ప్రజల అభిప్రాయానికి విలువ లేదు. సామాన్య ప్రజల కష్టాల పట్ల సానుభూతి లేదు. వ్యతిరేక అభిప్రాయం పట్ల గౌరవం లేదు. ప్రజాస్వామ్యంలో విరుద్ధ అభిప్రాయాలకు స్ధానం ఇవ్వాలన్న జ్ఞానమే లేదు. నోట్ల రద్దు వల్ల కలిగే ప్రభావంపై ముందస్తు అంచనా లేదు, అధ్యయనం అసలే లేదు. కనీసం ఏర్పాట్లు లేవు.
కోట్లాది మంది శ్రామిక ప్రజల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి రద్దు చేసి పారేసి నల్ల “ధనంపై పోరాటం” అని ప్రకటిస్తే జనం ఏమై పోతారన్న ఆందోళన లేదు. జనం జీవనం పైన తీరని గాయం చేసి, ఆ గాయం పైన సర్వే పేరుతొ కారం రాయటానికి మాత్రం రెడీ అయిపోయారు.
ఓ వైపు కూలి డబ్బుల కోసం, రబి పంటకు విత్తనాల కోసం, ఖరీఫ్ దిగుబడి అమ్మకం కోసం, పెళ్లిళ్లకు ఖర్చుల కోసం, జనం అల్లాడుతుంటే వారి ఇబ్బందులను పూర్వపక్షం చేసే లక్ష్యంతో తప్పుడు సర్వేలను జనం వినియోగానికి వదలడం కంటే మొరటు చర్య మరొకటి ఉండబోదు. పెళ్లిళ్లకు ప్రకటించిన 2.5 లక్షల డబ్బు ఇస్తామని చెప్పినా బ్యాంకులు ఇవ్వడం లేదు. రైతులు 50000 విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పినా ఆ హామీని గౌవరిస్తున్న బ్యాంకులు బహు తక్కువ. అనేకమంది రైతులు కో-ఆపరేటివ్ బ్యాంకులతో వ్యవహారాలు నిర్వహిస్తుండగా ఆ బ్యాంకులకు డబ్బు (కొత్త నోట్లు) ఇవ్వడం లేదు.
క్యూలలో గంటల తరబడి నిలబడి ఓపిక లేక చనిపోతుంటే కనీసం పలకరింపు లేదు. పైగా చావులు నిజం కాదన్నట్లుగా మంత్రుల ప్రకటనలు! రాత్రింబగళ్లు బ్యాంకుల్లో పని చేసి చేసి అలసి సొలసి సిబ్బంది కొందరు బ్యాంకుల్లోనే చనిపోతుంటే కనీసం సానుభూతి తెలుపడం లేదు. ఎన్ని అవకతవకలు, ఎన్ని ఇబ్బందులు భరిస్తున్నా వారి మౌనాన్ని ఆమోదంగ తీసుకుని ‘అందరూ ఆమోదిస్తున్నారు’ అని ప్రకటించడం కంటే క్రూరమైన జోక్ మరొకటి ఉంటుందా?
“నల్ల డబ్బుకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న చర్య తెలివైనది, గొప్పది” అని 90% ఆమోదించేశారట. పాత పెద్ద నోట్ల రద్దుని వాళ్లంతా సమర్ధించేశారట. నల్ల డబ్బు నిర్ములనలో మోడీ చర్య అద్భుతంగ పని చేస్తుందని 92% నమ్ముతున్నారట. నల్ల డబ్బు పైన తక్షణమే ప్రభావం ఉంటుందని సగం మంది చెప్పారట. రియల్ ఎస్టేట్, ఉన్నత విద్య, వైద్యం లను సామాన్యులకు అందుబాటులోకి తేవడంలో మోడీ చర్యం అద్భుతంగా పని చేస్తుందని 2/3 వంతు మంది నమ్ముతున్నారట. “నల్ల డబ్బు, టెర్రరిజం, దొంగ నోట్లపై పోరాటం వల్ల అసౌకర్యం కలగడం ఇష్టం లేదు” అని కేవలం 8% మంది మాత్రమే చెప్పారట. ఆ 8% అయినా ఎందుకు ఉన్నారో మరి! మొత్తం అందరూ మోడీ చర్యను తెగ మెచ్చుకుంటారని చెబితే మాత్రం ఎవరు అడగొచ్చారు?
