Mode. We all, being the Citizen of India, will have to help the Central Govt to overthrow the Culprits from the Market.
We have so much hope, that we will definitely trace out the Black Currency of Rs.4 Lakh Crores within a span of 6 months. Think Big……Do Big.
Sir, our Big personalities/Stars like KCR, our Honorable CM, and Harish Rao Sir also supporting our Central Govt in this regard. So, it is my kind request to you that, don’t post this kind of postings in the facebook media, which is having a strong network Communication and moreover there are so many followers for you, as like me. And you are most public figure in our Telangana.
Sir, please once aging do think, that the Bank deposits, which are supposed to be exceeded Rs.16.15 Lakh Crores by this end of the month, are also includes the Culprits Black Money, which the Central Govt is expecting Rs.4 lakh Crores minimum.
Please don’t mistaken me Sir. I am ever green follower of you.
D.Bhoopal Reddy,
Gurralagondi,
Siddipet Rural mandal,
Mob.No:98494 15822.