నోట్ల రద్దు: రాజకీయ ప్రయోజనాలు సాధిస్తాం -బీజేపీ


 

పెద్ద నోట్ల రద్దు వెనుక బీజేపీ లక్ష్యాలు తెర వెనుక నుండి మెల్లగా బైటికి వస్తున్నాయి. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నల్ల ధనం, ఉగ్రవాదం, దొంగ నోట్లు, మున్నగు జబ్బుల్ని నయం చేసేందుకు పెద్ద నోట్లు రద్దు చేశామని మోడీ చెబుతుండగా ‘నోట్ల రద్దు’ వల్ల వచ్చే ప్రతిష్టను ఓట్ల కోసం వినియోగించుకుంటామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 

“మేము రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం. భజన బృందం నడపడం లేదు. భజన పాటలు పడేవాళ్ళం కాదు. కనుక ఈ చర్య ద్వారా వచ్ఛే ప్రతిష్టను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటాం” అని బీజేపీ నేతలు చెప్పారని ద హిందూ బిజినెస్ లైన్ తెలిపింది. 

“నిజాయితీ ఇండియా, బీజేపీల పక్షం నిలబడే ప్రజలున్నారు. కాంగ్రెస్, BSP ల పక్షాన నిలబడేవారు ఉన్నారు. వల్ల ప్రయోజనాలు దెబ్బ తిన్నందునే గొణుగుతున్నారు. వాస్తవం ఏమిటంటే ప్రతి సర్జరీ తర్వాతా కొద్ది కాలం పాటు బ్యాండేజిలు ఉంటాయి; ఆయింట్మెంట్ లు రాస్తారు. అటువంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాక అనివార్యంగా ప్రతిస్పందనలు ఉంటాయి” అని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

BSP , కాంగ్రెస్ పార్టీల ప్రస్తావన కాకతాళీయంగా జరగలేదు. త్వరలో యూపీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో BSP పార్టీయే బీజేపీ కి గట్టి పోటీ ఇవ్వనున్నదని పత్రికలూ, పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల నిమిత్తం మాయావతి ఇప్పటికే నిధులు సేకరించి పెట్టుకున్నారు. కానీ తాజా చర్యతో BSP

/ మాయావతి సమీకరించిన నిధులు మొత్తం వృధా అయినట్లే. ఈ విధంగా అత్యంత ముఖ్య రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో గట్టి పోటీ ఇస్తున్నదని భావిస్తున్న పార్టీ అవకాశాలకు బీజేపీ గండి కొట్టగలిగింది. ఈ విషయాన్నీ బీజేపీ నేతలే అంగీకరించడం బట్టి పెద్ద నోట్ల వెనుక దాగిన మర్మం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 

పెద్ద నోట్ల ద్వారా మోడీ కి లభించిన అవినీతి వ్యతిరేక ప్రతిష్ట రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అవకాశాలను బాగా మెరుగుపరుస్తుంది బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. తక్షణమే ఏడుకోవలసి వచ్ఛే కొన్ని కష్టాల వల్ల ప్రజలు ఇబ్బంది పడినప్పటికీ, ఆ ఇబ్బంది వల్ల వచ్చే వ్యతిరేకత ఏంటో కాలం నిలవదని అంతిమంగా బీజేపీ వైపే జనం మొగ్గు చూపుతారని వారు భావిస్తున్నారు. 

“వ్యతిరేక స్పందన తాత్కాలికం మాత్రమే. త్వరలోనే పరిస్ధితులు చక్కబడతాయి. ఏదేమైనప్పటికీ పేదలు ఇబ్బంది పడుతున్నారని చెప్పడం పూర్తిగా తప్పు… ఇది జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల మా ఓటు బ్యాంకుకు నష్టం వస్తుందని మాకు తెలుసు… అయినా మేము ముందుకు వెళ్ళడానికే నిశ్చయించుకున్నాం. ఎందుకంటే దేశం పట్ల మాకున్న సానుకూల దృష్టిని ప్రజలు అర్ధం చేసుకుంటారు” అని బీజేపీ నేత ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఓ పక్క జాతీయ ప్రయోజనాలు అంటూనే మరో పక్క ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రస్తావించడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఇది ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. రానున్న రాష్ట్రాల ఎన్నికలపై పడే ప్రభావాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి బీజేపీ కి నష్టం కంటే లాభమే ఎక్కువ అన్న అంచనాకు రావడం వల్లనే బీజేపీ ఈ చర్యకు ఉపక్రమించింది. 

