పాత నోట్లను రద్దు చేయటానికి కారణంగా ప్రధాన మంత్రి ఏం చెప్పారు? మూడు ముక్కల్లో చెప్పాలంటే: నల్ల డబ్బు, టెర్రరిజం, దొంగ నోట్లు… వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయటమే డీమానిటైజేషన్ ప్రధాన లక్ష్యం అని చెప్పారు. “జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మీరు ఈ చర్యకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే త్యాగాన్ని చేయాలి. ఎందుకంటే ఈ చర్య ద్వారా అవినీతి, నల్ల డబ్బు, దొంగ నోట్లు మరియు టెర్రరిజం.. ఈ చెడుగులపై పోరాటం ఎక్కు పెట్టాము” అని ప్రధాన మంత్రి చెప్పారు.
కానీ నిన్న, ఈ రోజు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ లక్ష్యాల ఊసే ఎత్తలేదు. నిన్న బ్యాంకర్ల సమావేశంలోనూ, ఈ రోజు పార్లమెంటులోనూ మాట్లాడుతూ ఆయన ప్రధాని తన ప్రసంగంలో చెప్పని లక్ష్యాలను ఏకరువు పెట్టారు.
గురువారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆర్ధిక మంత్రి ఇలా చెప్పారు: “కరెన్సీకి సంబంధించి ప్రభుత్వ సంస్కరణ యొక్క ప్రధాన లక్ష్యం (principle objective) ఏమిటంటే భౌతిక కరెన్సీ కుచించుకుని తీరాలి. ఆర్ధిక వ్యవస్ధ విస్తరించాలి, వాణిజ్యం విస్తరించాలి. కాబట్టి ఎదైతే కుచించుకుపోతుందో దాని స్ధానంలో డిజిటైజేషన్ ప్రవేశించాలి. ప్రవేశించి మరింత విస్తరించాలి… ఈ డిజిటల్ మోడ్ అన్నది వాణిజ్యం మరియు ఆర్ధిక కార్యకలాపాలకు అదనపు లూబ్రికెంట్ గా పని చేయాలి” (The Quint, Bloomberg News)
ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకుల అధిపతుల సమావేశంలో జైట్లీ ఈ మాటలు చెప్పారు. సమావేశం ముగిశాక ఆర్ధిక మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ కూడా ఇవే మాటలు చెప్పారు. “ఒక మిషన్ మోడ్ లో డిజిటైజేషన్ ప్రక్రియను మీరు చేపట్టి అమలు చేయాలి. ఒక యజ్ఞంలాగా డిజిటైజేషన్ ప్రక్రియను చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకింగ్ వ్యవస్ధను ప్రేరేపించడమే ఈ సమావేశం ఉద్దేశం” అని జైట్లీ చెప్పారు.
అయితే 86% కరెన్సీని రద్దు చేసేసి దాని స్ధానంలో డిజిటల్ మారకాన్ని ప్రవేశ పెట్టడమే ప్రభుత్వం యొక్క అసలు లక్ష్యం అన్నమాట! ప్రధాని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘నల్ల డబ్బు, దొంగ నోట్లు, టెర్రరిజం.. ఇత్యాది చెడుగులపై పోరాటం చేయడం’ అసలు లక్ష్యం కాదన్నమాట!
డిజిటైజేషన్ గురించి ఒక్క మాటను కూడా ప్రధాని తన నవంబర్ 8 రాత్రి నాటి ప్రసంగంలో పేర్కొనలేదు. నల్ల ధనం, దొంగ నోటు, టెర్రరిజం ఎన్నాళ్ల నుండో దేశాన్ని లోలోపలి నుండి తొలిచివేస్తున్నాయనీ, అధికారంలోకి వచ్చిందే తడవుగా తాము వీటిపై పోరాటం చేస్తున్నామని, ఈ పోరాటంలో జనం సహకరించాలనీ, దేశ నిర్మాణంలో పాలు పంచుకునే ఇలాంటి సువర్ణ అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందనీ…. ఇలా ఏవేవో చెప్పారు గానీ, డిజిటైజేషన్ లక్ష్యం గురించి మాత్రం చెప్పలేదు.
