కొత్త రు 500, రు 2000 నోట్లు?


SO, IT IS NOT SO GOOD NEWS!

అవినీతి నిర్మూలన కోసం అంటూ మోడి ప్రకటించిన నోట్ల రద్దు చర్య అసలు స్వరూపం ఏమిటో అర్ధం అవుతున్నది.

పత్రికలు పెద్దగా చెప్పని విషయం ఏమిటంటే త్వరలో కొత్తగా రు 500 నోటు, రు 2000 నోటు ఆర్‌బి‌ఐ ముద్రించబోతున్నదట. ఆ సంగతి కూడా ప్రధాన మంత్రి గారే చెప్పారా లేక ఎవరు చెప్పారన్నది తెలియడం లేదు.

ఇండియా టుడే ఇంటర్నెట్ వర్షన్ అది కూడా మోడియే చెప్పారని చెప్పింది.

“కొత్తగా ముద్రించిన రు 2000/-, మరియు రు 500/- నోటు త్వరలో చలామణిలోకి వస్తాయి. అధిక విలువ కలిగిన నోట్లను పరిమితంగా ముద్రించాలని ఆర్‌బి‌ఐ నిర్ణయించింది” అని మోడి చెప్పారని పత్రిక తెలిపింది.

కాబట్టి మోడి తలపెట్టిన అవినీతి నిర్మూలనా చర్య కేవలం నేతి బీరకాయ చందమే అన్నమాట!

పాత నోట్లు రద్దు చేస్తే ఇప్పటి వరకు నిలవ చేసిన నల్ల డబ్బు రద్దు అయిపోతుందని, కొత్తగా ముద్రించబోయే పెద్ద నోట్లు పరిమితంగానే ముద్రిస్తారు తప్ప అవినీతి పెరగదని మోడి నమ్మబలుకుతున్నారు.

హారి పిడుగా?!

వెయ్యి రూపాయల నోట్లతో పోగు బడిన నల్ల డబ్బు, అవినీతిని కొత్త 2,000 నోటు రద్దు చేసేస్తుందా? ఏమిటి ఈ వింత?

మోడి చర్య అవినీతిని నిర్మూలించడం కాదు, ఇంకా పెంచనున్నది. నల్ల డబ్బు మరింత తేలికగా నిల్వ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నది.

వాస్తవం ఏమిటంటే మోడి ప్రభుత్వం కొత్తగా 2,000 నోట్లు ముద్రించాలని తలపెట్టింది. కానీ పెద్ద నోట్ల వల్ల ఇప్పటికే అవినీతి పెరిగిందని జనం వాపోతుంటే కొత్తగా 2000 నోటు ప్రవేశ పెడితే ఇంకేమన్నా ఉందా? ‘అవినీతిని చీల్చి చెండాడతాన’న్న తన ప్రతిజ్ఞ నవ్వుల పాలు కాదా? ప్రజలు ఇక తనని నమ్మడం మానేస్తారు కదా!

ఈ ప్రమాదం నుండి తప్పించుకునే క్రమంలో ప్రభుత్వ పెద్దలు రద్దు ఎత్తుగడ పన్నినట్లు కనిపిస్తోంది. ముందు రద్దు చేసేస్తే అవినీతి వ్యతిరేక ప్రతిష్ట పెరుగుతుంది. 2,000 నోట్లు పరిమితంగా ముద్రిస్తాం అని చెబితే ఆ దోషం చాలా వరకు తగ్గిపోతుంది. ఆ తర్వాత ఎన్ని 2000 నోట్లు ముద్రిస్తామో ఎవరు చూడొచ్చారు?

(ఈ ఫోటోల్ని ఇండియా టుడే ప్రచురించింది)

పెద్ద నోట్లు పరిమితంగానే ముద్రించడానికి ఆర్‌బి‌ఐ నిర్ణయించింది అని చెప్పడం ఒట్టి మాట! పరిమితంగా ముద్రించే పాటికి అసలు ఆ నోట్లు లేకపోతేనేమీ? ఆ 1000 నోట్లనే 500 నోట్ల లాగా కొత్తగా ముద్రించవచ్చు గదా.

కానీ అసలు లక్ష్యం అవినీతి నిర్మూలన కాదు. మరింత పెద్ద నోట్ల ద్వారా సంపన్న వర్గాలకు మరింత సౌకర్యం కలిగించడమే అసలు లక్ష్యం. కొత్త నిర్ణయానికి వ్యతిరేకత రాకుండా మొదట ముసుగు చర్యను ఎంచుకున్నారు. ఇది రొంబ రొంబ రొంబ మోసం!

