ప్రపంచ చమురు మార్కెట్ లో సరఫరా, గిరాకీ (డిమాండ్) ల మధ్య సమతూకం నెలకొల్పే ప్రయత్నంలో రోజుకి 700,000 బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని ఉమ్మడిగా తగ్గించడానికి అల్జీర్స్ లో జరిగిన అసాధారణ సమావేశంలో చమురు ఎగుమతి దేశాల సంఘం (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ -ఒపెక్ ) కుదుర్చుకున్న ఒప్పందం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రెండేళ్లుగా దిగజారుతున్న ప్రపంచ క్రూడ్ ధరలు మరింత పడిపోకుండా నిలబెట్టడానికి ఈ గ్రూపు నిశ్చయాత్మకమైన చర్యలు తీసుకోవాలని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ జారుడు వలన 2014 ఆగస్టు చివర్లో బ్యారెల్ కు 103 డాలర్లు పలికిన బ్రెంట్ క్రూడ్ ఈ ఏడు సెప్టెంబర్ 1 నాటికి సగానికి పైగా పడిపోయి 45.5 డాలర్లకు చేరింది. అయినప్పటికీ ఉత్పత్తి కోతలకు సంబంధించి విభేదాలతో, వివక్షలతో నిండిన ఒపెక్ సభ్య దేశాల మధ్య అర్ధవంతమైన ఏకాభిప్రాయం ఉన్నది లేనిది అస్పష్టంగానే ఉన్నది -ఈ గ్రూపులో అతి చిన్నదే అయినా సంపన్నవంతమైన పశ్చిమాఫ్రికా దేశం గాబన్ -సంక్షోభాలలో మునిగి తేలుతున్న వెనిజులా, ఇరాన్, సౌదీ అరేబియా లాంటి ముఠాలతో నిండిన పశ్చిమాసియా దేశాలు ఈ గ్రూపులో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఒక్కో దేశం నిర్దిష్టంగా ఉత్పత్తిలో ఎంత కోత విధించుకోవాలన్న అంశాన్ని నవంబర్ లో జరగనున్న సమావేశానికి వదిలివేసినప్పటికీ, 56 ఏళ్ళ వయసు గల ఈ సంస్ధలోని అత్యధిక చమురు ఉత్పత్తి దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు…
అసలు టపాను చూడండి 689 more words