ఈ రోజు ఆర్ధిక మంత్రి వాటన్నింటినీ పక్కనబెట్టి, దేశ నిర్మాణం పేరుతో చెప్పిన లక్ష్యాల ప్రస్తావన చేయకుండా “కరెన్సీ నోట్ల చలామణిని కుచింపజేసి వాటి స్ధానంలో డిజిటల్ మార్పిడి ప్రవేశపెట్టడమే ప్రధాన లక్ష్యం” అని అసలు విషయం చెబుతున్నారు. సర్జికల్ స్ట్రైక్ లాంటి ఆర్భాటపు కబుర్లు జనం వినియోగానికి ఉద్దేశించిన ఉత్తి వాగాడంబరమే గానీ అసలు లక్ష్యం కాదని పరోక్షంగా స్పష్టం చేస్తున్నారు.
“ఈ సర్జికల్ స్ట్రైక్ బ్లాక్ మనీ పైన కాదు, భౌతిక కరెన్సీ వాడకం పైన” అని మూలకు నెట్టివేయబడ్డ బిజేపి మాజీ నేత అరుణ్ శౌరీ ఎన్‌డిటివి తో మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం చెప్పారు. ఆయన చెప్పిందే నిజమని ఆర్ధిక మంత్రి తాజా వెల్లడి స్పష్టం చేస్తున్నది.
కేవలం బ్యాంకర్లకు దిశానిర్దేశం చేయడంతోనే జైట్లీ సరిపెట్టుకోలేదు. ఆర్ధిక మంత్రిత్వ శాఖలో ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. టాస్క్ ఫోర్స్ కి అదనపు కార్యదర్శి నాయకత్వం వహిస్తారని, డిజిటైజేషన్ ప్రక్రియ ఎంతవరకు అమలు చేస్తున్నారో బ్యాంకులతో క్రమం తప్పకుండా ఇది సమీక్షలు నిర్వహిస్తుందని చెప్పారు.
బ్యాంకులకు టార్గెట్లు కూడా జైట్లీ నిర్దేశించారు. ఒక్కో బ్యాంకు తన రోజువారీ ట్రాన్సాక్షన్లలో ఎంత శాతం మేరకు డిజిటల్ మోడ్ లో చేయాలో ఈ టార్గెట్ల ద్వారా ఆర్ధిక మంత్రి నిర్దేశించారు. డిసెంబర్ 30 లోపు ఎంత మేరకు డిజిటైనేషన్ పూర్తి చేస్తారో పరీక్షిస్తామని బ్యాంకర్లకు చెప్పారు.
“గ్రోసరీ కొనుగోళ్ళు లాంటి చిన్న చిన్న ట్రాన్సాక్షన్లు కూడా డిజిటల్ మోడ్ లో జరగాలని ఆర్ధిక శాఖ పట్టుదలతో ఉన్నది. ప్రీపెయిడ్ కార్డులను కూడా ఆమోదించే విధంగా మనం వర్తకులను ప్రోత్సహించాలి. అదే విధంగా పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్స్ ని పెంచుకునేందుకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి” అని సమావేశంలో పాల్గొన్న ఒక బ్యాంకు CEO చెప్పారు. (The Hindu). పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్స్ అంటే డెబిట్, క్రెడిట్ కార్డులను స్వైప్ చేసే మిషన్లు.
ఈ తరహా ప్రోత్సాహం ఇవ్వడం కోసం మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) నుండి వర్తకులకు మినహాయింపు ఇవ్వాలని ఆర్‌బిఐ, బ్యాంకులకు అర్జెంటుగా ఆదేశాలు జారీ చేసింది. ఎండిఆర్ అంటే ఒక్కొక్క స్వైప్ కీ వర్తకుడు, బ్యాంకుకు చెల్లించవలసిన కమిషన్. డిసెంబర్ 30 వరకు వర్తకులు ఎండిఆర్ చెల్లించనవసరం లేదు. ఎండిఆర్ మినహాయింపుకు ఆశపడి వ్యాపారులు డబ్బు తీసుకోవడం మానేసి స్వైపింగ్ కి ప్రాధాన్యం ఇస్తారని తద్వారా డిజిటైనేషన్ కి జనాన్ని అలవాటు చేయాలని మోడి ప్రభుత్వం లక్ష్యం. మరి డిసెంబర్ 30 తర్వాత?!
