కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన 4G స్పెక్ట్రమ్ పూర్తయింది. భారీ మొత్తంలో 4G స్పెక్ట్రమ్ ని వేలానికి పెట్టిన ప్రభుత్వానికి అంచనా వేసినంత భారీ ఆదాయం మాత్రం దక్కలేదు. కొన్ని కేటగిరీలలోని స్పెక్ట్రమ్ ని కంపెనీలు అసలు ముట్టుకొనే లేదు. బేస్ ధర చాలా ఎక్కువగా ఉన్నదని కంపెనీలు పెదవి విరిచాయి. మొత్తం మీద వేలంలో 65,789 కోట్ల మేర స్పెక్ట్రమ్ కొనుగోలు జరిగింది. అందులో ఈ సంవత్సరం రు 32,000/- ప్రభుత్వానికి ఆదాయంగా రానుంది.
అమ్మకానికి పెట్టిన స్పెక్ట్రమ్ మొత్తం అమ్ముడు పొతే 5.65 లక్షల కోట్లు ఆదాయం రావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం 2354.55 మెగా హర్ట్జ్ ల స్పెక్ట్రాన్ని అమ్మకానికి పెట్టారు. అందులో 965 MHz కు మాత్రమే కంపెనీల నుండి బిడ్లు అందాయి. ఇది మొత్తం స్పెక్ట్రంలో 41 శాతం మాత్రమే. 59% శాతం స్పెక్ట్రమ్ కు అసలు బిడ్ లు అందలేదు.
700, 800, 900, 1800, 2100, 2300, 2500 MHz ల ఫ్రిక్వెన్సీల స్పెక్ట్రమ్ లు వేలానికి పెట్టగా వాటిలో 700, 900 MHz ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ కు ఒక్క బిడ్ కూడా రాలేదని తెలుస్తోంది. తక్కువ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అత్యధిక విలువ కలిగి ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ తరంగాలు గోడల గుండా చొచ్చుకు వెళ్లగల శక్తిని కలిగి ఉంటాయి. ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలవు. కాబట్టి టవర్లు ఎక్కువగా నిర్మించవలసిన అవసరం…
అసలు టపాను చూడండి 399 more words