ముందు ఆర్టికల్ లో చెప్పినట్లు పాత 500, 1000 నోట్లు వదిలించుకోవడం సంపన్నులకు అంత కష్టం ఏమీ కాదు. ఈ దెబ్బతో బ్యాంకులకు డిపాజిట్లు పెరిగినా పెరగవచ్చు.

11 thoughts on “కొత్త రు 500, రు 2000 నోట్లు?

  1. పరమ చెత్తగా ఉంది మీ వ్యాఖ్య, వ్యాసం. ఎప్పుడూ మంచి వ్యాసాలు రాస్తారు. ఇది మాత్రం మీరెంత మాత్రం విషయం తెలుసుకోకుండా రాశారు అనిపిస్తోంది. పాత నోట్లు రద్దు చేయడం ద్వారా నల్లధన నిల్వలు, దేశంలోని వివిధ నగరాల్లో వేలకోట్ల హవాల నిధుల బంకర్లు చెత్తకుప్పలో పడేయాలి తప్ప వైట్‌ చేసుకునే అవకాశం లేదు. లెక్కలు చూపకుండా, ఆధారాలు ఇవ్వకుండా బ్యాంకుల్లో వాటిని మార్పిడి చేసుకోవడం వారి వల్ల కాదు. తేడా వస్తే బొక్కలోకి పోతారు కూడా. అంత ధైర్యం ఎవరూ చేయరు. మళ్లీ మీరు వాపోతున్న రూ.2వేల నోట్లను వారు మళ్లీ మొదటిరూపాయి నుంచి సంపాదించాల్సిందే. ఇంకా మీరు లోతుగా చదివితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బ్యాంకు, ఆన్‌లైన్‌ లావాదేవీలు పేరుగుతాయి. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా వృద్ధినొందుతుంది.ఆ మేరకు ప్రజలపై పన్నుల భారం తగ్గటం, సంక్షేమ కార్యక్రమాలు పెరగటం సులభం అవుతుంది. పాజిటీవ్‌గా ఆలోచిస్తే చాలా ప్రయోజనాలే సిద్ధిస్తాయి అని అర్థం అవుతుంది.

  2. “మోడీ వస్తే విదేశాల్లోని నల్ల డబ్బు అంతా వెనక్కి తెచ్చేస్తాడు” అన్న చెత్త నమ్మకంలో నేనైతే లేను. “అధికారం ఇస్తే విదేశీ డబ్బు తెఛ్చి ఒక్కొక్కరి ఖాతాలో 14 లక్షలు జమ చేస్తా’ అని మోడీ చెప్పగానే నమ్మేటంత వెర్రి, గుడ్డి నమ్మకాలు నాకు లేవు. వాస్తవం ఏమిటో కాస్త ఆలోచించాను గనుకనే ఇది రాసాను.

    అక్కడికి నల్ల డబ్బు పెద్దలంతా నిజాయితీగా ఆ డబ్బు తెఛ్చి బ్యాంకుల్లో జమ చేసేసినట్లే?! మోడీ ఓ ప్రకటన చేయగానే, అందరూ వణికిపోయేసి నల్ల డబ్బు ప్రభుత్వం వాసం చేసేస్తారనో, లేదా తమ డబ్బుని వదిలిపెట్టుకుంటారనో, మీరు నమ్మితే నమ్మండి. నేను నమ్మడం లేదు.

    అధికారం లోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఇంతవరకు చేసింది లేదు. ఇప్పుడు కొత్తగా చేస్తారంటే నమ్మే వాజమ్మలు మీరు కావచ్చుఁ గానీ దాన్ని అవతలి వాళ్ళ మీద రుద్దడం సబబు కాదు.

    ఢిల్లీ ఏసీబీ విభాగాన్ని బలవంతంగా ఢిల్లీ ప్రభుత్వం నుండి ఎందుకు లాక్కున్నారో చెప్పండి. DDCA కుంభ కోణం పైన విచారణ చేస్తున్న AAP ని లెందుకు అడ్డుకున్నారో చెప్పండి. విదేశీ ఖాతాల విషయం ఒక్క చర్యా ఎందుకు లేదో చెప్పండి. గుజరాత్ సీఎం గా ఉన్నపుడు మోడీ లోకాయుక్త పదవిని పదేళ్లు ఎందుకు భర్తీ చేయలేదో చెప్పండి.