“డిజిటైజేషన్ కోసం పట్టణ ప్రాంతాలే కాకుండా బ్యాంకులు ఇప్పుడు సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలపై కూడా దృష్టి కేంద్రీకరిస్తాయి. ఈ శ్రద్ధకు తోడుగా ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రకటనల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతారు. కార్డులు ఎలా వాడాలో తెలిపే వీడియోలు తయారు చేసి ప్రచారంలో పెడతారు. డబ్బు లేకుండా కొనుగోళ్ళు ఎలా చేయాలో వివరించేందుకు సకల మార్గాలను వినియోగిస్తారు” అని ఆర్ధిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. (The Hindu)
జైట్లీ వెల్లడి దృష్ట్యా మనకు అర్ధం అవుతున్నదేమిటి? పాత నోట్లకు బదులు కొత్త కరెన్సీ నోట్లు వేగంగా అందివ్వ లేకపోవడానికి కారణం ప్రభుత్వం చెబుతున్నట్లు కరెన్సీ ముద్రణ ఆలస్యం, లాజిస్టిక్స్ సమస్యలు ఇవేవీ కాదు. ఈ సమస్యలు ఉంటే ఉండవచ్చు గానీ అవే అసలు కారణం కాదు. అసలు కారణానికి అవి ముసుగులు మాత్రమే. అసలు కారణం కొత్త నోట్ల అందజేతను సాధ్యమైనంత ఆలస్యం చేసి, సాధ్యమైనంత తక్కువ చేసి జనాన్ని బలవంతంగా డిజిటైజేషన్ వైపుకు నెట్టడం.
అందుకే జనం ఎన్ని శాపనార్ధాలు పెడుతున్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మోడి ప్రభుత్వం లెక్క చేయడం లేదు. క్యూలలో నిలబడి నిలబడి చనిపోతున్నారని వార్తలు వస్తున్నా, వేరే కారణాలతో చనిపోతున్నారని తప్పించుకుంటోంది గానీ కనీసం సానుభూతి ప్రకటించేందుకు పూనుకోవడం లేదు.
“వెనకడుగు వేయడం మోడి రక్తం లోనే లేదు” అని కొంగొత్త బింకపు ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఏ కాస్తన్నా సడలింపు ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. అసలు మోడి రక్తంలో ఏముంటే ఎవరికి కావాలి? జనానికి ఏదో ఒరగబెడతారని ఆశతో, కాంగ్రెస్ ని ద్వేషించి ఆయనకి అధికారం అప్పజెప్పారు. కానీ ఆయన ఆ జనం ద్వేషాన్ని కూడా భరిస్తూ డిజిటైజేషన్ పట్ల పట్టుదలతో వ్యవహరిస్తున్నారు.
ఏమిటి మర్మం?
నిజానికి జనంలో వ్యతిరేకత ప్రబలుతున్నపుడు ఒక అడుగు వెనక్కి వేసినట్లు కనిపించడం పాలకులకు రివాజు. పిఎఫ్ విత్ డ్రాల్ పై పన్ను ప్రకటించి జనంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తీసుకున్నారు (అప్పుడు మోడి రక్తంలో ఏమున్నదో మరి!). రోహిత్, జేఎన్‌యూ సమస్యల్ని కెలికి ఆనక వ్యతిరేకత రావడంతో స్మృతి ఇరానీని మానవ వనరుల మంత్రిగా తప్పించారు. పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ అధిపతి నియామకానికి వ్యతిరేకంగా విద్యార్ధులు నెలల తరబడి ఆందోళన నిర్వహించినా సహించారు.
కానీ డిజిటైజేషన్ విషయంలో మాత్రం ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గడం లేదు. పైగా కొత్త కరెన్సీ పొందే అవకాశాలను మరింత కుదిస్తూ పోతున్నారు. ఏటిఎంల రీకాలిబ్రేషన్ ఎంతకీ ముందుకు సాగడం లేదు. ఇన్ని మిషన్లు పూర్తయ్యాయి అనడమే గానీ ఎక్కడ పూర్తవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఏటిఎం లలో మాత్రం జనం అవసరాలకు సరిపడా నగదు లభ్యం కావడం లేదు. 500/- నోట్లు అసలే పత్తా లేవు.
ఏమిటి మర్మం?
ఏమిటంటే విదేశీ బడా బహుళజాతి కంపెనీల నుండి అంత గట్టి ఆదేశాలు ఉన్నాయి. నోట్ల రద్దుని ఇప్పుడు ఆర్ధిక మంత్రి ‘బ్లాక్ మనీ పై పోరాటం’ అనడం లేదు. ‘కరెన్సీ నోట్ల చలామణీకి సంబంధించిన సంస్కరణ చర్య’ అంటున్నారు.