తాము అవినీతికి వ్యతిరేకం అన్న సందేశాన్ని జనం లోకి పంపడం; కాంగ్రెస్, BSP తదితర ప్రత్యర్థి పార్టీలు పోగేసిన డబ్బు కట్టల్ని వృధా చేయడం; తద్వారా ప్రత్యర్థి పార్టీల విజయావకాశాలను దెబ్బ తీయడం; ఎన్నికల్లో లబ్ది పొందడం… ఈ వ్యూహం తోనే పెద్ద నోట్ల రద్దుకు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఆ విషయాన్నీ ఇంకెవరో చెప్పడం కాదు. బీజేపీ నేతలే చెబుతున్నారు.

7 thoughts on “నోట్ల రద్దు: రాజకీయ ప్రయోజనాలు సాధిస్తాం -బీజేపీ

 1. బూమరాంగ్…….

  నేనే బిజేపీలో నిర్ణాయక శక్తినయితే, అయిదు వందలు ఉంచి, వెయ్యి రద్దు చేసి, 2 వేల నోటు గురించి ఇప్పుడు మాట్లాడేవాడిని కాదు.
  ఎలక్షన్లు అయాక పది మందికీ మేలు చేసే విధంగా నిదానంగా వెయ్యి, 2 వేలేమిటి, అయిదు వేల నోటు కూడ ప్రవేశపెట్టేవాడిని.
  పరిమితంగా, జాతికి అవసరం కదా మరి. మీడియా మనదేనాయే. ఎవరొద్దన్నారు? సామాన్యుడికి ఎన్ని సున్నాలో తెలుసా చచ్చా…

  ఎందుకింత కంగాళీ చేసుకున్నారో మరి.
  త్వరపడి ఈ రెండు నెలలలోనే బావుకునేదేముంది?
  నిదానించి చేస్తే ఇంకా పొలిటికల్ లీవరేజ్ వచ్చేది.
  ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుందనుకోండి…. చూద్దాం …..

  శ్రీకాంత్ గడ్డిపాటి.

 2. మొడీ ప్రకారం కొంతమేరకు నల్లధనం వచ్చిందనుకుందాం తర్వాత రాబొయే నల్లధనాన్ని ఎలా అరికడతాడు ఉత్పత్తి అమ్మకాలు ప్రతిరొజూ జరుగుతూ వుంటాయి వాటి పైన వీలైనంత తక్కువ ఆదాయం చుపించడానికి నిరంతరం c,a లు పనిచేస్తూ తక్కువ ఆదాయంగా చుపుతూ మిగిలింది నల్లధనంగా మారుతూ వుంతుంది.

 3. hanky panky pink money – మాకొద్దు – అని ఒక్కరూ అనరే..

  పైగా స్వంత చిత్ర కళాపోషణ ఒకటి.(సెల్ఫీలు)

  నాన్న పెళ్ళి అని సంబరమే గాని సవతి వస్తుందన్న ఆలోచన లేకపోయిందిట..

 4. ట్విట్టర్‌లో నరేంద్ర మోదీ ఫాలోవర్స్ సంఖ్య మూడు లక్షలు పడిపోయింది. పిచ్చి తుగ్లక్ దిల్లీ నుంచి దేవగిరికి రాజధానిని మార్చినట్టే మోదీ కరెన్సీ నోట్లు మార్చాడు, అంతే.

 5. డబ్బులు పారేస్తున్నవాళ్ళందరూ బ్లాక్ మనీ గడించినవాళ్ళు కాదు. కిరానా వ్యాపారులకి ఇన్‌కమ్ టాక్స్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కిరానా వ్యాపారం చేసి ఐదు లక్షలు గడించినవాడు ఆ ఐదు లక్షల లెక్క చూపించలేక అవి పారెయ్యడం ఇప్పుడు జరుగుతోంది. వైజాగ్‌లో ఒకడు పేదవాళ్ళకి డబ్బులు పంచాడు. తాను నోట్లు మార్చుకోలేక డబ్బులు పంచుతున్నానని చెప్పుకున్నాడే తప్ప దానం చేస్తున్నట్టు నటించలేదు.

 6. ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేని వ్యాపారం చేసి గడించినవాళ్ళు లెక్క చూపలేక డబ్బులు పేదవాళ్ళకి పంచాల్సి వస్తే వాళ్ళు ఆ పని పోలీసులకి తెలియకుండా చెయ్యడం మంచిది. పోలీసులకి తెలిస్తే వాళ్ళు మీకూ లెక్క అడుగుతారు, పేదవాళ్ళకి మీరు పంచిన డబ్బులూ లాక్కుంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s