రిజర్వ్ బ్యాంకు పాలసీ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనర్ధం వడ్డీ రేటు 0.25% తగ్గుతుంది అని. 6.5% గా ఉన్న రేటు ఇప్పుడు 6.25% అయింది. ఈ కోతతో పారిశ్రామిక వర్గాలు సంతోషం ప్రకటించాయి.
అసలు కోతకు ముందే, కోత కోస్తారని ముందే ఊహిస్తూ సెన్సెక్స్ సూచి 377 పాయింట్లు పెరిగింది. దానితో అసలు కోత జరిగాక సూచి పెద్దగా పెరగలేదు.
తాజా వడ్డీ కోత వెనుక గమనించవలసిన కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి.
మాజీ గవర్నర్ తప్పు కోవాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి చేత అదుపు లేని ఆరోపణలు చేయించారు. ఆయన వల్లే జీడీపీ పెరగడం లేదని, ఆయనకీ దేశభక్తి లేదని, అమెరికా పౌరుడని… ఇంకా ఏవేవో. ఈ ఆరోపణల లక్ష్యం రాజన్ తనంతట తానె తప్పుకునేలా చేయడం.
ఎందుకని? ఎందుకంటే, ద్రవ్యోల్బణం పైన చూపుతో వడ్డీ రేటు తగ్గించడానికి బదులు పెంచుతున్నాడని రాజన్ పైన పరిశ్రమ వర్గాలు, స్వామి లాంటి నేతలు కత్తి గట్టారు. ఆయన తప్పుకోవాలని భావించారు. నేరుగా చెప్పలేక ‘పొమ్మన లేక పొగ పెట్టారు.’
ద్రవ్యోల్బణం పెరగడం అంటే ధరలు పెరగడం. ధరలు పెరగడం అంటే వ్యవస్ధలో ద్రవ్య చెలామణి ఎక్కువగా ఉండడం. కాబట్టి వడ్డీ రేటు పెంచి, లేదా తగ్గించకుండా కొనసాగించి అదనపు ద్రవ్యాన్ని చలామణి నుండి ఉపసంహరించడానికి RBI ప్రయత్నిస్తుంది. ఇది ఏ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయినా…
అసలు టపాను చూడండి 407 more words
మానిటరీ విధానాల్లో ప్రజల గురించి ఆలోచించి నిర్ణయాలు చేసే అవకాశాన్ని గవర్నర్ నుండి ప్రభుత్వం లాగేసుకుంది.
నిజంగా గవర్నర్ ప్రజలగురించి ఆలోచించి నిర్ణయాలు చేస్తుంటారా?
ప్రజల కోణంలో ఆలోచించి అర్.బి.ఐ పనిచేస్తుంటాదా?
కేంద్రం మాట వినక తప్పని పరిస్ధితిని కల్పించింది. ఇది ఆర్ధిక వ్యవస్ధకు మంచిది కాదు.
ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడుతున్న కేంద్ర ప్రభుత్వాలే ప్రజలకొరకు పనిచేయనపుడు ఈ బ్యూరోక్రసి ప్రజలను ఉద్దరించుతున్నదా?
ఆర్‌బిఐ ప్రధాన దృష్టి కోణం ద్రవ్య నియంత్రణ. కనుక ద్రవ్యోల్బణం (ద్రవ్య + ఉల్బణం) గురించి అది తప్పనిసరిగా పట్టించుకోవాలి. ద్రవ్యోల్బణం నేరుగా ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి స్వతంత్ర ఆర్‌బిఐ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం చేసుకుంటే అది అనివార్యంగా జనానికి లాభం. అయితే దాని చర్యలు జనానికి చేరేలోపు అనేక పొరల్ని దాటాలి కనుక చేరే లోపు బలహీన పడటం ఒక విషయం. కానీ ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడటం నిజమే.
ప్రజలకోసం పని చేద్దాం అని ఆర్‌బిఐ అనుకోవడం వల్ల జనానికి మేలు జరగడం కాదు, దాని పని అది చేస్తే (చేయనిస్తే) జనానికి మేలు జరుగుతుంది. బ్యూరోక్రసీ అయినా తన పని తాను చేస్తే జనానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది.
ప్రభుత్వము – బ్యూరోక్రసీల మధ్య మీరు చెప్పిన తేడా ఉండడం నిజమే. కానీ ఇప్పుడు ఆ హద్దు మసకబారుతోంది.