150 అక్షరాల మైక్రో బ్లాగింగ్ సామాజిక వెబ్ సైట్ అయిన ట్విట్టర్ అమ్మకానికి వచ్చింది. కంపెనీని అమ్మకానికి పెట్టిన వ్యవస్ధాపకులు తమ బేరం అమ్మకం రూపం ధరించేది లేనిది చెప్పకున్నప్పటికీ ఇంటర్నెట్ బడా కంపెనీలు ట్విట్టర్ కోసం బిడ్ లు దాఖలు చేస్తున్నాయి.
ట్విట్టర్ కొనుగోలుకు గూగుల్ కూడా రంగం లోకి దిగిందని ఆరంభంలో వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆ వార్తలు వెనక్కి వెళ్లాయి. ట్విట్టర్ యజమానుల అనిర్దిష్ఠ ధోరణి గూగుల్ కంపెనీ వెనక్కి తగ్గటానికి కారణం అని తెలుస్తున్నది.
అక్టోబర్ 27 లోపు మొత్తం అమ్మకం ప్రక్రియ పూర్తీ కావాలని ట్విట్టర్ అధినేతలు తాజాగా ప్రకటించినట్లు తెలుస్తోంది. దానితో ట్విట్టర్ అమ్మకంపై మళ్ళీ మార్కెట్ వర్గాల్లో కదలిక వచ్చింది. ట్విట్టర్ ను ఇటీవలనే అమ్మకానికి పెట్టిన నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో అమ్మకం పూర్తి కావటం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. అసాధ్యమైన టైం లైన్ ప్రకటించడం ద్వారా అమ్మకానికి సిద్ధమా లేదా అన్న అనుమానాన్ని ట్విట్టర్ మిగిల్చిందని వారు చెబుతున్నారు.
కంపెనీ భవిష్యత్తు పైన వాటా దారులకు, ఉద్యోగులకు ఒక స్పష్టత ఇవ్వడం కోసమే సాధ్యమైనంత త్వరగా అమ్మకాన్ని పూర్తీ చేయాలని ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సీ భావిస్తున్నారని ట్విట్టర్ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్ఛే రెండు వారాల్లో బిడ్ లు పూర్తి చేసినట్లయితే వాటాదారులకు (షేర్ హోల్డర్లు) ఒక స్పష్టత వస్తుందని షేర్ విలువ పడిపోకుండా ఆపినట్లు…
అసలు టపాను చూడండి 256 more words