“హస్తిమశకాంతరం” అని తెలుగులో ఒక పదబంధ ప్రయోగం ఉంది. హస్తి అంటే ఏనుగు; మశకం అంటే దోమ. ఏనుగుకు, దోమకు ఉన్నంత తేడా అని దీని అర్ధం.
మొన్న మన ఆర్ధిక మంత్రి గారు, సగర్వంగా -ప్రధాన మంత్రి మోడి ప్రశంసల మధ్య- ప్రకటించిన నల్ల డబ్బుకీ, ఎన్నికలకు ముందు మోడి ప్రకటించిన నల్ల డబ్బు అంచనాకు మధ్య ఉన్న తేడాను ఈ పదబంధంతో చెప్పవచ్చు.
తమ ఐడిఎస్ (ఆదాయ ప్రకటన పధకం) స్కీం ద్వారా 65 వేల కోట్ల ఆదాయాన్ని బైటికి తెచ్చామని, అందులో 30 వేల కోట్లు ప్రభుత్వానికి పన్నుగా వస్తుందనీ, దానిని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని ఆర్ధిక మంత్రి గారు ఆర్భాటంగా ప్రకటించారు.
మోడి గారు ప్రకటించిన 18 కోట్ల కోట్లకీ, 65 వేల కోట్లకీ హస్తిమశకాంతరం ఉన్నదని ఈ కార్టూన్ చక్కగా గీతల్లో చూపిస్తోంది. అరుణ్ జైట్లీ గారు, తాను ఏదో, ఎంతో సాధించేసినట్లుగా వ్యక్తం చేస్తున్న సంతృప్తికర హావభావాలని గమనించండి!