ఈ సర్వే నిర్వహించింది ఎవరు? ప్రధాని మోడీ గారి సొంత అప్లికేషన్ (యాప్). మోడీ తీసుకున్న చర్య పైన ఆయనే స్వయంగా సర్వే నిర్వహించుకోవడం, ఆ సర్వే తమకే అనుకూలంగా ఉందని చెప్పుకోవడం… ఇదేమన్నా అర్ధవంతంగా ఉన్నదా అసలు?
మోడీ యాప్ ఎవరు ఇనిస్టాల్ చేసుకుంటారు? మోడీ అభిమానులే ఆయన యాప్ ని తమ స్మార్ట్ ఫోన్లలో ఉంచుకుంటారు. మోడీ అభిమానుల్లో సర్వే చేసి మోడీకి చర్య పైన వ్యతిరేకత లేదు అని చెప్పడం ఏమిటి, సొంత డబ్బా కాకపొతే! మోడీ అభిమానుల డబ్బా మొత్తాన్ని దేశం మొత్తం అభిప్రాయంగా చాటుకోవడం కంటే మించిన చీప్ ట్రిక్ మరొకటి ఉండగలదా?
మోడీ యాప్ ఇచ్చిన పది ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే నోట్ల రద్దు పైన వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశమే ఆ ప్రశ్నల్లో లేదు. చెబితే ‘భేష్ బాగుంది’ అనైనా చెప్పాలి. లేదా ‘నాకు తెలియదు’ అనైనా చెప్పాలి. ఉండటానికి మల్టిపుల్ ఛాయిస్ ఉన్నా వాటిలో ఒకటి ‘నాకు తెలియదు’ అని ఉంటుంది. మిగిలినవన్నీ మోడీ చర్య పట్ల సానుకూలత వ్యక్తం చేస్తాయి తప్ప వ్యతిరేకత వ్యక్తం చేయవు.
ఉదాహరణకి ఈ ప్రశ్న చూడండి!
7. Demonetisation will bring real estate, higher education, healthcare in common man’s reach
Completely Agree
Partially Agree
Can’t Say
ఈ జవాబుల్లో Disagree అని మరో ఛాయిస్ కూడా ఉండాలి. అప్పుడే అన్ని అభిప్రాయాలకు చోటు ఇఛ్చినట్లు లెక్క. పూర్తి అంగీకారం, అర్ధఅంగీకారం, తెలియదు అన్న మూడు సమాధానాలు మోడీ చర్యకు సానుకూలంగా ఉన్నాయి తప్ప వ్యతిరేకంగా లేవు. ఈ సమాధానాలు సంపూర్ణ అభిప్రాయాన్ని ఎలా సేకరించగలదు? అది కూడా మోడీ అభిమాన గణాల నుండి?
ఇలాంటి మోసపూరిత సర్వేని ప్రజల కష్టాలకు ప్రత్యామ్నాయంగా ప్రచారంలో పెట్టడం అంటే ప్రజల ఇబ్బందులని ఏ మాత్రం పట్టించుకోకపోవడమే.
మోడీ యాప్ కేవలం స్మార్ట్ ఫోన్లలో మాత్రమే పని చేస్తుంది. స్మార్ట్ ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? ట్రాయ్ లెక్క ప్రకారం ఏప్రిల్ 30, 2016 నాటికి ఇండియాలో టెలి డెన్సిటీ 81.35% . అనగా 100 మంది జనంలో 81.35 మొబైల్ (ల్యాండ్ లైన్ – 1.97%) ఫోన్లు ఉన్నాయని అర్ధం. దీని అర్ధం వంద మందిలో 81.35 మందీ మొబైల్ ఫోన్లు వాడుతున్నారని అర్ధం కాదు. రెండుకు మించి ఫోన్లు, కనెక్షన్లు ఉన్నవారు అనేక మంది ఉన్నారు. చాల ఫోన్లలో రెండు సిమ్ లు పెట్టుకోవచ్చు. 10 మందిలో ఇద్దరికీ రెండు ఫోన్లు ఉన్నాయనుకుందాం. ఒక్కో ఫోన్ లో 2 సిమ్ లు ఉంటె వారికి 8 మొబైల్ కనెక్షన్లు ఉన్నట్లు అర్ధం. అనగా 10 మందికి గాను 8 కనెక్షన్లు ఉన్నట్లు అర్ధం. అప్పుడు టెలి డెన్సిటీ 80% ఉన్నట్లు లెక్క.