కనుక నోట్ల రద్దు బ్లాక్ మనీ పై పోరాటమూ కాదూ, గాడిద గుడ్డూ కాదు. పశ్చిమ సామ్రాజ్యవాదులకు లేదా బడా బహుళజాతి గుత్త కంపెనీలకు హామీ ఇచ్చిన ఆర్ధిక సంస్కరణలలో భాగమే ‘నోట్ల రద్దు.’ భీమా రంగంలో ఎఫ్‌డిఐ ల వాటా పెంపు, మిలట్రీ పరికరాల తయారీలో 100 శాతం ఎఫ్‌డిఐ లకు అనుమతి, విదేశీ ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతి, ఈ-కామర్స్ కంపెనీలలో 100 శాతం ఎఫ్‌డిఐ లకు అనుమతి…. ఈ వరసలో అమలులోకి వచ్చినదే 86 శాతం కరెన్సీ నోట్ల రద్దు!
కాంగ్రెస్, బిజేపి, ఎస్‌పి, బిఎస్‌పి… ఇత్యాది పార్టీల ప్రభుత్వాలు జనానికి ఇచ్చిన హామీల కంటే విదేశీ బహుళజాతి కంపెనీలు ఇచ్చే ఆదేశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. జనానికి ఎంత నష్టం అయినా గ్యాస్ ధరలు పెంచుతాయి. భారత ప్రజల ప్రయోజనాలకు నష్టమే అయినా ఈ-కామర్స్ ని పూర్తిగా విదేశీ కంపెనీలకు అప్పగిస్తాయి. వ్యాపారం కోసం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని కళించినట్లుగానే ఎఫ్‌డిఐలు కూడా భారత ప్రజల ఆదాయ వనరులను కబళించివేస్తాయని తెలిసినప్పటికీ ఎఫ్‌డిఐ లకు తలుపులు 100 శాతం బార్లా తెరిచేస్తారు. భారత పాలకులు భారత ప్రజలకు సేవకులు కాదు, విదేశీ పెట్టుబడులకు సేవకులు.
అందుకే జనాన్ని ఇబ్బంది పెట్టయినా సరే బలవంతంగా డిజిటైజేషన్ ని అలవాటు చేయించేందుకు నడుం బిగిస్తున్నారు. 58 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నా, 90 శాతం ప్రజల ఆర్ధిక కార్యకలాపాలు అసంఘటిత రంగం (informal sector) లోనే జరుగుతున్నా అవన్నీ డిజిటైజ్ కావాలని బహుళజాతి కంపెనీలు ఆదేశించాయి. అమ్మకం, కొనుగోళ్ళు ఎంతగా డిజిటైజ్ అయితే అవి అంతగా బహుళజాతి కంపెనీల దోపిడీకి అందుబాటులోకి వస్తాయి.
నిన్న మొన్నటి వరకు ప్లాట్ ఫారం పైన అమ్ముడు అయిన సాధారణ సరుకులను కూడా ఈ రోజు ఈ-కామర్స్ కంపెనీలు ఇంటర్నెట్ ద్వారా అమ్ముతున్నాయి. ఆ విధంగా ప్లాట్ ఫారం పైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికే బడుగు వ్యాపారుల ఉపాధిని బడా ఈ-కామర్స్ కంపెనీలు ఆక్రమిస్తున్నాయి. ఎక్కడ కాస్త డబ్బు పుడుతుందో అక్కడ తిష్ట వేయడానికి విదేశీ పెట్టుబడులు సిద్ధం అవుతున్నాయి. వాటికి మన పాలకులు, ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు అప్పగించిన అధికారం తోనే ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. ప్రజల ఓటుతో అధికారం చేపట్టి అదే అధికారాన్ని ప్రజా వ్యతిరేక చర్యలకు వినియోగిస్తున్నారు.
మొన్న పి వి నరసింహారావు, నిన్న మన్మోహన్, నేడు మోడి, రేపు మరో గన్నాయ్!
జనం తెలివి తెచ్చుకోవాలి. మిడి మిడి జ్ఞానంతో దొంగలను ఆరాధించడం మానుకోవాలి. గుడ్డి ఆరాధనతో ప్రతి చర్యను బేషరతుగా ఆమోదించడం ఆపాలి. ప్రతి అంశాన్ని తరిచి తరిచి పరిశీలించాలి. కీడెంచి మేలెంచమని పెద్దలు ఊరికే చెప్పలేదు.
మరి ఈసంగతి మౌన ముని మనుమోహనుడుకి తెలియదా? హంసలా పలికారు. ఆయన వారికి నమ్మిన బంటు గదా?
తెలియకేం! ఆయన ఈ సారి తమ పార్టీ మాటలు చెప్పారు. రాజకీయాలు మాట్లాడారు. లేదా రాజకీయం చేశారు.
