చమురు ఉత్పత్తిలో కోత పెట్టుకునేందుకు చమురు ఉత్పత్తి – ఎగుమతి దేశాల కూటమి OPEC (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్) నిర్ణయించింది. కూటమి నిర్ణయించిన కోత పరిమాణం స్వల్పమే అయినప్పటికీ ఉత్పత్తి తగ్గించేందుకు ఇన్నాళ్లు సౌదీ అరేబియా నిరాకరించిన నేపథ్యంలో ఈ చర్య తదుపరి చర్యలకు ప్రారంభం అవుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.
గత నాలుగైదు ఏళ్లుగా చమురు ధరలు అత్యంత అధమ స్ధాయిలో కొనసాగుతున్నాయి. ధరలు ఎంతగా తగ్గినప్పటికీ ఆ తగ్గుదల భారత దేశం లాంటి చోట్ల ప్రజలకు అందకుండా ఆయా కేంద్ర ప్రభుత్వాలే అడ్డు పడ్డాయి. చమురు ధరలు తగ్గిన మేర కస్టమ్స్ సుంకాలు, ఇంకా అనేక తరహా పన్నులు జనం నుండి వసూలు చేశాయి. ఇండియాలో అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు పన్నులు మోది ధరల తగ్గుదల కాస్త కూడా జనానికి అందకుండా చేశాయి.
చమురు ధరలు భారీ మొత్తంలో తెగ్గోయడానికి కారణం భౌగోళిక ఆధిపత్య రాజకీయాలు. మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) లో తన ఆధిపత్య, సామ్రాజ్యవాద విస్తరణ యుద్ధాలకు, ఎత్తులకు అడుగడుగునా అడ్డు పడుతున్న రష్యా, అమెరికా ల ఆర్ధిక వ్యవస్ధలను నష్టపరిచేందుకు, దక్షిణ అమెరికాలో తన ఆధిపత్యానికి సవాలుగా అవతరించిన వెనిజులా, ఈక్వడార్ తదితర దేశాల ఆర్ధిక వ్యవస్ధలను నాశనం చేసేందుకు సౌదీ అరేబియా, అమెరికా దేశాలు అత్యధిక మొత్తంలో చమురు ఉత్పత్తి మొదలు పెట్టాయి. అమెరికా తన భూభాగంపై…
అసలు టపాను చూడండి 400 more words