ఇలాంటి లెక్కన మొత్తం మొబైల్ ఫోన్లలో 17% మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్నారు. యాప్ లు స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఇన్ స్టాల్ చేసుకునే వీలు ఉంటుంది. ఈ 17% మందిలో పేదలు, రైతులు, ఉండే అవకాశమే లేదు. కేవలం మధ్య తరగతి, అంతకు పైవాళ్ళు మాత్రమే స్మార్ట్ ఫోన్లు వాడతారు. భారత దేశంలో మధ్య తరగతి జనం దృష్టిలో సామాన్యులు, పేదలు, పల్లె జనం అసలు మనుషులు కాదు. వారికి వారి ప్రయోజనాలు తప్ప ఇతరుల ప్రయోజనాలు పట్టవు. ఇటు శ్రమ జీవులలో భాగం కాలేక అటు సంపన్నులలో భాగం అయ్యే వీలు లేక అటు ఇటు కానీ మధ్యస్ధ స్ధాయిలో ఊగిసలాడే మధ్య తరగతి జనం ఆలోచన ప్రగతి నిరోధకంగా ఉంటుంది తప్ప అందరికి మంచి జరిగే ఆలోచన వారు చేయలేరు.
అసలే కోతి, కల్లు తాగింది, ఆపై నిప్పు తొక్కింది… ఇక ఆ కోతిని పట్ట గలమా? అసలే మోడీ అభిమాన గణం, మోడీకి అనుకూలంగా లేని ప్రతి అభిప్రాయము యాంటీ నేషనల్ అని వారి నిశ్చితాభిప్రాయం. వాళ్ళని మోడీ చర్య పైన తీర్పు అడిగారు. ఇక వాళ్ళు జనం అభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించగలరా?
పాత పెద్ద నోట్లను రాత్రికి రాత్రి ఏక పక్షంగా రద్దు చేయడం అత్యంత అప్రజాస్వామిక చర్య. ప్రజల ఇబ్బందులను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా స్వార్ధ రాజకీయ ప్రయోజనాలతో పాటు, అంతర్జాతీయ బహుళజాతి ఫైనాన్స్ కంపెనీల వ్యాపార ప్రయోజనాలే లక్ష్యంగా తీసుకున్న చర్య. ఇందులో నల్ల డబ్బు పై పోరాటం చేసే లక్ష్యం ఏ మాత్రం లేదు. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోవడం ఎంత తెలివైందో 0.02 శాతం దొంగ నోట్లు (జైట్లీ లెక్క ప్రకారమే), 20% నల్ల డబ్బు నిర్ములించే పేరుతొ మొత్తం కరెన్సీలో 86 % కరెన్సీని చిత్తు కాగితాలుగా మార్చడం అంత తెలివైన చర్య.
చట్టబద్ధంగా దర్యాప్తు చేసి, అక్రమ మార్గాలు మూసివేయడం ద్వారా నల్ల డబ్బు పట్టుకోవడం మానేసి, అది చేత గాక సామాన్యుల కష్టార్జితాన్ని నల్ల డబ్బుగా ముద్ర వేసే అతి తెలివి పనికి పూనుకోవడం అత్యంత నియంతృత్వ చర్య. ఇందిరా గాంధీ చట్ట బద్ధంగా ‘ఎమర్జెన్సీ’ ప్రకటించి అమలు చేస్తే మోడీ ప్రభుత్వం చట్టం జోలికి పోకుండా తుగ్లక్ చర్యలతో ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు. ఇంత మొత్తంలో కరెన్సీ ని రాత్రికి రాత్రి రద్దు చేసే చట్టపరమైన అవకాశం లేకపోయినా ముందుకు వెళ్ళడానికి మోడీ ఏ మాత్రం సంశయించలేదంటే అది ఆయన నియంతృత్వ ధోరణికి నిదర్శనం తప్ప అవినీతి పై పోరాటం కోసం కాదు.
