బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ శుక్రవారం లిప్తపాటు కాలంలో భారీగా పతనమై కలకలం సృష్టించింది. అనంతరం తిరిగి కోలుకున్నప్పటికీ పౌండ్ క్రాష్ తో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కలవర పడ్డాయి.
శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం అయ్యాక ఒక దశలో పౌండ్ విలువ 1.2600 డాలర్ల వద్ద ఉన్నది. ఇంతలో ఏమైందో ఏమో ఒక్కసారిగా పతనం కావడం మొదలయింది. ఎంత వేగంగా పతనం అయిందంటే కొద్ది సెకన్ల తర్వాత చూస్తే పౌండ్ విలువ 1.1378 డాలర్లుగా తెరల పైన ప్రత్యక్షం అయింది. ఇది 10 శాతం పతనంతో సమానం.
ఇంతకీ పౌండ్ స్టెర్లింగ్ ఎందుకు క్రాష్ అయిందో ఎవరికీ అంతుబట్టలేదు. సాంకేతిక కారణం వలన (కంప్యూటర్ లో సాఫ్ట్ వేర్ బగ్) క్రాష్ అయి ఉంటుందని కూడా ఎవరు చెప్పకపోవడం విశేషం. స్టాక్ మార్కెట్లు ముఖ్యానంగా పశ్చిమ దేశాల స్టాక్ మార్కెట్లు కంప్యుటర్ సాఫ్ట్ వేర్ ల సహాయంతో అత్యంత వేగంగా నడుస్తుంటాయి. అందువల్ల అప్పుడప్పుడు ట్రాఫిక్ లో ఆటంకాలు తలెత్తడంతో లేదా ఇతర కారణాల వల్లనో (కంప్యుటర్ గ్లిచ్ అని వీటిని అంటూ ఉంటారు) సాధారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఇప్పటి క్రాష్ కి దానిని కూడా కారణంగా చెప్పడం లేదు.
కారణం ఏమిటో చెప్పలేదు గాని ఈ కొద్ది సెకన్ల ట్రేడింగ్ ని రద్దు చేశారని రాయిటర్స్ న్యూస్ తెలిపింది. రద్దు చేసాక పౌండ్ విలువ 1.1491 గా నిర్ధారించారని తెలిపింది…
అసలు టపాను చూడండి 193 more words