మీరు మళ్ళీ పూర్తి వివరణ ఇవ్వకుండా కొన్ని ఆరోపణలు చేసి దాటేస్తున్నారు. డిటిజైషన్ వల్ల బహుళ జాతి కంపెనీలు ఎలా లాభ పడతాయి ? అనేది కాస్త వివరంగా చెప్పగలరు. సామాన్యులు అందునా వృద్దులు పడే బాధలు వర్ణణాతీతం. క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు అని చదివినప్పుడల్లా, ఏమిటీ దారుణం అనిపిస్తుంది. డిజిటైజేషన్ చేయాలి అనుకుంటే .. ఇలా ప్రజల్ను రాచి రంపాణ పెట్టాలా ? వేరే దారే లేదా ?
మొదట, డిజిటైజేషన్ వల్ల బ్యాంకులు కాకుండా, బహుళ జాతి కంపెనీలు ఎలా లాభపడతాయో కాస్త వివరించగలరు.
రిటైల్ మార్కెట్‌లోకి FDIలు తీసుకు రావడం అనేదానికీ దీనికీ ఏదన్నా సంబందం ఉందా ?
ఒకవేల ప్రజలంతా నిజంగానే డిజిటైజేషన్ వైపు మల్లి అంతా డిజిటల్ కరెన్సీని ఉపయోగిస్తే అది దేశానికి మంచిదే అని చాలా మంది అభిప్రాయం. దానికేమంటారు ?
పెద్ద నోట్ల రద్దు + డిజిటైజేషన్ కాంబినేషన్ వల్ల చాలా మంది దగ్గరున్న నల్లధనం పనికి రాకుండా పోతుంది అని, దాని వల్ల గృహాలు, స్థలాలు వంటివి బ్లాక్ మనీ ఇచ్చి కొనడం తగ్గుతుందనీ, దాని వల్ల రేట్లు చాలా తగ్గుతాయనీ (చాలా వరకు రియల్ ఎస్టేట్ అంతా బ్లాక్ మనీ రూపములోనే జరుగుతుంది అట) .. అప్పుడు సామాన్యుడు కూడా సొంత ఇంటి కల నెరవేర్చుకోవచ్చనీ .. ఇలా రంగు రంగుల ఇంద్రధనుస్సులు కళ్ళ ముందు పరిచేస్తున్నారు అవి నిజం కాదా ??
వీలైతే వీటి మీద కాస్త విపులంగా రాయడానికి ప్రయత్నించండి.
మన దేశంలో ఎంత వరకు సాంకేతిక అభివృద్ధి సాధించింది? పట్టణాల్లోని మద్యం దుకానాల యజమానులు అమ్మకాల రికార్డ్‌లని కంప్యూటర్లలోకి ఎక్కిస్తోంటే పల్లెటూర్లలోని మద్యం దుకానాల యజమానులు ఇంకా కాగితాల మీదే లెక్కలు వ్రాస్తున్నారు. మద్యం వ్యాపారుల కంటే కిరానా వ్యాపారులు సంపాదించేది తక్కువ. వాళ్ళు కార్డ్ స్వైపింగ్ మెషీన్‌లు వాడే అవకాశం లేదు.
this looks like communist propaganda so you want to continue fake currency in this country creating benami properties and many more malpractices in the name of poor vendors
prabhtva policylo tappu vunnadi ani annavadinalla comunist andam, desa drohulu andam baga jabbula pakindi. ardhka vidhanamulalo mariyu videsi vidhanamlonu congress, b.j.p renu okkate. bharata desaniki mass hestiria jabbu chesindi. deeniki prasthutam mandu ledu. kalam nayam cheyyalsinde.
అమెరికాలో వంద డాలర్ల బిల్ కూడా ఉంది కానీ అక్కడ ఎక్కువగా ముద్రించేవి ఒక డాలర్ బిల్సే. ఒక డాలర్ బిల్‌కి నకిలీ తయారు చేసేవాళ్ళు తక్కువే ఉంటారు. కరెన్సీ నకిలీ జరగకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవి. పెరుగు ప్యాకెట్ కొనడానికి డెబిట్ కార్డ్ స్వైప్ చేసి, పదిహేను రూపాయలకి బిల్ తీసుకునే పద్దతి వల్ల స్వైపింగ్ మెషీన్‌ల స్టేషనరీ ఖర్చుతో పాటు బ్యాంక్ సర్వర్లపై పెరిగే భారం ఖర్చు కూడా ఉంటుంది.