అవినీతి పై పోరాడ దలిస్తే అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు కావస్తున్నా లోక్ పాల్ ని మోడీ ఎందుకు నియమించలేదు? అంబానీ గ్యాస్ కంపెనీ అవినీతిపై విచారణకు ఆదేశించిన ఢిల్లీ ఏసీబీ ని కేజ్రీవాల్ నుండి ఎందుకు లాక్కున్నట్లు? పదేళ్ల గుజరాత్ పాలనలో లోకాయుక్త ను మోడీ ఎందుకు నియమించలేదు? నల్ల డబ్బు ప్రధానంగా విదేశీ ఖాతాల్లో, రియల్ ఎస్టేట్ లో, షేర్ మార్కెట్ లో, పేపర్ కంపెనీ పెట్టుబడుల్లో ఉంటె వాటిపై దృష్టి ఎందుకు పెట్టరు? పనామా పేపర్స్ లో పేర్లున్న వారిపై విచారణ ఎందుకు చేయరు? స్విస్ బ్యాంకులు అందజేసిన ఖాతాదారుల పైన ఎందుకు చర్యలు లేవు? కనీసం వారి పేర్లయిన ఎందుకు బయటపెట్టరు? విజయ్ మాల్యా లాంటి పన్ను ఎగవేతదారుల రుణాలను ఎందుకు రైట్-ఆఫ్ చేస్తున్నారు? విజయ్ మాల్యా, లలిత్ మోడీ లాంటి ఆర్ధిక నేరగాళ్ళను ఎందుకు వెనక్కి రప్పించరు?
నల్ల డబ్బు, అవినీతి, పన్నుల ఎగవేత ల మూలాలను దెబ్బ తీసే మౌలిక చర్యల జోలికి పోకుండా జనానికి ఇబ్బందులు తెచ్చే సారం లేని సంచలన చర్యలు పాల్పడడం, వాటినే వీరోచితంగా చర్యలుగా తనకు తానే డబ్బా కొట్టుకోవడం పోరాటం కానే కాదు. ‘మరిన్ని చర్యలు ఉంటాయి’ అని బింకంగా ప్రకటించడం కేవలం ప్రజల్లోని వ్యతిరేకతను జోకొట్టడానికి మాత్రమే ఉద్దేశించినది. అవినీతి, నల్ల ధనం, పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా వాస్తవ, మౌలిక చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం, అవసరం, పునాది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేనే లేవు. జరుగుతున్నది కేవలం జనాన్ని అయోమయంలో పెట్టి, భ్రమల్లో ముంచి మోసగించే ఉత్తుత్తి చప్పుడు మాత్రమే.
పెద్ద నోట్ల చలామణి ప్రతిష్టంభన ప్రభుత్వం తమ పాలనను ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో పదిలపరచుకునే నేపధ్యంలో వ్యాపారదిగ్గాజాలతో అంతర్గత ఒడంబడికల మేలు కలయిక, సామాన్యుల పరిధిలో కీడు ప్రక్రియ. ఈ చర్య అమలుకు ముందు
మాజీ ఆ.బీ.ఐ. గవర్నరు ఉద్వాసన బహుశ అభిప్రాయబేధాల పర్యవసానం. లోగడ రిలయన్స్ సంస్థలో అధికారిక హోదాలో పనిచేసిన సదరు వ్యక్తిని ఆర్.బీ.ఐ. ప్రస్తుత గవర్నర్గిరీని చేసి నలధనం రూపుమాపు సంస్కరణ మాటున బడా వ్యాపారవేత్తాలను గజారోహణం ఊరేగించి సామన్యుల పీచమణిచారు. ప్రజల శ్రేయస్సును కోరే ప్రభుత్వం వారి వెసులుబాటు ప్రాఢాన్యత రీతిలో తగిన మిగులుదిశగా చిన్న నోట్ల ముద్రణ కావించి, బ్యాంకుల లావాదేవిలకు పటిష్టమైన చర్యలను మనుగడలోకి తీసుకుని సిద్ధపడిన పిదప ప్రకటన చేయాలి కాని. ముందుగా రాజకీయ శ్రేయోభిలాషులకు ఉప్పు అందించి సామాన్య ఓటర్లయిన ప్రజలను ముప్పుతిప్పలు పెట్టడం ఎంతవరకు సమంజసం? కుట్రలు కుతంత్రాలు లేని స్వఛ్చరాజకీయం ఈ కలియుగానికే అతీతం. జాతీయ బ్యాంకుల కార్యకలాపాల సమీక్షలో ఎప్పుడూ ఎగవేతదారుల పెద్దమొత్తాలను రాని బాకీలఖాతకు బదలాయించి వారిని బడాబాబులుగా మార్చి నల్లధన సమీకరణకు మార్గం సుగమం చేసింది మారే పంచవర్ష రాజకీయపాలనలు లేదా కొన్ని సుస్థిర
రాజకీయ ప్రభుత్వాలు. దాసరి తప్పు దండంతో సరి అనే నానుడిలో ఒకరి మీద ఒకరు నిందారోపణలుతో చట్టసభల గందరగోళాలో సాంప్రదాయలను పక్కదారులు పట్టించి న్యాయ వ్యవస్థకు కూడా అంతుపట్టని రీతిలో కాలహరణం చేస్తున్నారు.