    ఉన్న సబ్సిడీలు రద్దు చేస్తుంటే సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతాయని ఎలా ఊహిస్తున్నారు? వ్యవసాయ గిట్టుబాటు ధరలు ప్రకటించే విధానానికి మోడీ ఎందుకు తిలోదకాలు ఇఛ్చినట్లు? కోర్టు మొట్టికాయలు వేసేదాకా ఉపాధి హామీ పధకం నిధులు ఎందుకు విడుదల చేయలేదు? ఆ విడుదల చేసిన మొత్తం కూడా గత ఏడు బాకీలకే సరిపోయింది. ఈ ఏడు నిధులు ఎప్పుడు? అసలు గత ఏడు చెల్లించకుండా ఎందుకు ఆపినట్లు? PSU లలో వాటాలు అమ్మేస్తూ వాటి కింద ఉన్న వేల ఎకరాల భూముల్ని ఉదారంగా ఇచ్ఛేస్తున్నారు. జనాల సొమ్ము ప్రయివేటు పెద్దలకి ఇవ్వడం అది కూడా విదేశీ కంపెనీలకి?!

    వాలంటరీ వెల్లడి ద్వారా వేల కోట్లు సంపాదించాం అంటున్నారు. ఆ వెల్లడి చేసిన వారికీ శిక్షలు ఉండవా? నల్ల డబ్బు ఏయే అక్రమ మార్గాల్లో సంపాదించింది ఆరా తియ్యరా? అక్రమాలకు పాల్పడినందుకు శిక్షలు వేయకుండా అదేదో ఘనకార్యం అన్నట్లు గొప్పలు చెప్పుకోవడం ఏమిటి? ఓహో కాంగ్రెస్ అది కూడా చెయ్యలేదనా? అయితే గొప్ప సంగతే సుమా!

    భూ సంస్కరణలని అమలు చేయకుండా కాంగ్రెస్ ఎగవేసింది. ఆ ఒక్కటి మోడీని చేయమనండి చాలు.
    లోతుగా చదువుతున్నానని మీరు అనుకుంటున్నారు. ఇంకా లోతుకి వెళ్ళాలి మీరు. వెళ్లడం ఇష్టం లేకపోతె అది మీ ఛాయిస్.

  3. “మోడీ వస్తే విదేశాల్లోని నల్ల డబ్బు అంతా వెనక్కి తెచ్చేస్తాడు”

    అనగానే….విదేశీ ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని ఉన్న ఫళంగా గా తరలించుకు పోయారు….ఇప్పుడు..
    మీరు ఒక పది కోట్లరూపాయల మీ ధనాన్ని వెళ్ళి మీ అకవుంట్లో వేసి…మార్చుకోండి…కొత్త నోట్లు వస్తాయ్…

    ఇప్పుడు ఆలోచించండి…

  4. గమనిస్తే రద్దు అనే పదం సరికాదు. రద్దు అంటే పూర్తిగా ఉండక పోవడం.
    నిజంగా రద్దయతే దేశానికి పూర్తిగా మంచిదే… కాని కాదు.
    మెల్లగా చూస్తే, ఇది కేవలం పాత నగదుకు బదులుగా కొత్త నగదు అని మాత్రమే అని అర్ధమవుతుంది.
    కొత్త అయిదు వందలు, వెయ్యి కాగితం కూడ వస్తుందిట.రెండు వేల కాగితంతో పాటు.
    ఈ నల్లడబ్బు క్రమబధ్ధీకరణ అయే పరిస్ధితులే ఎక్కువ కనిపిస్తున్నాయి.

    రద్దు రద్దనే మీడియా సునామీలో ఆలోచించడానికి కూడా సమయం లేదు.
    శేఖర్ గారి విశ్లేషణ సబబైనది.

    ఈ నల్లడబ్బు క్రమబధ్ధీకరణ అయే క్రమంలో అనివార్యంగా జరిగే కొంత మేలును మీడియా భూతద్దంలో చూపుతోందని గమనించవచ్చు.

    ఎంత తొందరంటే — కొత్త, పాత నగదును సమాంతరంగా కొన్ని నెలలపాటు కొనసాగించి, పాతవి క్రమంగా పరిహరించే వీలున్నప్పటికీ, వారాంతంలో పాతవి పరిహరించి, ప్రజలను ఇబ్బంది పడమని ఆదేశించడం ఏ రకంగా ప్రజలకు మేలుచేసినట్లు?

    శ్రీకాంత్ గడ్డిపాటి.

  5. “ఈ నల్లడబ్బు క్రమబధ్ధీకరణ అయే క్రమంలో అనివార్యంగా జరిగే కొంత మేలును మీడియా భూతద్దంలో చూపుతోందని గమనించవచ్చు.”

    కరెక్ట్ గా చెప్పారు శ్రీ కాంత్ గారు. మీరు చెప్పిన సునామీ కోసమే ఈ ఎత్తు.

