45 వ అధ్యక్షుడిని లేదా అధ్యక్షురాలిని ఎన్నుకునేందుకు అమెరికా ఈ రోజు ఉద్యుక్తం అవుతున్నది. ఈ ఆర్టికల్ రాసే సమయానికి 35 మిలియన్ల మంది ఓటు వేశారని, ఇంకా 70 మిలియన్ల ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉన్నదని పత్రికలు చెబుతున్నాయి. 65 శాతం వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్నదని అంచనా వేసినందున మరో 30-35 మిలియన్ల వరకు ఓటర్లు పోలింగ్ బూత్ లకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది.
ఓటు ఫలితం కోసం అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎంత ఆందోళనతో ఎదురు చూస్తున్నారో షేర్ మార్కెట్లు కూడా అంతే ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. మార్కెట్ల ఆందోళన హిల్లరీ క్లింటన్ పైన కాకుండా డోనాల్డ్ ట్రంప్ పైన కేంద్రీకరించబడింది. వాటి భయం అంతా డోనాల్డ్ ట్రంప్ గెలుస్తాడేమో అన్నదే. ప్రపంచీకరణ విధానాల వల్ల అమెరికా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ఉద్యోగాలు విదేశాలకు తరలిపోయాయని ఆరోపించిన ట్రంప్ తాను అధికారంలోకి వస్తే ఆ విధానాలను తిరగదోడతానని హామీ ఇవ్వడం అందుకు ఒక కారణం.
ట్రంప్ గెలుపు సాధిస్తే గనక షేర్ మార్కెట్లు 2 శాతం నుండి 6 శాతం వరకు పడిపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హిల్లరీ క్లింటన్ గెలిస్తే గనుక మరో 1 లేదా 2 శాతం మార్కెట్లు లాభ పడవచ్చని భావిస్తున్నారు. క్లింటన్ ఈ-మెయిల్ సర్వర్, ఈ మెయిళ్ల లీకేజి వ్యవహారంలో రెండో సరి విచారణకు ఆదేశించిన…
అసలు టపాను చూడండి 527 more words