వడ్డీరేట్ల కోతను ఇక మర్చిపోండి!
బ్యాంకుల వద్ద జమవుతున్న భారీ డిపాజిట్లతో, రుణాలపై భారీ రేట్ల కోత ఉంటుందనే అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. వడ్డీ రేట్లు దిగొస్తాయని బ్యాంకులతోపాటు పలు రిపోర్టులు కూడా అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా సెంట్రల్ బ్యాంకు ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్ఫత్తిని 100 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించడంతో ఇక ఇప్పుడు వడ్డీ రేట్ల కోతపై ఆశలను వదులుకోవాల్సిందేనని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. ఆర్బీఐ తాజా ఆదేశాలతో బ్యాంకుల నుంచి రూ.3 ట్రిలియన్ నగదు తరలిపోనుందని, ఇది వడ్డీరేట్లపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. సెప్టెంబర్ 16- నవంబర్ 11 మధ్య కాలానికి ఆర్‌బీఐ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. అంటే నవంబర్ 26నుంచీ బ్యాంకులు ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది.
పెద్ద నోట్ల రద్దుతో కుప్పలుతెప్పలుగా బ్యాంకుల వద్ద జమవుతున్న డిపాజిట్ల నేపథ్యంలో లిక్విడిటీని నియంత్రించేందుకు తాత్కాలిక చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ ఈ నిర్ణయంతో రుణాలపై వడ్డీరేట్ల కోత ఆశలు ఆవిరయ్యాయని క్రిసిల్ పేర్కొంది. బ్యాంకులు వడ్డీరేట్ల కోతను జాప్యం చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై బ్యాంకులు అందిస్తాయని 3-4 శాతం వడ్డీరేట్ల వాగ్దానం కూడా నెరవేరబోదని తెలిపింది. సీఆర్ఆర్ కు నగదు తరలిపోతున్నందున్న డిపాజిట్లపై ఎలాంటి వడ్డీలు కస్టమర్లు పొందే అవకాశముండదని వ్యక్తంచేసింది. పెద్దనోట్ల రద్దుతో వృద్ధి అంచనాలు తగ్గుతున్న నేపథ్యంలో డిసెంబర్ 7న జరుగబోయే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేట్ నిర్ణయం కీలకంగా మారనుందని క్రిసిల్ పేర్కొంది.
పింగ్‌బ్యాక్: వడ్డీరేట్ల కోతను ఇక మర్చిపోండి! | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
ప్రభుత్వం కొత్త నోట్లు ప్రవేశపెట్టిన మెదటిరోజే 2000రూ” దొంగ నోట్లు కూడ వచ్ఛాయి అంటే కొత్తనోట్లతో పాటే దొంగనోట్ల ముద్రణ జరిగిందన్న మాట అంటె మనకన్న ముందు దొంగముద్రణ చేసే వారికే కొత్తనోటు చేరిందన్న మాట మరి దొంగలెక్కడున్నారు?నోట్ల రద్దు నల్లకుబేరుల కోసం అంటున్నారు కాని ఆంక్షలు ఎంపెడుతున్నారు 2.5లక్షలు డిపాజిట్ చేస్తె రేషన్ కార్ట్.ఆరోగ్యశ్రీ రద్దు చేస్తామంటున్నారు ఈరోజుల్లొ చిన్నచిన్న వ్యాపారం చేసేవారు ఉదా”కిళ్లికొట్టు.అరటి.కూరగాయలు తదితరవ్యాపారాలు 1నుండి5లక్షల వరకు రోజువారి పెట్టుబడితో నడిచేవి వీటిపై ఆథారపడి బతికే వారు కోట్లమంది మరి 2.5లక్షల పైనే ఇన్ని షరతులు ఐ.టి నోటిసు పంపిస్తున్నారంటే ప్రభుత్వం ఎవరిని గురిపెట్టి ఈ నోట్లరద్దు బాణం వదిలింది.నల్లకుబేరులంతా దొడ్డిదారిలో తమ డబ్బును మార్చుకుంటున్నారు ఎటొచ్సి సామాన్యుడే నలిగి పోతున్నాడు
Typical leftist analysis.
నల్ల కుబేరులంతా వాళ్ళ దగ్గర ఉన్నవేవో దొడ్డి దారిన మార్చుకున్నారు. చివరకు క్యూలో మగ్గి పోతున్నది సామాన్యు లే ననేది నిర్వివాదాంశం.