ఒక తెలుగు ముఖ్యమంత్రి తన సంస్థ షేర్లను ఈ విప్లవాత్మక చర్యకు కొద్దిముందుగా విక్రయించడంలోని ఆంతర్యం మీరే గ్రహించాలి. పెద్దనోట్ల బడబాబులు ఒకరైన బ్యాముకుల ముందు లేదా ఏ.టి.ఎమ్.ల ముమ్దు బారులు తీర్చి నుంచున్నారా? మధ్యతరగతి, వెనకబడిన ప్రజల ఆక్రోశాలను చూసి స్పందించని బ్యాంకు కార్యకాలాపాలు ఎంత దిజారుడుస్థాయిలో వున్నాయో వారి వివ్ధ యత్నలు చెబుతాయి. నగదులేదనే గోడ్ పత్రికల అంటింపు, అందుబాటులో లేని సాంకేతిక ప్రక్రియల పట్టింపు. లంచ్ సమయంలో సిబ్బంది మూకుమ్మడిగా వెళ్ళిపోవడంలాంతి క్రియలతో ” వంకలేనమ్మ డొంకపట్టుకుని ఏడ్చిందనే రీతిలో సామేతను తెగ మేసారు. అందోళన తారాస్థాయికి చేరుకునే సమయంలో షట్టర్ల మూత లేదా నగదు కోతతో ఏ,టి.ఎమ్.ల మూత. ఎప్పుడో భవిష్యత్తులో జరిగే అద్భుతాలకు ఊహలనిచ్చెన వేసి వర్తమానంలోని సామాన్యులను కష్టాల దిగంతాలకు తోసి ఏదో చేసామని చంకలు గుద్దుకోవడం రాజకీయ లక్షణం తప్ప సామాన్యుడి రక్షణం కాదు. ఊహలు వాస్తవం రూపం దాల్చే సమయానికి పాలనా ప్రభుత్వ నిర్ణీతకాలం ముగిసి నేటి సంస్కరణల నాయకులు ముసుగులోకి లేదా దాగుడుమూతలకు సిద్ధమవుతారు. మరొక ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వాన్ని శాపనార్దలు పెడుతు పబ్బంగడుపుతారు.
ప్రతిభకోసం ప్రచారసాధనాలను దుర్వినియోగంతో ప్రభుత్వం సామన్యుల ఇక్కట్ల వాస్తవాలను ఇరాకాటంలో పెట్టి తమకు తాముగా అందలమెక్కి చిందులుతొక్కుతున్నారు.

క్యూలో నించొని ప్రాణం పోయిన వృద్ధులు,
దాదాపు సగం పణం పోయిన కాళధన కృద్ధులు,
వీరి ఉసురు తగిలేనయా….
కలయా నిజమా అనుకునే మధ్యులు,
వీరి ఆశీస్సులే రక్షయా…
అద్దంలో చూసుకుని తనను తానే ముద్దు పెట్టుకునేవాని బిహేవియర్ ఇలాగే ఉంటుంది.
Narendra modi is always great