  6. “ఇప్పుడు.. మీరు ఒక పది కోట్లరూపాయల మీ ధనాన్ని వెళ్ళి మీ అకవుంట్లో వేసి…మార్చుకోండి…కొత్త నోట్లు వస్తాయ్”

    అవును. డిపాజిట్ల పైన పన్ను వేస్తాం అంటున్నారు గానీ లెక్కలు అడుగుతాం, సరైన లెక్క చూపకపోతే ఆదాయ పన్ను చట్టం అమలు చేస్తాం అనడం లేదు. నల్ల డబ్బుని వైట్ చేసుకునేందుకు ఇది అవకాశం. సరిగ్గా చూస్తే మొన్నటి వరకు అమలు చేసిన వాలంటరీ వెల్లడి స్కీమ్ నే మరో రూపంలో పొడిగిస్తున్నారు.

  7. @లెక్కలు అడుగుతాం, సరైన లెక్క చూపకపోతే ఆదాయ పన్ను చట్టం అమలు చేస్తాం ….

    నిజానికి ఏ వ్యవస్థ లో అయినా అదే జరుగుతుంది…మీ ఆదాయ మార్గం…దాని మీద పన్ను…అంతే కదండీ సూక్ష్మంగా…కానీ…పట్టణాలలో (కంటే) ఓ మోస్తరు బీ,సీ టవున్లలో విపరీతమయిఅన్ ఆదాయం….దాన్ని బ్లాక్ లో ఉంచుకోవడం నేను గమనించా…ఇరవై నాలుగు గంటలూ…డబ్బు సంపాయించే అక్రమ మార్గాలూ…దాన్ని దాచుకునే మార్గాలూ వెతికే జన్నాన్ని…లెక్కలు అడిగితే…అసలు బయట పెట్టనే పెట్టరు…చాలా వ్యాపార వర్గాల సంపాదన చూస్తే….మన గుండె గుభేలు మంటుంది…ఆ వ్యాపారాలూ…వారి ఆదాయ మార్గాలు దగ్గర నుంచి గమనించి చెప్తున్నా…సరీగ్గా …తమ సంపాదన ప్రకారం పన్నులు కడితే…మన దేశ ప్రజానీకానికి కావాల్సిన కనీస సదుపాయాలు చక్కగా సమ కూర్చుకోవచ్చు…పన్ను ఎగవేతల వల్లనే…ఇంత నల్ల ధనం ఏర్పదుతూ వుంది…

  8. నిజానికి ఏ వ్యవస్థ లో అయినా అదే జరుగుతుంది…మీ ఆదాయ మార్గం…దాని మీద పన్ను…అంతే కదండీ సూక్ష్మంగా…కానీ…పట్టణాలలో (కంటే) ఓ మోస్తరు బీ,సీ టవున్లలో విపరీతమయిఅన్ ఆదాయం….దాన్ని బ్లాక్ లో ఉంచుకోవడం నేను గమనించా…ఇరవై నాలుగు గంటలూ…డబ్బు సంపాయించే అక్రమ మార్గాలూ…దాన్ని దాచుకునే మార్గాలూ వెతికే జన్నాన్ని…లెక్కలు అడిగితే…అసలు బయట పెట్టనే పెట్టరు…చాలా వ్యాపార వర్గాల సంపాదన చూస్తే….మన గుండె గుభేలు మంటుంది…ఆ వ్యాపారాలూ…వారి ఆదాయ మార్గాలు దగ్గర నుంచి గమనించి చెప్తున్నా…సరీగ్గా …తమ సంపాదన ప్రకారం పన్నులు కడితే…మన దేశ ప్రజానీకానికి కావాల్సిన కనీస సదుపాయాలు చక్కగా సమ కూర్చుకోవచ్చు…పన్ను ఎగవేతల వల్లనే…ఇంత నల్ల ధనం ఏర్పడుతూ వుంది…ఇప్పుడు ఆ వందల కోట్లని తమ ఎకవుంట్లలో నికి ఎలా జమ చేస్తారో…తమాషా చూడాలి…మన వాళ్ళు సామాన్యమయిన వాళ్ళు కాదు మరీ…

  9. నరేష్ గారు, విదేశాల్లో నల్ల డబ్బు బ్యాంకు బ్యాలన్స్ గా, పేపర్ కంపెనీల్లో పెట్టుబడులుగా, షేర్ మార్కెట్లలో investments గా, విదేశీ కరెన్సీలుగా ఉంటుంది. మన నోట్లు అక్కడ చెల్లవు, చిత్తు కాగితాల్లెక్క.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s